Home / Featured / Jandyala Rasina Premakadha Censor Completed, Nov 24th Release

Jandyala Rasina Premakadha Censor Completed, Nov 24th Release

‘జంధ్యాల రాసిన ప్రేమకథ’ సెన్సార్ పూర్తి, 24న విడుదల
Jandyala Rasina Premakadha Censor Completed, Nov 24th Release
01 (4)
కీర్తి క్రియేషన్స్ బ్యానర్‌పై కార్తీక్‌ రెడ్డి, అశోక్ సిరియాల నిర్మాతలుగా కృష్ణవర్మ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘జంధ్యాల రాసిన ప్రేమకథ’. శేఖర్‌, దిలీప్‌, శ్రీలక్ష్మీ, గాయత్రి గుప్త మొదలగు వారు తారాగణం. ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని నవంబర్ 24 న రిలీజ్ కాబోతుంది.
ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు కృష్ణవర్మ చిత్ర విశేషాలను తెలియజేస్తూ.. ‘‘తెలుగు చలనచిత్ర పరిశ్రమకు గొప్ప దర్శకులైన జంధ్యాల గారు రూపొందించిన ‘నాలుగు స్తంభాలాట’ చిత్రాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాము. ప్రజంట్‌ ట్రెండ్‌కి అనుగుణంగా, అన్ని కమర్షియల్‌ హంగులతో.. అందరికీ నచ్చేలా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దాము.  చిత్రం చాలా బాగా వచ్చింది. సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. సెన్సార్ సభ్యుల నుండి మంచి ఫీడ్ బ్యాక్ తో పాటు యూ by ఏ సర్టిఫికెట్ సొంతం చేసుకుంది. ఈ చిత్రాన్ని నవంబర్ 24 న ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నాము…” అని అన్నారు.
శేఖర్‌, దిలీప్‌, శ్రీలక్ష్మీ, గాయత్రి గుప్త తదితరులు నటిస్తున్నఈ చిత్రానికి కెమెరా: రత్నబాబు, సంగీతం: గోపీ, ఎడిటింగ్‌: నరసింహారెడ్డి, ఎక్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: వెంకట్, నిర్మాతలు: కార్తీక్‌రెడ్డి, అశోక్ సిరియాల; దర్శకత్వం: కృష్ణవర్మ.