Home / Reviews / Runam Movie review 3.5
` రుణం` మూవీ రివ్యూ

Runam Movie review 3.5

` రుణం` మూవీ రివ్యూ 

` రుణం` మూవీ రివ్యూ

` రుణం` మూవీ రివ్యూ 3.5

నటీ నటులు: గోపికృష్ణ-మహేంద్ర, శిల్ప-తేజు-ప్రియా అగస్టీన్ , ప్రదీప్ ప్రత్తికొండ తదితరులు

సాంకేతిక నిపుణులు:

బ్యానర్ : బెస్ట్ విన్ ప్రొడక్షన్

నిర్మాతలు : భీమినేని సురేష్-జి.రామకృష్ణారావు

మ్యూజిక్ : ఎస్వీ మల్లిక్ తేజ్

కథ-స్క్రీన్ ప్లే-సంభాషణలు-దర్శకత్వం: ఎస్.గుండ్రెడ్డి

3.5/5

 `రుణం` లాంటి  డిఫరెంట్ టైటిల్ తో ప్రేక్షకుల్లో  సినిమా పై క్యూరియాసిటీ పెంచారు దర్శక నిర్మాతలు .   ఇక   పాటలు, ట్రైలర్స్ తో ఆకట్టుకున్న ఈ సినిమా ఈ ఫ్రైడే రిలీజ్ అయ్యింది. మరి ఆడియెన్స్ ని ఏ మాత్రం ఎంటర్టైన్ చేస్తుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం …

‘స్టోరీ…

తల్లితండ్రులే లోకం గా బ్రతికే ఒక కుర్రాడు శ్రీను (మహేంద్ర ), చిన్నప్పుడే తల్లితండ్రులను కోల్పోయిన సుధీర్ ( గోపికృష్ణ ) వీరిద్దరూ రూమ్మేట్స్. సుధీర్ ఒక అమ్మాయిని ప్రేమిస్తుంటాడు… ఆ అమ్మాయి మాత్రం అతన్ని అవసరానికి యూస్ చేసుకుంటుంది.  ఈ విషయం తెలుసుకున్న హీరో డబ్బు లేకపోబట్టే ఇలా జరిగినదని అనుకుని ఎలాగైనా డబ్బు సంపాదించాలనుకుంటాడు. ఈ క్రమం లో తన ఎంటెక్ నాలెడ్జి తో  ఇతరుల అకౌంట్ నుంచి అమౌట్ హాక్ చేసే సాఫ్ట్ వేర్ కనిపెడతాడు.  ఈ క్రమం లో ఎలాంటి పరిస్థితుల్లో చిక్కుకున్నారు . దాని నుంచి బయట పదరా లేదా ? చివరకు ఏమైంది అన్నది స్టోరీ. 

 ఆర్టిస్ట్స్ పెరఫార్మెన్సెస్ …

సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా గోపికృష్ణ అటు క్లాస్ , మాస్ ఆడియన్స్ ను ఆకట్టుకునే ప్రయత్నం చేసాడు . అలాగే మిడిల్ క్లాస్ కుర్రాడు గా, తలితండ్రుల పట్ల ప్రేమానురాగాలు కలిగిన కొడుకుగా మహేంద్ర రాణించాడు. శిల్ప-తేజు-ప్రియా అగస్టీన్ ముగ్గురు హీరోయిన్స్ పర్వాలేదనిపించుకున్నారు. మెయిన్ విల్లన్ గా ప్రదీప్ , మిగతా వారంతా కొత్త వారైనప్పటికీ వారి పాత్రలకు న్యాయం చేసారు.

టెక్నిషన్స్ వర్క్ …

దర్శకుడు తీసుకున్న స్టోరీ పాతదే అయినప్పటికీ .. స్క్రీన్ ప్లే పరంగా కొత్తగా డిజైన్ చేసాడు .   సినిమాటోగ్రఫీ  కూడా బావుంది. ఇక ఎస్వీ మల్లిక్ తేజ్ మ్యూజిక్ వినసొంపుగా ఉంది. పాటలు అన్ని బావు న్నాయి . ఆర్ ఆర్ అక్కడక్కడ శృతిమించిన ఓవరాల్ గా బావుంది. సినిమాకు హైలైట్ అంటే మ్యూజిక్ అని చెప్పొచ్చు . అలాగా నిర్మాణ విలువలు బావున్నాయి .

 ప్లస్ పాయింట్స్ 

స్క్రీన్ ప్లే 

డైరెక్షన్

సంగీతం 

ఆర్టిస్ట్స్  పెరఫార్మెన్సెస్ 

నిర్మాణ విలువలు

సినిమాటోగ్రఫీ 

అనాలసిస్ …

కొత్త కొత్త కథలతో టాలీవుడ్ కొత్తపుంతలు తొక్కుతున్న తరుణం లో  `రుణం` సినిమా మరో అడుగు ముందుకేసి ఒక కొత్త పాయింట్ తో వచ్చింది. కథ , కథనాలతో పాటు , సన్నివేశాలు , ఫ్రెండ్ షిప్ , సెంటిమెంట్ , కామెడీ  సినిమాకు ప్రాణం పోశాయి.  సినిమా ఓపెనింగే కొత్తగా స్ట్రాట్ అయి  సినిమా పై ఇంటరెస్ట్ పెంచేలా చేసింది.  ముఖ్యం గా  హీరో సుధీర్ అత్యాశకు పోయి తన మిత్రున్ని కోల్పోయి , ఆ మిత్రుడు ఫ్యామిలీ కి హెల్ప్ చేస్తూ తన ఋణం తీర్చుకోవడం అనే లైన్ ఇంప్రెసివ్ గా ఉంది. డైరెక్షన్ తో పాటు  డైలాగ్స్ బావున్నాయి.  సంగీ తం సినిమాకు హైలైట్ గా నిలించింది. నిర్మాతలు కూడా సినిమా కి కథకు మించి బడ్జెట్ పెట్టారు .  బోల్డ్ కంటెంట్ , హారర్ సినిమాలతో విసిగి పోయిన ప్రేక్షకులకు రుణం సినిమా మంచి రిలీఫ్  ఇస్తుంది, ఫ్యామిలీ తో వెళ్లి హాయిగా చూడొచ్చు . 

సూటిగా చెప్పాలంటే …`రుణం` ఫ్యామిలీ తో చూడాల్సిన సినిమా 
Rating: 3.5