Home / Featured / “MBM” Mera Bharath Mahan Movie Review

“MBM” Mera Bharath Mahan Movie Review

`ఎమ్ బిఎమ్` మూవీ రివ్యూ!!
“MBM” Mera Bharath Mahan Movie Review
 
 
 
న‌టీన‌టులుః   అఖిల్ కార్తిక్‌, ప్రియాంక శ‌ర్మ‌, శ్రీధ‌ర్ రాజు, బాబు  మోహన్ , త‌ణికెళ్ల భ‌ర‌ణి, గిరి బాబు, ఆమని  , నారాయణ రావు, ఎల్ బి శ్రీరాం, బాలాజి త‌దిత‌రులు
 
సాంకేతిక నిపుణులుః       
క‌థః  డా.శ్రీధ‌ర్ రాజు య‌ర్ర‌
 డైలాగ్స్ః య‌ర్రంశెట్టి సాయి,
 పాట‌లుః పెద్దాడ‌మూర్తి, 
ఎడిట‌ర్ః మేన‌గ శ్రీను,
 ఫైట్స్ః విజ‌య్‌
ప్రొడ్యూస‌ర్స్ః డా.శ్రీధ‌ర్ రాజు  య‌ర్ర‌, 
డా.తాళ్ల ర‌వి, డా.టి.ప‌ల్ల‌వి రెడ్డి
 స్ర్కీన్ ప్లే-ద‌ర్శ‌క‌త్వంః భ‌ర‌త్
 రిలీజ్ః 26-4-2019
రేటింగ్ః 3
 
  డా.అంబేద్క‌ర్, తెలంగాణ‌, మందు పాత‌ర, త‌ప‌స్సు , మైస‌మ్మ ఐపియ‌స్‌, నీల‌వేణి లాంటి సామాజిక ఇతివృత్తాల‌తో కూడిన చిత్రాల‌కు ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన భ‌ర‌త్ లేటెస్ట్ గా సోష‌ల్ మెసేజ్‌కు క‌మ‌ర్షియ‌ల్ అంశాలు జోడించి `ఎమ్‌బియ‌మ్‌` (మేరా భార‌త్ మ‌హాన్‌` చిత్రాన్ని డైర‌క్ట్ చేసారు. దీన్ని సామాజిక చైత‌న్యం ఉన్న ముగ్గురు డాక్ట‌ర్స్ క‌లిసి నిర్మించ‌డం విశేషం. మ‌రి టైటిల్, ట్రైల‌ర్ తో ఆక‌ట్ట‌కున్న ఈ చిత్రం ఈ శుక్ర‌వారం విడుద‌లైంది. మ‌రి ఈ చిత్రం ప్రేక్ష‌కుల‌ను ఏ మేర‌కు ఆక‌ట్టుకుందో తెలుసుకునే ప్ర‌య‌త్నం చేద్దాం…
 
క‌థ‌లోకి వెళితే..
 కార్పోరేట్ విద్య , వైద్య వ్య‌వ‌స్థ‌లతో పాటు  కాల్ మ‌నీ వ‌ల్ల  మూడు కుటుంబాలు ఎలా న‌ష్ట పోయాయి. ఈ కుటుంబాల‌లోని వ్య‌క్తులు కార్పోరేట్ వ్య‌వ‌స్త పై ఎలా పోరాడారు?   చివ‌ర‌కు కార్పోరేట్ వ్య‌వ‌స్థ ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంది? ఈ పోరాటంలో గెలిచింది ఎవ‌రు? ఓడింది ఎవ‌రు? అనేదే సినిమా. అలాగే ఇందులో చిన్న నాటి మిత్రులైన కార్తిక్ ( హీరో అఖిల్ కార్తిక్), సంజిత ( హీరోయిన్ ప్రియాంక‌శ‌ర్మ‌) ఎలా విడిపోయారు? ఎలాంటి ప‌రిస్థితుల్లో క‌లిసారు అన్న ల‌వ్ స్టోరి కూడా ఆసక్తిక‌రంగా ఉంటుంది.  
 సినిమాకు ప్ల‌స్
  శ్రీధ‌ర్ రాజు స్టోరి, న‌ట‌న‌
 భ‌ర‌త్ డైర‌క్ష‌న్‌
 సంగీతం
నిర్మాణ విలువ‌లు
న‌టీన‌టుల ప‌ర్ఫార్మెన్స్
 సినిమాటోగ్ర‌ఫీ
 
