Home / Reviews / Movie Reviews / `వ‌జ్రాలు కావాలా నాయ‌నా` మూవీ రివ్యూ!

`వ‌జ్రాలు కావాలా నాయ‌నా` మూవీ రివ్యూ!

`వ‌జ్రాలు కావాలా నాయ‌నా` మూవీ రివ్యూ!
Vajralu-Kavala-Nayana-Telugu-Movie-Posters-2
               బేన‌ర్ః శ్రీ పాద ఎంటర్టైన్మెంట్స్
               క‌థ‌- నిర్మాతః కిషోర్ కుమార్ కోట
               న‌టీన‌టులుః  అనిల్, నేహ దేశ్ పాండే, నిఖిత, విజ‌య్ సాయి, కిషోర్ కుమార్ కోట‌, చిట్టి బాబు.
               ద‌ర్శ‌క‌త్వంః పి.రాధాకృష్ణ‌
               సంగీతంః జాన్ పొట్ల‌
               నేప‌థ్య సంగీతంః శివ ప్ర‌సాద్
                పాట‌లుః సురేష్ గంగుల‌, ర‌వికిర‌ణ్‌
                జాన‌ర్ః కామెడీ హ‌ర్ర‌ర్
                 రేటింగ్ః  3.25/5
 క‌ష్ట‌ప‌డి డ‌బ్బు సంపాదించాలే కానీ, అడ్డ‌దారిలో డ‌బ్బు సంపాదించాల‌నుకుంటే ఏదో ఒక ప్రాబ్ల‌మ్ లో ఇరుక్కోవ‌ల‌సి వ‌స్తుందన్న కాన్సెప్ట్ కి  ల‌వ్, స‌స్పెన్స్  థ్రిల్ల‌ర్ అంశాల‌ను మేళ‌వించి కామెడీ హ‌ర్ర‌ర్ చిత్రంగా `వ‌జ్రాలు కావాలా నాయ‌నా` చిత్రాన్ని నిర్మించారు కిషోర్ కుమార్ కోట‌. సినిమాల ప‌ట్ల ఎంతో పాష‌న్ ఉన్న కిషోర్ కుమార్  కోట తొలిసారిగా  నిర్మాత‌గా మారి కొత్తవాళ్ల‌కు అవ‌కాశాలు క‌ల్పిస్తూ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా ద్వారా విఎఫ్ ఎక్స్ లో ఎంతో అనుభం ఉన్న పి.రాధాకృష్ణ ఈ చిత్రం ద్వారా ద‌ర్శ‌కుడుగా ప‌రిచయమ‌య్యారు. ఈ చిత్రం ఈ నెల 17న గ్రాండ్ గా అత్యధిక థియేట‌ర్ల‌లో విడుద‌లైంది. మ‌రి  కొత్త వాళ్ల‌కు అవ‌కాశాలు క‌ల్పిస్తూ చ‌క్క‌టి ఎంట‌ర్ టైన‌ర్ ను ప్రేక్ష‌కుల‌కు అందించాల‌న్న నిర్మాత కిషోర్ కుమార్ కోట సంక‌ల్పం ఎంత వ‌ర‌కు నెర‌వేరిందో తెలుసుకునే ప్ర‌య‌త్నం చేద్దాం…
 క‌థ‌లోకి వెళితే…
 ఐదుగురు ఫ్రెండ్స్ ఒకే రూమ్ లో ఉంటూ అద్దె క‌ట్టిలేని ప‌రిస్థితుల్లో ఉంటారు. బాగా డ‌బ్బు సంపాదించి లైఫ్ లో సెటిలై పోవాల‌న్న‌ది వాళ్ల గోల్. అందుకోసం అన్ని విధాల ప్ర‌య‌త్నాలు చేస్తుంటారు. కానీ ఏదీ వ‌ర్క‌వుట్ కాదు. ఇలాంటి ప‌రిస్థితుల్లో హీరో త‌న క‌ర్త‌వ్యంలో భాగంగా ఓ ఇంటికి సీక్రెట్ గా ఓ నైటు మనీ రిక‌వ‌రీకి వెళ‌తాడు. ఆ స‌మ‌యంలో అక్క‌డ త‌న‌కు ఒక క‌వ‌ర్ దొరుకుతుంది. ఆ ఇంట్లో ఒక రాణి ఉంద‌నీ, ఆమె న‌డుముకు కోట్లు విలువ చేసే డైమండ్స్ ఉన్నాయ‌ని తెలుసుకున్న హీరో త‌న మిత్రుల‌తో క‌లిసి దాన్ని కాజేయాలని ప్లాన్ చేస్తాడు. అస‌లు ఆ రాణి ఎవ‌రు?  ఆ డైమండ్స్ ఎక్క‌డున్నాయి?  చివ‌ర‌కు ఆ డైమండ్స్ వీళ్ల‌కు ద‌క్కాయా?  లేదా? అన్న‌ది చిత్ర క‌థాంశం.
