Home / Featured / ద‌స‌రాకు `సైరా` అంటున్న రామ్ చ‌ర‌ణ్‌!!
ద‌స‌రాకు `సైరా` అంటున్న రామ్ చ‌ర‌ణ్‌!!

ద‌స‌రాకు `సైరా` అంటున్న రామ్ చ‌ర‌ణ్‌!!

ద‌స‌రాకు `సైరా` అంటున్న రామ్ చ‌ర‌ణ్‌!!
 
మెగాస్టార్ చిరంజీవి హీరోగా  న‌టిస్తోన్న 151 వ చిత్రం `సైరా`. ఈ చిత్రాన్ని కొణి ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకంపై రామ్ చ‌ర‌ణ్ అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తోన్న విష‌యం తెలిసిందే.  సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ఈ చిత్రం మ‌రో రెండు నెల‌ల్లో షూటింగ్ పూర్తి కానుంద‌ని చెప్పుకొచ్చారు రామ్ చ‌ర‌ణ్‌.  సినిమాను ద‌స‌రాకు రిలీజ్ చేయాల‌న్న ఆలోచ‌న‌లో ఉన్న‌ట్లు రామ్ చ‌ర‌ణ్ తెలిపారు. ఈ సినిమాకు అమిత్ త్రివేది సంగీతాన్ని స‌మ‌కూరుస్తున్నారు. అద్భుత‌మైన పాట‌లు అందించార‌న్నారు.  ఈ రోజు `విన‌య విధేయ రామ‌` సినిమా కోసం ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో పై విధంగా స్పందించారు.
 
ఇంకా రామ్ చ‌ర‌ణ్ మాట్లాడుతూ…“ సైరా చిత్రం స‌జావుగా సాగుతంద‌ని ఎక్క‌డా ఎలాంటి ప్రాబ్ల‌మ్ లేదన్నారు. అనుకున్న దానికన్నా బ‌డ్జెట్ కొంచెం పెరుగుతున్నా క్వాలిటీ ప‌రంగా చాలా సంతృప్తిగా ఉన్నామ‌న్నారు. అలాగే కొర‌టాల శివ‌తో నాన్న‌గారు చేయ‌నున్న సినిమా స‌మ్మర్ లో ప్రారంభించ‌నున్నాం.  దీని త‌ర్వాత నాన్న‌గారు డివివి దాన‌య్య‌, త్రివిక్ర‌మ్ సినిమా ఉంటుందన్నారు.  
 
 మిర్చి సినిమా త‌ర్వాత నేను కొర‌టాల శివ గారు సినిమా చేద్దాం అనుకున్నాం. కానీ నాన్న‌గారితో కుదిరింది. అయినా నాతో క‌న్నా నాన్న‌గారితో సినిమా చేయ‌డం  ప‌ట్ల కొర‌టాల గారు చాలా హ్యాపీ.  ఇక నాన్న‌గారితో త‌ప్ప నేను నిర్మాత‌గా వేరే వారితో సినిమాలు చేయాల‌నుకోవ‌డం లేదంటూ చెప్పుకొచ్చాడు.