Home / Featured / Savyasachi Review
Naga-Chaitanya-Savyasach review
Naga-Chaitanya-Savyasach review

Savyasachi Review

MOVIE NAME“Savyasachi”

Boxoffice70mm RATING: 2/5 (★★★★★)

Starring: Naga Chaitanya, Nidhhi Agarwal, R Madhavan, Bhumika Chawla, Rao Ramesh, Vennela Kishore etc.,

Directed by: Chandoo Mondeti

Produced by: Naveen, Y Ravi Shankar, Mohan Cherukuri

Banner: Mythri Movie Makers

Music by: M M Keeravani

Release Date: 2nd November 2018

రేటింగ్ః
వ్యానిషింగ్ సిండ్రోమ్ కాన్సెప్ట్ అంటూ ప్ర‌చారం చేసి, టీజ‌ర్‌, ట్రైల‌ర్ తో సినిమాకు మంచి హైప్ తెచ్చారు స‌వ్య‌సాచి చిత్ర యూనిట్‌. ప్రేమ‌మ్ త‌ర్వాత నాగ‌చైత‌న్య‌, చందు మొండేటి కాంబినేష‌న్ లో సినిమా రావ‌డం, అప‌జ‌యాలు ఎరుగ‌ని మైత్రీ మూవీ మేక‌ర్స్స్ బేన‌ర్ లో సినిమా రావ‌డంతో సినిమా పై విప‌రీత‌మైన క్రేజ్ వ‌చ్చింది. మ‌రి ఈ రోజు విడులైన సినిమా ప్రేక్ష‌కుల‌ను ఏ మేర‌కు ఆక‌ట్టుకుంటుందో తెలుసుకునే ప్ర‌య‌త్నం చేద్దాం… 
 
స్టోరి:
విక్రమ్ (నాగచైతన్య) ఒక యాడ్ ఫిలింమేకర్! విక్ర‌మ్‌లోనే ఆదిత్య (కేవలం ఎడమ చేతిలో మాత్రమే) వుంటాడు. ప్రతి మనిషిలా ఆదిత్యకు అన్ని ఎమోషన్స్ వుంటాయి. అయితే.. వాటిని ఎడమ చేయి ద్వారా మాత్రమే వ్యక్తం చేస్తాడు. దీనివల్ల విక్రమ్‌ వింత వింత పరిస్థితులు ఎదుర్కొంటాడు. అతడికి ఆదిత్య కొన్నిసార్లు అండగా నిలబడితే.. మరికొన్నిసార్లు అడ్డు (ప్రేమ విషయంలో మాత్రమే)గా నిలబడతాడు! – ఇదీ హీరో క్యారెక్టరైజేషన్!
కథ విషయానికి వస్తే… విక్రమ్ (నాగచైతన్య) యాడ్ ఫిలింమేకర్. మేనకోడలు మహా (భూమిక కూతురు) అంటే అతడికి ప్రాణం. మహాలో అమ్మను చూసుకుంటాడు. లవర్ చిత్ర (నిధి అగర్వాల్)తో కలిసి ఒక యాడ్ కోసం అమెరికా వెళ్లొచ్చే సరికి గ్యాస్ సిలిండర్ పేలడం వలన సంభవించిన అగ్ని ప్రమాదంలో మహాతో పాటు విక్రమ్ బావ (భూమిక భర్త) కూడా మరణించారని చెబుతారు. కానీ, మహా చావలేదని, ఎవరో కిడ్నాప్ చేశారని విక్రమ్‌కి అర్థమవుతుంది. మహాని కిడ్నాప్ చేసిన అరుణ్ రాజ్ (మాధవన్) ఎవరు? అసలు, ఎందుకు కిడ్నాప్ చేశాడు? విక్ర‌మ్‌కి, అత‌డికి సంబంధం ఏంటి? అనేది మిగతగా సినిమా!
 
