Don't Miss
Home / తెలుగు / ఆ దృశ్యాల‌న్నీ `మెట్రో` సినిమాలో చూడొచ్చు!

ఆ దృశ్యాల‌న్నీ `మెట్రో` సినిమాలో చూడొచ్చు!

ఆ దృశ్యాల‌న్నీ `మెట్రో` సినిమాలో చూడొచ్చు!
metro-movie-stills01
బోడుప్ప‌ల్ చైన్ స్నాచింగ్ – ఈనాడు
అడ్రస్ అడిగి తెంచుకుపోయాడు:  సాక్షి డాట్‌కాం
బంజారాహిల్స్‌లో చైన్ స్నాచింగ్ :  సాక్షి డాట్‌కాం
సింగ‌రాయ‌కొండ‌లో చైన్ స్నాచింగ్‌: ఆంధ్ర‌జ్యోతి డాట్‌కాం
చైన్ స్నాచింగ్ చేస్తున్న రెండు ముఠాల అరెస్ట్‌: ఆంధ్ర‌జ్యోతి
రైల్వేస్టేషన్‌లో చైన్ స్నాచింగ్: న‌మ‌స్తే తెలంగాణ డాట్ కాం
హైదరాబాద్‌ : మళ్లీ చైన్‌ స్నాచింగ్ – ఆంధ్ర‌ప్ర‌భ‌
చైన్‌ స్నాచింగ్ కలకలం- ప్ర‌జాశ‌క్తి
హైద‌రాబాద్‌లో 11 చైన్ స్నాచింగ్ ఇన్సిడెంట్లు- టీవీ9
చైన్ స్నాచింగ్ నేప‌థ్యంలో – ఎన్టీవీ తెలుగు డాట్‌కాం
టీవీ5 స్పెష‌ల్ స్టోరి ఆన్ `నో సేఫ్టీ ఫ‌ర్ ఉమెన్‌`
చైన్ స్నాచింగ్ టెర్ర‌ర్ గ్రిప్స్ హైద‌రాబాద్ – సాక్షి స్పెష‌ల్ ఎడిష‌న్‌
చైన్‌ స్నాచింగ్‌ ముఠా అరెస్ట్ …అరకిలో బంగారం స్వాధీనం – హెచ్ఎం టీవీ
చైన్ స్నాచింగ్ దాడిలో పాప మృతి: ఎక్స్‌ప్రెస్ టీవీ
నేరెడ్‌మెట్ చైన్ స్నాచింగ్ కేసులో ట్విస్ట్…..పసికందును చంపింది తల్లే…!
రెచ్చిపోతున్న చైన్ స్నాచింగ్ దొంగలు:  సివిఆర్ న్యూస్
విమానాశ్రయం సమీపంలో చైన్ స్నాచింగ్ – మన తెలంగాణ
కర్నూలులో రెండుచోట్ల చైన్ స్నాచింగ్ -ఆంధ్ర‌భూమి
… ఎందెందు వెతికినా ఒక‌టే వార్త‌. చెయిన్ స్నాచింగ్‌.. !! ఇటీవ‌లి కాలంలో వార్త‌ల్లో ఇదో హాట్ టాపిక్‌. నిత్యం ర‌ద్దీగా ఉండే జ‌న సంచారం లో ద‌ర్జాగా చైన్ స్నాచ‌ర్లు మెడ‌లో గొలుసులు లాక్కెళ్లిపోవ‌డం సంచ‌ల‌నమ‌వుతూనే ఉంది. వార్తా ప‌త్రిక‌లు చ‌దివినా.. టీవీ చానెళ్లు ట్యూన్  చేసినా.. వెబ్ మీడియాని క‌దిలించినా.. ప్ర‌తిచోటా చైన్ స్నాచింగ్ వార్త‌లే.
ఈ బ‌ర్నింగ్ టాపిక్‌పై సినిమా చేస్తే .. అదో పెను సంచ‌ల‌న‌మే. అది కూడా రియ‌లిస్టిక్‌గా మ‌న క‌ళ్ల ముందే జ‌రుగుతున్న‌ట్టు చూపించ‌గ‌లిగితే అది బంప‌ర్ హిట్టే. స‌రిగ్గా ఇలాంటి కాన్సెప్టుతోనే చైన్ స్నాచింగ్ నేప‌థ్యంలోనే తెర‌కెక్కిన చిత్రం -`మెట్రో`. రియ‌లిస్టిక్ క‌థ‌లు, నేచుర‌ల్ పెర్ఫామెన్సెస్‌తో తెలుగు వారికి ఏమాత్రం తెలియని ఫేస్‌ల‌తోనే సూప‌ర్‌హిట్‌లు వ‌స్తున్న ఈరోజుల్లో అలాంటి కాన్సెప్టుని వెతికి ప‌ట్టుకుని అందిస్తున్నారు.. `ప్రేమిస్తే`, `జ‌ర్నీ`, `షాపింగ్‌మాల్‌`, `పిజ్జా`చిత్రాల నిర్మాత సురేస్ కొండేటి స్వీయ స‌మ‌ర్ప‌ణ‌లో, ఆర్‌4 ఎంట‌ర్‌టైన్‌మెంట్ అధినేత ర‌జ‌ని తాళ్లూరి ఈ చిత్రాన్ని తెలుగువారికి అందిస్తున్నారు. ఆనంద్ కృష్ణ‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌గా.. జోహ‌న్ సంగీతం అందించారు. సాహితి పాట‌లు, మాట‌లు అందించారు. ఈ సినిమా పాట‌ల రికార్డింగ్ స‌హా అనువాద కార్య‌క్ర‌మాలు పూర్త‌య్యాయి. న‌వంబ‌ర్‌లో సినిమాని రిలీజ్ చేసేందుకు నిర్మాత‌లు ప్లాన్ చేస్తున్నారు.
ఇవిగో లేటెస్ట్ పోస్ట‌ర్లు, డిజైన్లు సంచ‌ల‌నం సృష్టిస్తున్నాయి. చైన్ స్నాచ‌ర్లు ఏమేం చేస్తారో ఆవిష్క‌రిస్తూ .. రూపొందించిన ఈ డిజైన్స్ క్రియేటివ్ స్ట‌ఫ్‌తో ఆక‌ట్టుకుంటున్నాయి. మ‌హిళ మెడ‌లో చైన్ తెంచేసిన స్నాచ‌ర్‌, చెవి కోసి దుద్దులు ఎత్తుకెళ్లిన దొంగ .. బైక్‌పై హెల్మెట్ పెట్టుకుని వ‌చ్చి చైన్ లాక్కెళ్లిన దొంగ‌.. ఇలాంటివ‌న్నీ మెట్రో సినిమాలో  చూడొచ్చ‌ని ఈ పోస్ట‌ర్లు చెప్ప‌క‌నే చెబుతున్నాయి. చైన్ స్నాచింగ్ పేద‌ల‌ జీవితాల్లో ఎలా నిప్పులు పోస్తుందో కూడా ఈ సినిమాలో చూడొచ్చు