Home / తెలుగు / Vijay Antony Indra Sena Worldwide Grand Release On November 30th
IMG_4270

Vijay Antony Indra Sena Worldwide Grand Release On November 30th

ప్ర‌పంచ వ్యాప్తంగా తెలుగు, త‌మిళంలో నవంబ‌ర్ 30న గ్రాండ్ రిలీజ్ అవుతోన్న విజ‌య్ ఆంటోని `ఇంద్ర‌సేన‌` విడుద‌ల‌
Vijay Antony Indra Sena Worldwide Grand Release On November 30th
IMG_4270
వైవిధ్యమైన సినిమాలతో, వరుస కమర్షియల్ సక్సెస్ లతో    తనకంటూ ఓ మార్క్ ను సృష్టించుకున్న హీరో విజయ్ ఆంటోని తాజాగా నటిస్తోన్న చిత్రం `ఇంద్రసేన`. ఆర్.స్డూడియోస్, విజయ్ ఆంథోని ఫిలిం కార్పొరేషన్ పతాకంపై జి.శ్రీనివాసన్ దర్శ‌క‌త్వంలో రాధికా శరత్ కుమార్, ఫాతిమా విజయ్ ఆంథోని `ఇంద్రసేన` చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తెలుగు, త‌మిళ భాష‌ల్లో సినిమా ఏక కాలంలో న‌వంబ‌ర్ 30న ప్ర‌పంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ అవుతోంది. ఈ సంద‌ర్భంగా…
నిర్మాత‌లు మాట్లాడుతూ – “డిఫ‌రెంట్ చిత్రాల‌తో తెలుగులో త‌నకంటూ ఓ మార్కెట్‌ను క్రియేట్ చేసుకున్న విజ‌య్ ఆంటోనికి సినిమాల‌కు తెలుగు ప్రేక్ష‌కుల్లో మంచి ఆద‌ర‌ణ ల‌భిస్తుంది. గ‌తంలో కూడా నకిలీ, డా.స‌లీంల‌తో మంచి న‌టుడిగా పేరు తెచ్చుకున్న విజ‌య్ ఆంటోని `బిచ్చ‌గాడు`తో  సెన్సేష‌న్ క్రియేట్ చేశాడు. త‌ర్వాత భేతాళుడు, యెమ‌న్ చిత్రాల‌తో క‌మ‌ర్షియ‌ల్ హీరోగా స‌క్సెస్ సాధించారు. బిచ్చ‌గాడు చిత్రంలోని మ‌ద‌ర్ సెంటిమెంట్‌కు త‌న అద్భుత‌మైన న‌ట‌న‌ను తోడు చేసి బాక్సాఫీస్ ద‌గ్గ‌ర క‌లెక్ష‌న్స్ వ‌ర్షాన్ని కురిపించిన విజ‌య్ ఆంటోని `ఇంద్ర‌సేన` చిత్రంలో బ్ర‌ద‌ర్ సెంటిమెంట్‌తో ఆక్టుకోవ‌డానికి సిద్ధ‌మైయ్యారు విజ‌య్ ఆంటోని. బ్ర‌ద‌ర్ సెంటిమెంట్‌తో పాటు హై ఎమోష‌న్స్ కాంబినేష‌న్స్‌తో తెరకెక్కుతోన్న ఈ చిత్రం ప్ర‌స్తుతం నిర్మాణాంత‌ర కార్య‌క్ర‌మాల‌ను జ‌రుపుకుంటోంది. అల్రెడి విడుద‌లైన ఈ సినిమా పోస్ట‌ర్స్‌, ట్రైల‌ర్‌కు చాలా మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. సినిమా కూడా అద్భుతంగా వ‌చ్చింది. అంచ‌నాల‌ను అందుకునేలా సినిమా ఉంటుద‌న‌డంలో సందేహం లేదు. నవంబ‌ర్ 30న ప్ర‌పంచ వ్యాప్తంగా తెలుగు,త మిళంలో సినిమా గ్రాండ్‌గా విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నాం“ అన్నారు.
విజయ్ ఆంథోని, డైనా చంపిక, మహిమా,  జ్వెల్ మారీ, రాదా రవి, కాళీ వెంకట్, నళినీ కాంత్ రింధు రవి తదితరులు నటించిన ఈ చిత్రానికి  మాటలు- సాహిత్యం:భాష్యశ్రీ, ఆర్ట్ : ఆనంద్ మణి, సంగీతం- కూర్పు: విజయ్ ఆంథోని, సినిమాటోగ్రఫీ : కె.దిల్ రాజ్, లైన్ ప్రొడ్యూసర్: శాండ్రా జాన్సన్, నిర్మాతలు: రాధికా శరత్ కుమార్, ఫాతిమా విజయ్ ఆంథోని, దర్శకత్వం: జి.శ్రీనివాసన్.

About sunny chandu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*