Home / Featured / రేవంత్‌ ఫోన్‌ ఫుల్‌ బిజీ.. ఎందుకో తెలుసా…..??
రేవంత్‌ ఫోన్‌ ఫుల్‌ బిజీ.. ఎందుకో తెలుసా.....
రేవంత్‌ ఫోన్‌ ఫుల్‌ బిజీ.. ఎందుకో తెలుసా.....

రేవంత్‌ ఫోన్‌ ఫుల్‌ బిజీ.. ఎందుకో తెలుసా…..??

రేవంత్‌ ఫోన్‌ ఫుల్‌ బిజీ.. ఎందుకో తెలుసా…..??

తెలంగాణ కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌ రెడ్డి ఫుల్‌ బిజీ అయిపోయారు. ఆయనను ఎంగేజ్ చేసుకోవడానికి నేతలు క్యూ కడుతున్నారట.. సీనియర్‌ కాంగ్రెస్‌ నేతల నుండి  రీసెంట్‌గా పార్టీలో అడుగుపెట్టిన నేతల వరకు అందరూ రేవంత్‌ వెంట పరుగులు పెడుతున్నారని కాంగ్రెస్‌లో ప్రచారం జరుగుతోంది.. 
 
రేవంత్‌ రెడ్డికి మంచి ఫాలోయింగ్‌ ఉంది. టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ని ఎదిరించే మొనగాడుగా, ఫైర్‌ బ్రాండ్‌ పొలిటీషియన్‌గా పేరు తెచ్చుకున్నాడు రేవంత్‌ రెడ్డి.. టీఆర్‌ఎస్‌ యువనేత కేటీఆర్‌ ప్రాస, తెలంగాణ యాస, పంచ్‌, పవర్‌ ఫుల్‌ డైలాగులు వదులుతాడు.. వాటికి అదే పంచ్‌, యాసతో రిటార్ట్ ఇవ్వడం ఒక్క రేవంత్‌కే చెల్లు. టీటీడీపీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా తిరుగులేని క్రేజ్‌ దక్కించుకున్నారు. ఆ తర్వాత ఓటుకు నోటు కేసులో బుక్‌ అయినా, తనకే మైలేజ్ దక్కేలా చూసుకోవడంలో సక్సెస్ అయ్యాడు రేవంత్‌ రెడ్డి.. దీంతో, ఆయన క్రేజ్‌ మరింత పెరిగింది.. కాంగ్రెస్‌లో చేరినా, నేటికీ టీటీడీపీ నేతలు, కార్యకర్తలు రేవంత్‌ని తమ సొంత నేతగా భావిస్తారు..
 
ఇంతటి క్రేజ్‌ సొంతం చేసుకోవడంతో రేవంత్‌ రెడ్డిని సీనియర్‌ నేతలు తమ నియోజకవర్గాలలో ప్రచారం చేయాలని కోరుతున్నారట. రేవంత్‌ రెడ్డి పోటీ చేస్తే తమ నియోజకవర్గాలలో  భారీగా ఓట్లు పెరుగుతాయని, మినిమమ్‌ 5-7 వేల  ఓట్లు తేడా ఉంటుందని అంచనా వేస్తున్నారట. అందుకే, షబ్బీర్‌ ఆలీ నుండి నిన్నమొన్నట్లో పార్టీలో చేరిన ప్రతి ఒక్కరు తమ నియోజకవర్గాలలో రేవంత్‌ రెడ్డి పాదం మోపాలని డిమాండ్‌ చేస్తున్నారట.. ఎన్నికలకు ఒక్క రోజు తమ నియోజకవర్గాలలో పర్యటించి విస్తృతంగా టూర్ చేయాలని ఆయనపై ఒత్తిడి పెంచుతున్నారని తెలుస్తోంది.. 
 
అంతా రేవంత్‌ రెడ్డినే కోరుతుండడంతో ఫుల్‌ బిజీగా మారిపోయాడట. దీంతో,  టీపీసీపీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ఫోన్‌ ఎప్పుడూ ఎంగేజ‌్‌లోనే ఉంటుందని వాపోతున్నారట కాంగ్రెస్‌ నేతలు.. మరి, రేవంత్‌ ఈ ఎన్నికలలో ఎలాంటి మార్పులు తీసుకువస్తాడో చూడాలి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*