న‌టీన‌టుల ప‌ర్ ఫార్మెన్స్ …
హీరో అనిల్ త‌న పాత్ర‌లో  ఇమిడిపోయాడు. డ‌బ్బు బాగా సంపాదించి బిలియ‌నీర్ అయిపోవాల‌ని తాప‌త్ర‌య ప‌డే ఓ మిడిల్ క్లాస్ కుర్రాడిగా త‌న న‌ట‌న ఓకే అనిపిస్తుంది. అలాగే రాణి పాత్ర‌లో నేహ‌దేశ్ పాండే చాలా నేచ‌ర‌ల్ గా న‌టించింది. త‌న చుట్టూ క‌థ న‌డుస్తుంది. ముఖ్యంగా స‌రోవ‌రం సుమాలై…అనే పాట‌లో క్లైమాక్స్ లో నేహ ప‌ర్ ఫార్మెన్స్ ఆక‌ట్టుకుంటుంది. మ‌రో హీరోయిన్ గా న‌టించిన నిఖిత ఆన్ స్ర్కీన్ బాగానే అనిపించినా కూడా యాక్టింగ్ లో అంత ఈజ్ కనిపించలేదు. ప్ర‌తి దానికి భ‌య‌ప‌డే పాత్ర‌లో క‌మెడియ‌న్ విజ‌య్ సాయి రాణించాడు. త‌ను చెప్పే డైలాగ్స్ కూడా ప్రేక్ష‌కుల‌ను క‌డుపుబ్బ న‌వ్విస్తాయి. చిట్టిబాబుది ఫుల్ లెంగ్త్ పాత్ర అయిన‌ప్ప‌టికీ క్లైమాక్స్ లో మాత్ర‌మే త‌న పాత్ర మెప్పించే విధంగా ఉంది. నిర్మాత కిషోర్ కుమార్ కోట కూడా రాణి బాబాయిగా పాత్ర‌కు త‌గ్గ‌ట్టుగా అభినయించారు.
సాంకేతిక నిపుణుల ప‌నిత‌నంః
జాన్ పొట్ల అందించిన “స‌రోవ‌రం సుమాలై .. `నాలోని ప్రేమ‌ని…ఈ రెండు పాట‌లు విన‌డానికి బావున్నాయి. అలాగే నేప‌థ్య సంగీతం తో శివ‌ప్ర‌సాద్ సినిమాను మ‌రో స్థాయికి తీసుకెళ్లారు. ప్ర‌తి సీన్ ని త‌న ఆర్ ఆర్ తోఎలివేట్  చేశారు. సినిమాటోగ్ర‌ఫీ సినిమాకు మైన‌స్ అని చెప్పాలి.   ఎడిట‌ర్ త‌న క‌త్తెర‌కు ఎక్కువ‌గా ప‌ని చెప్ప‌లేక‌పోయాడు. అక్కడికి ఎడిటర్ పనితనం చాలా సీన్స్ కి ప్లస్ అయ్యింది. కొన్ని సీన్స్ కొంచెం లెంగ్తీ గా అనిపిస్తాయి. నిర్మాత క‌థ డిమాండ్ మేర‌కు ఎక్క‌డ రాజీ పడ‌కుండా ఖ‌ర్చు పెట్టారు. సినిమా ను మంచి పబ్లిసిటీ తో గ్రాండ్ గా విడుదల చేసారు.  సినిమా ను ‌నిర్మించిన విధానం చూస్తే  నిర్మాతకు సినిమాల పట్ల ఉన్న అభిరుచి ఏమిటో తెలుస్తుంది. దర్శకుడు రాధాకృష్ణ ఎవ‌రి ద‌గ్గ‌ర వ‌ర్క్ చేయ‌న‌ప్ప‌టికీ సినిమా మీదున్న అభిరుచితో క‌థ‌కు న్యాయం చేశాడు. డైర‌క్ష‌న్ లో చిన్న చిన్న లోటు పాట్లు ఉన్న‌ప్ప‌టికీ, చాలా లాజిక్ లు మిస్స‌యిన‌ప్ప‌టికీ  ఓవ‌రాల్ గా ఫ‌స్ట్ సినిమా డైర‌క్ట‌ర్ గా పాస్ మార్కులు సంపాదించాడు. 
