Home / Featured / Premalo Padithe 100% Breakup Movie Review

Premalo Padithe 100% Breakup Movie Review

57665650
 ‘ప్రేమలో పడితే 100% బ్రేకప్‌’ మూవీ రివ్యూ!
బేన‌ర్ః ఎస్‌బి ఎంటర్‌టైన్‌మెంట్‌
న‌టీన‌టులుః ఎజిల్‌ దురై, మధుమిల, అభినయ, మైమ్‌ గోపి, 
మద్రాస్‌ రమ, మహానది శంకర్
సంగీతంః రాజ్‌భరత్‌
ఎడిటర్‌: లారెన్స్‌ కిషోర్‌
సినిమాటోగ్రఫి: ఎం.మనీష్‌
నిర్మాత: ఎస్‌.బాలసుబ్రమణ్యన్‌, 
దర్శకత్వం: ఎజిల్‌ దురై
రేటింగ్ః 3\5
ఎస్‌బి ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై ఎజిల్‌ దురై హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన ‘సెంజిత్తలే ఎన్‌ కాదలా’ అనే తమిళ చిత్రాన్ని తెలుగులో  ‘ప్రేమలో పడితే 100% బ్రేకప్‌’ పేరుతో అనువదించారు ఎస్‌. బాలసుబ్రమణ్యన్‌. మధుమిల, అభినయ హీరోయిన్లుగా నటించారు.  లవ్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రం  ఈ శుక్ర‌వారం విడుద‌లైంది. ప్ర‌జంట్ యూత్‌ను టార్గెట్ చేస్తూ ల‌వ్ ఎంటర్ టైన‌ర్ గా రూపొందించిన‌ ఈ చిత్రం  ప్రేక్ష‌కుల‌ను ఏ మేర‌కు ఆక‌ట్టుకుంటందో తెలుసుకునే ప్ర‌య‌త్నం చేద్దాం…
క‌థ‌లోకి వెళితే…
అను అనే అమ్మాయి ప్రేమ‌లో ప‌డ‌తాడు  వీరు. వాలైంటైన్ డే రోజు త‌న ప్రేమ‌ను అనుతో వ్య‌క్త ప‌రుస్తాడు. ఇలా వీరిద్ద‌రూ ప్రేమ‌లో మునిగి తేలుతుంటారు. ఈ క్ర‌మంలో అను కాలేజ్ లో చ‌దువుతున్న ఓ కుర్రాడితో మెల్ల‌గా ద‌గ్గ‌ర‌వుతుంది. వీరు కి  ఇష్టం లేకున్నా ఇద్ద‌రూ ఓ రోజు బైక్ పై లాంగ్ డ్రైవ్ కి వెళ్తారు.   అక్క‌డ ఆ కుర్రాడు అనుకి ప్ర‌పోజ్ చేస్తాడు. వీరు క‌న్నా అన్ని విధాలుగా పై స్థాయిలో ఉన్న త‌న‌తో తిర‌గ‌డం మొద‌లు పెడుతుంది అను. ఈ విషయం తెలుసుకున్న వీరు , అను ని మందలిస్తాడు.  ఇక  చిన్న‌గా వీరుని ఎలాగైనా సైడ్ చేయాల‌నుకుంటుంది అను. దీనికి త‌న ఫ్రెండ్స్ స‌పోర్ట్ చేస్తారు. ఓ రోజు అను -వీరుతో మ‌నం బ్రేక‌ప్ అయిపోదాం అని చెప్పేస్తుంది. వీరుకు ఇష్టం ఉండదు కానీ, అను అన్ని విధాలుగా వీరును ఇరిటేట్ చేస్తుంది. ఇక త‌న ప్రేమ ఫెయిల‌వ‌డంతో వీరు దేవ‌దాసులా మారిపోతాడు. ఇంటి నుంచి స‌డ‌న్ గా ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోతాడు. లాయ‌రైన త‌న తండ్రి రివాల్వ‌ర్ తీసుకుని వీరు ఒక వారం రోజుల పాటు ఎక్క‌డికి వెళ్లాడు. ఈ గ్యాప్ లో ఏం జ‌రిగింది?  అను త‌న ఫ్రెండుతోనే  ఉండిపోయిందా ఇంకా ఎంత మంది  బాయ్ ఫ్రెండ్స్ ని మార్చుతుంది అన్నది చిత్ర క‌థాంశం.
న‌టీన‌టులు….
ఎజిల్ దురై ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తూ హీరోగా న‌టించిన చిత్ర‌మిది. త‌న‌కిది తొలి సినిమా అయినా కానీ ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి పాత్ర‌లో ఒక సిన్సియ‌ర్ ప్రేమికుడుగా చాలా బాగా న‌టించాడు. ముఖ్యంగా త‌న ప్రేమ‌ను ద‌క్కించుకోవ‌డానికి అనుని ప్రాధేయ‌ప‌డే స‌న్నివేశాల్లో ఎక్స్ లెంట్ గా న‌టించాడు. అలాగే అభిన‌య హీరోయిన్ గా త‌న పాత్ర‌కు త‌గిన విధంగా అద్భుత‌మైన ప‌ర్ఫార్మెన్స్ క‌న‌బ‌రిచింది. ప్ర‌జంట్ అమ్మాయిలు ఎలా బిహేవ్ చేస్తున్నారన్న  దానికి ఆమె పాత్ర అద్దం ప‌ట్టిన‌ట్లుగా ఉంద‌నడంలో సందేహం లేదు. అలాగే  వీరుకి వ‌న్ సైడ్ ల‌వ‌ర్ గా అభిన‌య అభిన‌యం ఆద్యంతం ఆక‌ట్టుకుంట్టుంది.  ప్ర‌తి సినిమాలో ఆమె పాత్ర ట్రెడిషిన‌ల్ గా ఉండేది. ఈ సినిమాలో కొంచెం మోడ‌ర‌న్ గా ఉంటుంది.  అలాగే మైమ్‌ గోపి, మద్రాస్‌ రమ, మహానది శంకర్ లు వారి వారి పాత్ర‌ల‌కు న్యాయం చేసారు.
