Home / Featured / “Mixer Potlam” Movie Review

“Mixer Potlam” Movie Review

mixture-potlam-movie-posters-4bb0f12

సినిమా : ‘మిక్చర్ పొట్లం’

నటీనటులు : శ్వేతా బసు ప్రసాద్, జయంత్, భానుచందర్, పోసాని కృష్ణమురళి, అలీ, గీతాంజలి తదితరులు 

సంగీతం : మాధవపెద్ది సురేష్ 

నిర్మాతలు : వీరన్న చౌదరి , లంకలపల్లి శ్రీనివాసరావు , లక్ష్మీ ప్రసాద్ 

దర్శకత్వం : ఎం.వి. సతీష్ కుమార్ 

రేటింగ్ : 3/ 5

విడుదల తేదీ: 19 మే 2017

ఎ..క్క..డా… ఎవరైనా ఇలా సాగదీసి మాట్లాడితే తెలుగు ప్రేక్షకులకు ‘కొత్త బంగారులోకం’లో శ్వేతాబసు ప్రసాద్ గుర్తొస్తుంది. తెలుగులో కథానాయికగా నటించిన మొదటి సినిమాతోనే మంచి పేరు తెచ్చుకుందీ బెంగాలీ బ్యూటీ. తర్వాత ఆమె జీవితంలో కొన్ని అనూహ్య ఘటనలు జరగడంతో సినిమాలకు కొన్ని రోజులు బ్రేక్ ఇచ్చింది. కొంచెం గ్యాప్ తర్వాత శ్వేతాబసు ప్రసాద్ కీలక పాత్రలో నటించిన తెలుగు సినిమా ‘మిక్చర్ పొట్లం’. నటుడు భానుచందర్ తనయుడు జయంత్ హీరోగా పరిచయమైన ఈ సినిమా మే 19న విడుదలైంది. ఎం.వి. సతీష్ కుమార్ దర్శకత్వంలో గోదావరి సినీ టోన్ పతాకంపై లక్ష్మి ప్రసాద్ , వీరన్న చౌదరి , శ్రీనివాసరావు సంయుక్తంగా నిర్మించిన ఈ కామెడీ సినిమా ప్రేక్షకులను అలరించేలా రూపొందిందా ? లేదా ? అన్నది తెలియాలంటే కథలోకి వెళ్లాల్సిందే.

కథ: సువర్ణ సుందరి ( శ్వేతాబసు ప్రసాద్ ) కత్తిలాంటి అమ్మాయి. ఆమె ఓ బస్ ట్రావెల్స్ యజమాని. పాప అందం చూసి ఆమె బస్సులో ట్రావెల్ చేయాలనే జనాలు చాలామంది ఉంటారు. దాంతో సువర్ణ సుందరి బస్సుకు ఫుల్ డిమాండ్. అమలాపురం నుండి షిర్డీకి సువర్ణసుందరి బస్సు బయలుదేరుతుంది. దారిలో ఈ బస్సును ఆపేసి, అందులో పాసింజర్లను నకలైట్లు కిడ్నాప్ చేస్తారు. సువర్ణ సుందరి బస్సునే నక్సలైట్లు ఎందుకు టార్గెట్ చేశారు? అందులో పాసింజర్లనే ఎందుకు కిడ్నాప్ చేసారు? నక్సలైట్లు డిమాండ్స్ ఏంటి? చివరకు బందీలు విడుదల అయ్యారా ? లేదా అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే .

హైలెట్స్ : 

శ్వేతాబసు ప్రసాద్ గ్లామర్, యాక్టింగ్

భానుచందర్, పోసాని వంటి సీనియర్లు

3 పాటలు

డ్రా బ్యాక్స్ : 

లెంగ్త్ ఎక్కువైంది.

నటీనటుల ప్రతిభ: 

సువర్ణ సుందరిగా శ్వేతాబసు ప్రసాద్ బాగా నటించింది. నటన కంటే గ్లామర్ తో ప్రేక్షకులను ఎక్కువ అట్రాక్ట్ చేస్తుంది. నక్సలైట్ నాయకుడిగా భానుచందర్ నటనలో వంక పెట్టలేం. హోమ్  మినిస్టర్ గా కామెడీ విలన్ పాత్రలో పోసాని నవ్వించారు. హీరో హీరోయిన్లు జయంత్, గీతాంజలిల జంట బాగుంది. కృష్ణభగవాన్, అలీ, జూనియర్ రేలంగి , కంటే వీరన్న చౌదరి కామెడీ పర్లేదు.

సాంకేతిక వర్గం:

శ్వేతాబసు గ్లామర్, మిగతా నటీనటుల కామెడీ… ఫస్టాఫ్ అంత సరదా సరదాగా కామెడీ జోనర్ లో నడిపించిన దర్శకుడు ఇంటర్వెల్ దగ్గర మంచి ట్విస్ట్ ఇచ్చాడు. నక్సలైట్స్ ఎంట్రీతో సినిమా ఒక్కసారిగా మలుపు తిరుగుతుంది. దాంతో సెకండాఫ్ ఎలా ఉండబోతోందో అన్నటెన్షన్ ఆడియన్స్ లో క్రియేట్ అవుతుంది. ఈ విషయంలో దర్శకుడు బాగా అయ్యాడు. శ్వేతాబసు గ్లామర్ కుర్రాళ్లను కట్టిపడేస్తుంది. కిడ్నాప్ నేపథ్యంలో సెకండాఫ్ బాగానే రక్తికట్టింది. అయితే ఇంకాస్త జాగ్రత్తలు తీసుకొని… స్క్రీన్ ప్లేని మరింత బెటర్ మెంట్ చేసి ఉంటే పెద్ద హిట్ అయ్యేది ఈ మిక్చర్ పొట్లం. నటీనటుల నుండి , సాంకేతిక నిపుణుల నుండి తనకు రావాల్సిన దాన్ని రాబట్టుకున్నాడు దర్శకుడు సతీష్ కుమార్. చాలాకాలం తర్వాత మాధవపెద్ది సురేష్ సంగీతం అందించిన సినిమా ఇది . మూడు పాటలు బాగున్నాయి . ఇక ఛాయాగ్రాహకులు కళ్యాణ్ సమీ అందించిన సినిమాటోగ్రఫీ చాలా బాగుంది . అలాగే నిర్మాణ విలువలు కూడా బాగున్నాయి .

ఓవరాల్ గా : 

శ్వేతాబసు ప్రసాద్ గ్లామర్, సీనియర్ కమెడియన్స్ కృష్ణభగవాన్, పోసాని, అలీ, కంటే వీరన్న చౌదరిల కామెడీ , భానుచందర్ నక్సలిజం వెరసి ఈ ‘మిక్చర్ పొట్లం’ ప్రేక్షకులకు టైమ్ పాస్ ఎంటర్టైన్మెంట్. ఈ వారం మంచి రిలీఫ్ ఇచ్చే సినిమా అని చెప్పొచ్చు.