Home / Featured / Star Comedian Shankar as hero “Driver Ramudu”
Driver Ramudu

Star Comedian Shankar as hero “Driver Ramudu”

స్టార్ క‌మెడియ‌న్ శంక‌ర్ హీరోగా ” డ్రైవర్ రాముడు”
Star Comedian Shankar as hero “Driver Ramudu”
Driver Ramudu
డ్రైవ‌ర్ రాముడు చిత్రం అన‌గానే నంద‌మూరి తార‌క రామారావు గారు మాత్ర‌మే గుర్తుకొస్తారు. ఆయ‌న కెరీర్ లో బిగ్గెస్ట్ క‌మ‌ర్షియ‌ల్ చిత్రాల్లో డ్రైవ‌ర్ రాముడు ఒక‌టి. అలాంటి చిత్రం టైటిల్ వేరే చిత్రాల‌కి పెట్టాలంటే ఆ చిత్రం కూడా ఆ రేంజి కంటెంట్‌ కాక‌పోయినా ప‌ర్వాలేదు కాని ఆ టైటిల్ ని దుర్వినియోగం చెయ్య‌కూడదు. ద‌ర్శ‌కుడు రాజ్ స‌త్య ఇదే మైండ్ లో పెట్టుకుని త‌న చిత్రానికి డ్రైవ‌ర్ రాముడు టైటిల్ క‌రెక్ట్ గా వుంటుంద‌ని ఈ దైర్యం చేశారు.  
 
జబర్ధస్ తో కామెడీ షోతో పాపులారిటీ తెచ్చుకొని ఆ తరువాత సినిమాల్లో కమీడియన్ గా ఎంట్రీ ఇచ్చి ప్రస్తుతం స్టార్ కమీడియన్ గా రాణిస్తున్న శంకర్ ని హీరోగా ప‌రిచ‌యం చేస్తూ డ్రైవర్ రాముడు  చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు.  ఈ సినిమా  ని పీపుల్ పతాకం పై మాస్టర్ రాజ్ ప్రణవ్ తేజ్ సమర్పణలో ఎమ్ ఎల్ రాజు, ఎస్ ఆర్ కిషన్ నిర్మిస్తున్నారు. 
 
 డ్రైవర్ రాముడు చిత్రం ఫస్ట్ లుక్ ని ఈరోజు  విడుదల చేశారు .
 
 ఈ సందర్భంగా దర్శకుడు రాజ్ సత్య మాట్లాడుతూ… స్టార్ కమీడియన్ గా ప్రేక్షకుల్ని అలరిస్తొన్న శంకర్  ని హీరోగా ప‌రిచ‌యం చేస్తూ తెర‌కెక్కిస్తున్న చిత్రం డ్రైవర్ రాముడు. ఇప్ప‌టివ‌ర‌కూ తెలుగు ప్రేక్ష‌కుల్ని క‌డుపుబ్బా న‌వ్వించిన శంక‌ర్ లో మ‌రో కొత్త కొణం ఈచిత్రం ద్వారా చూస్తారు. శంక‌ర్ టైప్ కామెడి వుంటూనే మంచి క‌థ‌తో కూడిన ఎమెష‌న్ వుంటుంది.  ఈ సినిమాలో శంకర్ ఓ కొత్త లుక్ తో తెర పై కనిపించబోతున్నారు. మిగ‌తా వివ‌రాలు త్వ‌ర‌లో తెలియ‌జేస్తాం . అని అన్నారు
 
నిర్మాతలు ఎమ్ ఎల్ రాజు, ఎస్ ఆర్ కిషన్ మాట్లాడుతూ… తెలుగు ప్ర‌జ‌లు దేవుడుగా భావించే నటసార్వభౌమ నందమూరి తారకరామారావు గారు నటించిన బ్లాక్ బస్టర్ డ్రైవర్ రాముడు టైటిల్ ని మళ్లీ తమ సినిమాకి పెట్టుకోవడం తొలి సక్సెస్ గా భావిస్తున్నట్లుగా తెలిపారు. శంకర్ ఈ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇవ్వడమే కాకుండా తన మార్క్ కామెడీతో ప్రేక్షకుల్ని నూటికి నూరు శాతం అలరించడం ఖాయం అని చిత్ర నిర్మాతలు ఎమ్ ఎల్ రాజు, ఎస్ ఆర్ కిషన్ అన్నారు.
 
హీరో శంకర్ మాట్లాడుతూ.. ఇప్పటివరుకు కమీడియన్ న‌న్ను ఆద‌రించిన ప్ర‌పంచంలో వున్న‌ తెలుగు ప్రేక్షకులంద‌రికి నా ధ‌న్య‌వాదాలు.  ఇప్పుడు హీరోగా కూడా ఆదిస్తారని, ఆశీర్వ‌దిస్తార‌ని న‌మ్ముతాను.  నా కామెడీ టైమింగ్ ఏ మాత్రం మిస్ కాకుండా థియేటర్ కి వచ్చే ప్రతి ఆడియెన్ కడుపుబ్బా నవ్వుకునేలా డైవర్ రాముడు తెరకెక్కుతుంది. న‌న్ను న‌మ్మి ఈ చిత్రాన్ని తీస్తున్న ద‌ర్శ‌కుడుకి నిర్మాత‌ల‌కి నా ప్ర‌త్యేఖ ధ‌న్య‌వాదాలు. ఈ చిత్రం మెద‌టి లుక్ అంద‌రికి న‌చ్చుతుందని ఆశిస్తున్నాను. నంద‌మూరి తార‌క రామారావు గారి గెట‌ప్ తో విడుద‌ల చేసిన మెద‌టి లుక్ కి అంద‌రూ ప్రశంశ‌లు కురిపిస్తున్నారు. చాలా ఆనందంగా వుంది.  అని అన్నారు.
 
తారాగణం –  శంకర్ ప్రదీప్ రావత్, తాగుబోతు రమేశ్, అదుర్స్ రఘు, నల్లవేణు, లోబో

బ్యానర్ – సినిమా పీపుల్
సమర్పణ – మాస్టర్ ప్రణవ్ తేజ్
మ్యూజిక్ – సునీల్ కశ్యాప్
ఆర్ట్ – రఘు కుల్ కర్ణి
డిఓపి – అమర్ నాథ్
నిర్మాతలు – ఎమ్ ఎల్ రాజు, ఎస్ ఆర్ కిషన్ 
దర్శకత్వం – రాజ్ సత్య

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*