Home / Featured / Nikhil’s ‘MUDRA’ climax shoot and dubbing works going on simultaneously
Nikhil’s ‘MUDRA’ climax shoot and dubbing works going on simultaneously
Nikhil’s ‘MUDRA’ climax shoot and dubbing works going on simultaneously

Nikhil’s ‘MUDRA’ climax shoot and dubbing works going on simultaneously

వేగంగా పూర్తవుతున్న ముద్ర క్లైమాక్స్.. డబ్బింగ్ పనులు..
 
నిఖిల్ హీరోగా తెర‌కెక్కుతోన్న ముద్ర సినిమా షూటింగ్ చివ‌రిద‌శ‌కు చేరుకుంది. ప్ర‌స్తుతం హైద‌రాబాద్ లోనే ఈ చిత్ర క్లైమాక్స్ షూటింగ్ జ‌రుగుతుంది. డ‌బ్బింగ్ ప‌నుల‌ను కూడా ఒకేసారి పూర్తి చేస్తున్నారు. వాస్త‌విక సంఘ‌ట‌న‌ల ఆధారంగా జ‌ర్న‌లిజం నేప‌థ్యంలో తెర‌కెక్కుతోన్న సినిమా ఇది. స‌మాజంలో జ‌రుగుతున్న కొన్ని విష‌యాల‌ను ఎలా మీడియా ప‌రిష్క‌రిస్తుంది.. అందులో మీడియా బాధ్య‌త‌ను గుర్తు చేస్తూ ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు ద‌ర్శ‌కుడు టిఎన్ సంతోష్. లావ‌ణ్య త్రిపాఠి తొలిసారి నిఖిల్ తో జోడీక‌ట్టింది. ఈ చిత్రంలో నిఖిల్ జ‌ర్న‌లిస్ట్ అర్జున్ సుర‌వ‌రంగా న‌టిస్తున్నారు. ఇప్ప‌టికే విడుద‌లైన ఫ‌స్ట్ లుక్ కు ప్రేక్ష‌కుల నుంచి అద్భుత‌మైన స్పంద‌న వ‌చ్చింది. ఈ చిత్రంలో వెన్నెల కిషోర్, పోసాని కృష్ణ‌ముర‌ళి, నాగినీడు, ప్ర‌గ‌తి, స‌త్య‌, త‌రుణ్ అరోరా మ‌రియు రాజా ర‌వీంద్ర ఇత‌ర ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. స్యామ్ సిఎస్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఔరా సినిమాస్ పివిటి మ‌రియు మూవీ డైన‌మిక్స్ ఎల్ఎల్‌పి సంస్థ‌ల‌పై కావ్య‌ వేణుగోపాల్, రాజ్ కుమార్ ముద్ర సినిమాను నిర్మిస్తున్నారు. బి మ‌ధు ఈ చిత్రానికి స‌మ‌ర్ప‌కుడిగా ఉన్నారు. ఈ చిత్రం నవంబర్ లో  విడుదల కానుంది 
 
న‌టీన‌టులు: 
నిఖిల్ సిద్ధార్థ్, లావ‌ణ్య త్రిపాఠి, వెన్నెల కిషోర్, పోసాని కృష్ణ‌ముర‌ళి, నాగినీడు, ప్ర‌గ‌తి, స‌త్య‌, త‌రుణ్ అరోరా, రాజా ర‌వీంద్ర
 
సాంకేతిన నిపుణులు: 
 
క‌థ‌, స్క్రీన్ ప్లే, ద‌ర్శ‌కుడు: టిఎన్ సంతోష్
స‌మ‌ర్ప‌కుడు: బి మ‌ధు 
నిర్మాత‌లు:  కావ్య‌ వేణుగోపాల్ మ‌రియు రాజ్ కుమార్ 
నిర్మాణ‌ సంస్థ‌లు: ఔరా సినిమాస్ పివిటి మ‌రియు మూవీ డైన‌మిక్స్ ఎల్ఎల్‌పి 
సినిమాటోగ్ర‌ఫీ: సూర్య 
సంగీతం: స‌్యామ్ సిఎస్
ఆర్ట్ డైరెక్ట‌ర్: సాహి సురేష్ 
ఫైట్స్: వెంక‌ట్ 
క్యాస్ట్యూమ్ డిజైన‌ర్:  రాగా రెడ్డి 
డైరెక్ష‌న్ డిపార్ట్ మెంట్: ర‌మా ర‌మేష్, రంగ‌నాథ్, లోకేష్, భ‌ర‌త్, అరు, బ్ర‌హ్మ 
ప‌బ్లిసిటీ డిజైన్: అనిల్-భాను
పిఆర్ఓ: వ‌ంశీ శేఖ‌ర్
Nikhil’s ‘MUDRA’ climax shoot and dubbing works going on simultaneously

Nikhil’s ‘MUDRA’ climax shoot and dubbing works going on simultaneously

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*