 
  న‌టీన‌టులు ప‌ర్ఫార్మెన్స్ః
 
స్టూడెంట్ గా, ఉన్న‌త భావాలు క‌లిగిన వ్య‌క్తిగా, ల‌వ‌ర్ బాయ్ గా ఇలా త్రీ షేడ్స్ లో హీరో అఖిల్ కార్తిక్ అద్భుత‌మైన న‌ట‌న క‌న‌బ‌రిచాడు. అలాగే సామాజిక స్పృహ తో పాటు త‌ల్లి దండ్రుల‌ను కాపాడోకోవ‌డానికి  స‌మాజం నుండి ఎదురయ్యే స‌మ‌స్య‌లను  ఎదుర్కొంటూ ఎలా నిల‌బ‌డింద‌న్న పాత్ర‌లో ప్రియాంక శ‌ర్మ రాణించింది. త‌న అందం, అభిన‌యంతో ఆక‌ట్టుకుంది.  ఇక సినిమాకు కీల‌క‌మైన` మేరా భార‌త్ మ‌హాన్` సృష్టిక‌ర్త మ‌హాన్ పాత్ర‌లో శ్రీధ‌ర్ రాజు చెగువేరా వేష ధార‌ణ‌లో త‌న హావ‌భావాల‌తో  అద్భ‌తమైన న‌ట‌న ప్ర‌ద‌ర్శించాడు. త‌న‌కిదే తొలి సినిమా అయినా ఎక్క‌డా ఆ ఫీలింగ్ లేకుండా క్యార‌క్ట‌ర్ లో లీన‌మై ప్ర‌తి ఒక్క‌రినీ త‌న డైలాగ్స్ తో క‌దిలించే ప్ర‌య‌త్నం చేసాడు. ఇక బాబు మోహ‌న్‌, గిరిబాబులు, త‌మదైన శైలిలో న‌వ్వించారు. విల‌న్ గా బాలాజీ ర‌జ‌నీకాంత్ మేన‌రిజ‌మ్స్ తో మెస్మ‌రైజ్ చేసాడు. ప్రొఫెస‌ర్ గా త‌ణి కెళ్ల భ‌ర‌ణి, మిడిల్ క్లాస్ ఫాదర్స్ గా ఎల్బీ శ్రీరామ్, నారాయ‌ణ రావు వారి పాత్ర‌ల‌కు న్యాయం చేసారు. 
 
 సాంకేతిక నిపుణులుః
   ముఖ్యంగా సినిమాకు ప్రాణం అంటే స్టోరి.  శ్రీధ‌ర్ రాజు  ఒక డాక్ట‌ర్ గా   స‌మాజంలో త‌ను చూసిన వివిధ ర‌కాల వ్య‌క్తుల‌ను, స‌మ‌స్య‌ల‌ను, వాటికి కార‌ణాలను తీసుకొని త‌న  అనుభ‌వంతో ఒక అద్భ‌త‌మైన క‌థాంశాన్ని సిద్దం చేసుకున్నారు. ఆ క‌థాంశాన్ని సామాజిక చిత్రాల‌ను, సందేశాత్మ‌క చిత్రాల‌ను అద్భుతంగా తీయ‌గ‌ల స‌త్తా ఉన్న భ‌ర‌త్ చేతిలో పెట్టారు. ఆ క‌థ‌ను వెండి తెర‌పై ప్ర‌తి గుండెని త‌ట్టి లేపేలా ఆవిష్క‌రించారు ద‌ర్శ‌కుడు భ‌ర‌త్. ల‌లిత్ సురేష్ అందించిన పాట‌లు, పెద్దాడ మూర్తి సాహిత్యం బాగున్నాయి. కానీ నేప‌థ్య సంగీతం  పై ఇంకా దృష్టి సారించే ఉంటే ఇంకా బాగుండేది.  క‌థ మూడ్ త‌గ్గ‌ట్టుగా సినిమాటో గ్ర‌ఫీ ఉంది. నిర్మాత‌లు ఎక్క‌డా రాజీ ప‌డ‌కుండా సినిమాను నిర్మించారు. ముఖ్యంగా య‌ర్రంశెట్టి సాయి సంభాష‌ణ‌లు అంద‌ర్నీ ఆలోచింప‌జేసేలా ఉన్నాయి. 
 