సాంకేతిక నిపుణుల ప‌నితీరు…
హీరోగా త‌న పాత్ర‌కు పూర్తి న్యాయం చేసిన ఎజిల్ దురై ద‌ర్శ‌కుడుగా కూడా తొలి సినిమాతోనే పాస్ మార్కులు కొట్టేసాడ‌నే చెప్పాలి. ప్ర‌జంట్ అమ్మాయిలు ఎలా ఉన్నార‌నే కాన్సెప్ట్ ని మెయిన్ క‌థాంశంగా తీసుకుని ప్ర‌తి స‌న్నివేశాన్ని ట్రెండీగా తెర‌కెక్కించాడు డైరెక్టర్. ముఖ్యంగా స్ర్కీన్ ప్లే విష‌యంలో చాలా జాగ్ర‌త్తలు తీసుకున్నారు. ఫ‌స్టాప్ అంతా స‌స్పెన్స్ స‌న్నివేశాల‌తో థ్రిల్లింగ్ గా ఉంటుంది. ఇంట‌ర్ వెల్ సీన్ ఇంట్ర‌స్టింగ్ గా ఉంటుంది. సెకండాఫ్ లో ల‌వ్ సీన్స్ హ‌త్తుకునే లా తెర‌కెక్కించారు ద‌ర్శ‌కుడు. నేప‌థ్య సంగీతం, సినిమా టో గ్ర‌పీ సినిమాకు హైలెట్ అని చెప్పాలి. ఎడిటింగ్ కూడా సినిమాకు చాలా ప్ల‌స్ అయింది.
 విశ్లేష‌ణ‌…
ఒక‌రి ప్రేమ‌ను మ‌రువాలంటే… మ‌రోక‌రిని ప్రేమించ‌డం ప‌రిష్కారం కాదు. మ‌న‌ల్ని క‌ష్ట పెట్టిన వారిని మ‌నం కూడా క‌ష్ట పెట్ట‌డం కాకుండా వారిని అలాగ‌ వ‌దిలేయ‌డ‌మే వారికి స‌రైన శిక్ష‌. అనే చ‌క్క‌టి సందేశాన్ని అంత‌ర్లీనంగా అందించే ప్ర‌య‌త్నం చేశాడు ద‌ర్శ‌కుడు. చెప్పుల‌ను మార్చిన‌ట్లు నేటి అమ్మాయిలు ల‌వ‌ర్స్ ను మార్చేస్తున్నారనేది చాలా స‌హ‌జంగా చూపించే ప్ర‌య‌త్నం చేశాడు ద‌ర్శ‌కుడు. ఫ‌స్ట్ ఒక‌డిని ప్రేమించి…వాడిక‌న్న బెట‌ర్ గా మరొకడు  త‌గిలితే మొద‌టి వాడితో బ్రేక‌ప్ చెప్పేస్తున్నారు . ఇలా ఒక‌డి త‌ర్వాత ఒక‌డిని మార్చుకుంటూ వెళ్తున్నారు నేటి త‌రం అమ్మాయిలు. హీరో పాత్ర `7జి బృందావ‌న కాల‌నీ`లో హీరో పాత్ర త‌ర‌హాలో ఉన్న‌ప్ప‌టికీ కాన్సెప్ట్ ప‌రంగా చూస్తే దానికి దీనికి ఏ మాత్రం సంబంధం లేదు. ఫ‌స్టాప్ చూసిన ఆడియ‌న్స్ సెకండాఫ్ ఏ మాత్రం ఊహించ‌ని విధంగా ఉండేలా ప్లాన్ చేసి, క్లైమాక్స్ వ‌ర‌కు ఆడియ‌న్స్ ను కుర్చీ ల నుంచి క‌ద‌ల‌నీయ‌కుండా చేశారు. బ్రేక‌ప్ అయినంత మాత్రాన బేజారైపోకుండా మ‌న లైఫ్ ని లీడ్ చేయాల‌న్న అంశాన్ని చివరగా  చెప్పే  ప్ర‌య‌త్నం చేశాడు ద‌ర్శ‌కుడు.
ఫైన‌ల్‌గా…
సినిమా ట్రెండీగా నేటి యూత్ ని ఆక‌ట్టుకునే విధంగా ఉంది. ట్రెండీ ఫిలిం అయిన‌ప్ప‌టికీ ఎక్క‌డా వ‌ల్గారిటీ లేకుండా నేచ‌ర‌ల్ గా క‌థ‌ని చూపించారు. అన్ని వ‌ర్గాల ఆడియ‌న్స్ త‌ప్ప‌కుండా చూడాల్సిన చిత్ర‌మిది.  టైటిల్ తోనే యూత్ ని ఆక‌ర్షించిన ఈ సినిమా క‌చ్చితంగా థియేట‌ర్స్ లో ఆడియ‌న్స్ ను 100% ఎంట‌ర్ టైన్ చేస్తుంద‌న‌డంలో ఏమాత్రం సందేహం లేదు.
సూటిగా చెప్పాలంటేః వంద శాతం వినోదం గ్యారంటీ!