Home / Featured / దర్శకులు డాక్టర్ ఆనంద్ మ్యూజిక్ వీడియో ‘రెయిన్ బో’ ఏడు భాషలలో విడుదల
దర్శకులు డాక్టర్ ఆనంద్ మ్యూజిక్ వీడియో ‘రెయిన్ బో’ ఏడు భాషలలో విడుదల

దర్శకులు డాక్టర్ ఆనంద్ మ్యూజిక్ వీడియో ‘రెయిన్ బో’ ఏడు భాషలలో విడుదల

దర్శకులు డాక్టర్ ఆనంద్ మ్యూజిక్ వీడియో ‘రెయిన్ బో’ ఏడు భాషలలో విడుదల

 జాతీయ స్థాయిలో ఎన్నో అవార్డ్ లు సాధించిన దర్శకులు డాక్టర్ ఆనంద్ తాజాగా ఏడు భాషలలో రూపొందించిన మ్యూజిక్ వీడియో రెయిన్ బో. ఇటీవల అమెరికాలోజాత్యహంకార దాడిలో దుర్మరణం చెందిన తెలుగు విద్యార్థి  శరత్ కొప్పు కి నివాళి అర్పిస్తూ,అనన్య పెనుగొండ అనే తెలుగు యన్ ఆర్ ఐ అమ్మాయిని గాయనిపరిచయం చేస్తూ శ్రీమతి స్వాతి పెనుగొండ నిర్మించిన,కొప్పు రాం మోహన్ , యన్ యస్ నాయక్ సమర్పించిన  ఈ మ్యూజికల్ వీడియో ని శ్రీ కె టి ఆర్ గారిఆశీస్సులతో ,ప్రముఖ టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ మరియు ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ చేతుల మీదుగా  రోజు అనగా జనవరి 11  తేదీనలహరి మ్యూజిక్ ద్వారా యూ ట్యూబ్ లో విడుదల అయింది.

ప్రముఖ హీరో సుధీర్ బాబు, ప్రముఖ గాయకులు యస్ పి బాలసుబ్రమణ్యం, ,నిర్మాత రాజ్ కందుకూరి,తమ్మా రెడ్డి భరద్వాజ, నీలకంఠ , శివలెంక క్రిష్న ప్రసాద్,సంగీత దర్శకులు ఆర్.పి పట్నాయక్, రఘు కుంచె,  దర్శకులు సంపత్ నంది,సాగర్ చంద్ర,శేఖర్ మాస్టర్ ఇలా ఎందరో సినీ ప్రముఖుల మన్ననలు పొందిన ఈమ్యూజికల్ వీడియో ప్రస్తుతం యూ ట్యూబ్ లొ ఒక సెన్సేషన్ .పెద్దపల్లి రోహిత్ రచన, సంగీత దర్శకత్వంలో రూపొందిన ఈ పాటకు కిరణ్ మాస్టర్ కొరియోగ్రఫిచేయగా,సిద్దం మనోహర్ కెమేరా మరియు సుమన్ రుద్రు ప్రధాన పాత్రలో నటించారు .

స్ప్రెడ్ ద లవ్ ,స్ప్రెడ్ ద పీస్ అనే నినాదంతో ,ప్రపంచ శాంతిని కాపాడాలని,ప్రే మను పంచాలని,విద్వేషాలకు దూరంగా వుండాలని చక్కటి సందేశంతో ఉస్మానియాయూనివర్సిటీ, నాగర్జున సాగర్,వరంగల్,లక్న వరం,గోవా తదితర ప్రదేశాలలో అత్యంత భారీగా ఈ పాట రూపొందడం విశేషం. 

తాజాగా అమెరికాలో దుండగుల చేతిలో తీవ్రంగా గాయ పడ్డ సాయి క్రిష్న త్వరగా కోలుకోవాలని డైరెక్టర్ డాక్టర్ ఆనంద్ ఆకాంక్షించారు.   ప్రతి ఒక్కరూ,రెయిన్ బోమ్యూజికల్ వీడియో ని చూసి, జ్యాత్యహంకార దాడులలో ప్రాణాలను కోల్పోయిన అమాయకులకు ఇస్తున్న తమ చిన్న ప్రయత్నాన్ని ఆదరించాలని ఆయన కోరారు.

తమ కొడుకు అకాల మరణం తమ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని మిగిల్చినా,డాక్టర్ ఆనంద్ గారు ఈ పాటను శరత్ కొప్పుకి అంకితం అవ్వడం వల్ల ,తమ కొడుకుఇంకా తమ మధ్యనే వున్నట్లుగా అనిపిస్తుందని శరత్ తండ్రి కొప్పు రాం మోహన్ గారు తెలిపారు.