విశ్లేష‌ణః
 ప్ర‌జంట్  సిట్యుయేష‌న్ లో హ‌ర్ర‌ర్ సినిమాలు, బోల్డ్ కంటెంట్ తో వ‌స్తోన్న చిత్రాల సంఖ్య ఎక్కువ‌గా ఉంది. వీటినే చూస్తున్నారని ద‌ర్శ‌క నిర్మాత‌లు భావిస్తూ అలాంటి చిత్రాల‌ను నిర్మించ‌డానికే ప‌రుగులు తీస్తోన్న క్ర‌మంలో సోష‌ల్ కంటెంట్ తో ఒక సందేశాత్మ‌క చిత్రాన్ని నిర్మించ‌డానికి ముందుకు వ‌చ్చిన నిర్మాత‌ల‌ను, ద‌ర్శ‌కుడు భ‌ర‌త్ ను అభినందించాలి. స‌మాజానికి ప‌ట్టిన రుగ్మ‌త‌ల‌ను తొలిగించ‌డానికి ముగ్గురు డాక్ట‌ర్లు క‌ట్టుకున్న  కంక‌ణ‌మే మేరా భార‌త్ మ‌హాన్. స‌మ‌కాలీన రాజ‌కీయ అంశాల‌ను,  ప్ర‌భుత్వ పాల‌న‌కు, ప్ర‌జ‌ల జీవ‌నానికి మ‌ధ్య ఉన్న అగాథాన్ని అంద‌రికీ అర్థ‌మ‌య్యే రీతిలో చూపించారు.  కార్పోరేట్ విద్వా, వైద్య సంస్థ‌లు, కాల్ మ‌నీ వ్య‌వ‌స్థల గురించి వాటి వ‌ల్ల ప్ర‌జ‌లు ప‌డుతున్న అవ‌స్థ‌ల గురించి క‌ళ్ల‌కు క‌ట్టిక‌నట్టు చూపించే ప్ర‌య‌త్నం చేసారు ద‌ర్శ‌కుడు. ప్ర‌స్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఎదుర్కోంటున్న స‌మ‌స్య పిల్ల‌ల‌పై కార్పోరేట్ కాలేజీల ఒత్తిడి, వారి బ‌ల‌న్మ‌ర‌ణాలు గురించి చ‌ర్చిస్తూ…ఆరోగ్య శ్రీ ప‌థ‌కాల వెనుకున్న అస‌లు మ‌త‌ల‌బ్ లు, ఫీజు రీ ఇంబ‌ర్స్ మెంట్ వ‌ల్ల లాభ న‌ష్టాలు ఇలా స‌మ‌కాలీన అంశాల‌ను వాటిని అమ‌లు జేసే విధానాలు చూపిస్తూ ఎండ‌గ‌ట్టే ప్ర‌య‌త్నం చేసారు. స‌మ‌స్య‌ల‌ను  చూపించ‌డం మాత్ర‌మే కాకుండా వాటికి ప‌రిష్కార మార్గాల‌ను చూపించారు. యువ‌త‌ను మేల్కోలుపుతూ , ప‌బ్లిక్ ను చైత‌న్య ప‌రుస్తూ వ‌చ్చిన ఈ చిత్రం ప్ర‌తి ఒక్క‌రూ చూడాల్సిన చిత్రం అన‌డంలో సందేహం లేదు.    ల‌వ్ , కామెడీ, యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్స్ చిత్రాలు ఎప్పూడు వ‌స్తూ నే ఉంటాయో కానీ, స‌మాజాన్ని చైత‌న్య పరిచే చిత్రాలు మాత్రం అరుదుగా వ‌స్తుంటాయి. ఇలాంటి చిత్రాల‌ను ఆద‌రించాల్సిన బాధ్య‌త మ‌నంద‌రి పై ఉంది.
 
 సూటిగా చెప్పాలంటేః విజ్ఞానం- వికాసం-వినోదం క‌లగ‌లిపితే – మేరా భార‌త్ మ‌హాన్