సినిమాకు ప్ల‌స్ పాయింట్స్ః
నాగచైతన్య, మాధవన్ నటన
‘వెన్నెల’ కిషోర్ కామెడీ, 
స్టోరీ కాన్సెప్ట్
 
మైనస్ పాయింట్స్:
ఫస్టాఫ్
దర్శకత్వం
 
విశ్లేషణలోకి వెళితే…
 స్టోరి బాగున్న‌ప్ప‌టికీ… చెప్పే విధాన‌మే అంత‌గా లేదు. సినిమాలో అసలు కథ సెకండాఫ్‌లో స్టార్ట్ అవుతుంది! ఫస్టాఫ్ అంతా లవ్, కామెడీ పేరుతో మరీ సాగదీశారు. అక్కడ వానిషింగ్ ట్విన్ సిండ్రోమ్ కాన్సెప్ట్‌ని సరిగా వాడుకోలేదు. మధ్యలో ‘వెన్నెల’కిషోర్ వున్నాడు కాబట్టి సరిపోయింది. లేదంటే మరింత విసుగు వచ్చేది. సెకండాఫ్‌లో కథ మొదలైనప్పటి నుండి ఆసక్తిగా ముందుగా సాగింది. వానిషింగ్ ట్విన్ సిండ్రోమ్ కాన్సెప్ట్‌ని కథకు భలే ఉపయోగించుకున్నారు. కానీ, కథ మంచి రసవత్తరంగా ముందుకు వెళ్తున్న సమయంలో ‘నిన్ను రోడ్డు మీద లగ్గాయిత్తు’ రీమిక్స్, సుభద్ర పరిణయ నాటకం పెట్టి తప్పు చేశారని అనిపిస్తుంది. దర్శకుడు చందూ మొండేటి కథను, సినిమాను సరిగా హ్యాండిల్ చేయలేకపోయాడు. వానిషింగ్ ట్విన్ సిండ్రోమ్ కాన్సెప్ట్ కూడా ‘అపరిచితుడు’కు  ఎక్స్‌టెన్ష‌న్‌లా వుంటుంది. కథలో మంచి మంచి సన్నివేశాలు వున్నప్పటికీ… అందులో ఎమోషన్ ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా తీయడంలో దర్శకుడు విఫలమయ్యాడు. అయితే… అక్కినేని అభిమానులు కోరుకునే కొన్ని కొన్ని అంశాలును బాగా తీశాడు. ‘నిన్ను రోడ్డు మీద చూసినది లగ్గాయిత్తు’ పాట, కాలేజీలో పంచెకట్టులో నాగచైతన్య చేసే ఫైట్ అభిమానులకు ఆనందాన్ని ఇస్తాయి. మైత్రీ మూవీ మేకర్స్ ఖర్చు విషయంలో రాజీ పడలేదు. ఆర్ట్ డైరెక్టర్స్ మౌనిక, రామకృష్ణ పనితీరు ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. చైతన్య ఆఫీస్, మాధవన్ హౌస్ సెట్స్ అద్భుతంగా వున్నాయి.   
 
న‌టీన‌టుల హావ‌భావాలుః
నాగచైతన్య పాత్రకు తగ్గట్టు నటించాడు. క్యారెక్టర్ ఆసక్తికరంగా వుండటంతో మాంచి జోష్‌లో చేసుకుంటూ వెళ్ళాడు.డ్యాన్సులు బాగా చేశాడు.  నటుడిగా మాధవన్ ప్రతిభ గురించి కొత్తగా చెప్పేది ఏముంది? ప్రతినాయకుడి పాత్రలోనూ అద్భుతంగా నటించగలనని ఈ సినిమాతో చెప్పాడు. నిధి అగర్వాల్ పాత్ర చిన్నదే. అందులో అందంగా కనిపించింది. అక్కగా భూమికకు చక్కటి పాత్ర చేసే ఆవకాశం వచ్చింది. ‘వెన్నెల’ కిషోర్, సత్య కాంబినేషన్లో వచ్చే సన్నివేశాలు కాస్త నవ్వించాయి. ‘షకలక’ శంకర్ ఎపిసోడ్ పర్వాలేదు. 
 
సూటిగా చెప్పాలంటేః
ముందుగా చెప్పుకున్నట్టు కాన్సెప్ట్ బావుంది. దర్శకుడు చందూ మొండేటి కథను రాసుకున్న విధానం బావుంది. కానీ, తీసిన విధానమే బాగోలేదు. అక్కినేని అభిమానులను అలరించే అంశాలను కథలో చక్కగా చూపించిన అతను, ప్రేక్షకులందరికీ కనెక్ట్ అయ్యేలా కథను చెప్పలేకపోయాడు. నాగచైతన్య, మాధవన్… ఇద్దరి నటన సినిమాకు కొండంత బలం! వారిద్దరి కోసం, కొద్ది సేపు న‌వ్వుతూ  కాల‌క్షేపం చేయాల‌నుకుంటే థియేట‌ర్ కు వెళ్ల‌వ‌చ్చు.Savyasachi Review