ప్ల‌స్ పాయింట్స్ః
నిర్మాణ విలువ‌లు
నేప‌థ్య సంగీతం
పాట‌లు
ద‌ర్శ‌క‌త్వం
హీరోయిన్ నేహ‌దేశ్ పాండే ప‌ర్ ఫ్మార్మెన్స్
కామెడీ
క్లైమాక్స్ 
మైన‌స్ పాయింట్స్ః
ల్యాగ్ సీన్స్
కెమెరా వ‌ర్క్ 
ఫైన‌ల్‌గా…
ప్ర‌జంట్  యూత్ అడ్డ దారిలో డ‌బ్బు సంపాదించి,  లైఫ్ బిందాస్ గా లీడ్ చేయాల‌న్న మ‌త్తులో ప‌డి లైఫ్ ని ఎలా రిస్క్ లో ప‌డేసుకుంటున్నార‌న్న మంచి మెసేజ్ ని ఈ చిత్రం ద్వారా అందించారు. క‌ష్ట‌ప‌డ‌కుండా ఏదీ రాదు అలా వ‌స్తే దానితో బోలెడె ప్రాబ్లెమ్స్ వ‌స్తాయ‌ని క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్టు చూపించే ప్ర‌య‌త్నం చేశారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. ఈ అంశానికి ల‌వ్, స‌స్పెన్స్ ,థ్రిల్లింగ్ అంశాల‌ను జోడించి సినిమాను ఫ‌స్ట్ సీన్ నుంచి ఎండ్ సీన్ వ‌ర‌కు ఎంట‌ర్ టైన్ మెంట్ ను జోడించారు. ఈ స‌మాజం మ‌న‌ల్ని నిజాయితిగా బ్ర‌త‌క‌నివ్వ‌రు, తెలివిగా బ్ర‌త‌క‌నిస్తుంది..కాబట్టి తెలివిగా మ‌నం సంపాదించాల‌ని  హీరో చెప్పే డైలాగ్స్ ఆలోచింప‌జేసే విధంగా ఉంటాయి. వ‌జ్రాలు దోచుకోవాల‌ని రాణి ఇంటికి వెళ్లిన ఐదుగురు ఫ్రెండ్స్ అక్క‌డ రాణి అనే అమ్మాయ‌స‌లు లేదు. ఆ ఇంట్లో దెయ్యాలు తిరుగుతున్నాయి. కానీ ఆ దెయ్యాలు హీరోకి మాత్ర‌మే  ఎందుకు కన‌ప‌డుతున్నాయ‌న్న అంశం ఎగ్జైటింగ్ క‌లిగించే విధంగా ఉంటుంది. ఆ ఇంట్లో వ‌జ్రాలు కోసం వెళ్లిన వారితో దెయ్యం ఆడుకునే విధానం క‌డుపుబ్బ న‌వ్వించే విధంగా ఉంటుంది. జ‌బ‌ర్ ద‌స్త్ కి పేర‌డీగా చేసే జ‌బ‌ర్ దోస్త్ లో కామెడీ అంతా ఇంతా కాదు. ఎక్క‌డా వ‌ల్గారిటీ లేకుండా ఫ్యామిలీ అంతా కూర్చోని హాయిగా న‌వ్వుకునే ఫుల్ లెంగ్త్ ఎంట‌ర్ టైన‌ర్ వ‌జ్రాలు కావాలా నాయ‌నా!
సూటిగా చెప్పాలంటేః ఎంట‌ర్ టైన్ మెంట్ కావాలా నాయనా!
రేటింగ్ః  3.25/5