Home / Featured / Rangupaduddi Movie Review
Rangupaduddi Movie Review

Rangupaduddi Movie Review

                             `రంగుప‌డుద్ది`సినిమా రివ్యూ
Rangupaduddi Movie Review
 
 
`రంగుప‌డుద్ది`సినిమా రివ్యూ
 రేటింగ్ః 3.5/5
 న‌టీనటులుః  అలీ, ర‌ఘుబాబు, హీన‌,  ధ‌న్ రాజ్ ,  జ‌బ‌ర్ద‌స్త్ అప్పారావు, షేకింగ్ శేషు, సుమ‌న్ శెట్టి త‌దిత‌రులు 
 
సాంకేతిక నిపుణులుః
బేన‌ర్ః మ‌నీషా ఆర్ట్స్ 
స‌మ‌ర్ప‌ణః కిషోర్ రాఠి
 క‌థ-నిర్మాత   : మహేష్ రాఠి
డైలాగ్స్: అభయ్ శ్రీ జయ్
 మ్యూజిక్: సుభాష్ ఆనంద్
ఎడిటర్: నందమూరి హరి
డిఓపి: జి. ఎస్. రాజ్ (మురళి), 
నిర్మాత: మహేష్ రాఠి
డైరెక్టర్: ఎస్. శ్యామ్ ప్రసాద్.
 రేటింగ్ః 3.5/5
 
      `రంగు ప‌డుద్ది` అనే డైలాగ్ విన‌గానే మ‌న‌కు గుర్తుకొచ్చేది మ‌నీషా ఆర్ట్స్ బేన‌ర్. అవును య‌మ‌లీల‌, మాయ‌లోడు లాంటి ఫ్యామిలీ, కామెడీ సినిమాలు నిర్మించిన ఈ సంస్థ నుంచి వ‌చ్చిన హ‌ర్ర‌ర్ కామెడీ చిత్రం రంగుప‌డుద్ది. మౌన‌మేల‌నోయి సినిమాను డైర‌క్ట్ చేసిన శ్యామ్ ప్ర‌సాద్ ద‌ర్శ‌కుడు. అలీ, ర‌ఘుబాబు, ధ‌న్ రాజు, షేకింగ్ శేషు, జ‌బ‌ర్ద‌స్త్ అప్పారావు, సుమ‌న్ శెట్టి  లాంటి క‌మెడియ‌న్స్ న‌టించారు. మ‌రి ఈ శుక్ర‌వారం విడుద‌లైన ఈ సినిమా ఆడియ‌న్స్ ను ఏ విధంగా ఆక‌ట్టుకుంటుందో తెలుసుకుందాం….
 
స్టోరి 
    పాస్ట్ లోకి వెళ్లాల‌నుకునే ఒక గ్యాంగ్ , ఫ్యూచ‌ర్ లోకి వెళ్లాల‌ను కునే ఒక గ్యాంగ్ కి ఒక సైంటిస్ట్ క‌లిసి మీ కోరిక‌ల‌ను నేను టైమ్ ట్రావెల్ ద్వారా తీర్చుతాను. కానీ మీరు అమావాస్య రోజు  ఒక రాజ్ మ‌హల్ కి రావాలి    అంటాడు. అత‌డి మాట‌లు న‌మ్మి వెళ్లిన ఆ రెండు గ్యాంగ్స్ ఆ రాజ‌మ‌హ‌ల్ లో ఎలాంటి పిరిస్థితులు ఎదుర్కోవాల్సి వ‌చ్చింది. ఆ రాజ‌మ‌హ‌ల్ నుంచి ఆ రెండు గ్యాంగ్ లు బ‌య‌ట‌ప‌డ్డాయా?  లేదా ? అన్న‌ది సినిమా. 
 
 
 ప్ల‌స్ పాయింట్స్
  న‌టీన‌టుల న‌ట‌న‌
  హ‌ర్ర‌ర్ కామెడీ
 సంగీతం
 ద‌ర్శ‌కుడి క‌థ‌, క‌థ‌నాలు
నిర్మాత‌ల మేకింగ్ 
 
మైన‌స్ పాయింట్స్
  నిడివి
 క్లైమాక్స్  
 
 
విశ్లేష‌ణః
 ఏదో ఒక పాడు ప‌డ్డ  బంగ్లాకు తీసుకెళ్లి ఆ బంగ్లాలో దెయ్యాలు ఉన్నాయంటూ భ‌య‌పెడుతూ న‌వ్వించ‌డం అనేది కామ‌న్ పాయింట్ అయినా  సీనియ‌ర్ క‌మెడియ‌న్ అలీ, ధ‌న్ రాజ్, జ‌బ‌ర్త‌స్ తో మెప్పించిన షేకింగ్ శేషు,  జ‌బ‌ర్త‌స్ అప్పారావు లాంటి క‌మెడియ‌న్స్ ప‌డ‌టంతో వారి క్యార‌క్ట‌ర్స్ తో న‌వ్వులు పూయించారు. అంద‌రూ కామెడీ పండించ‌డంలో సిద్ధ‌హ‌స్తులు కావ‌డంతో వాళ్లు భ‌య‌ప‌డుతూ ఆడియ‌న్స్ ను  న‌వ్వించారు.  ఎన్నో గొప్ప చిత్రాల‌ను నిర్మించిన కిషోరాఠీ హ‌ర్ర‌ర్ కామెడీ చిత్రంతో చాలా గ్యాప్ త‌ర్వాత వ‌చ్చి రాజీ ప‌డ‌కుండా నిర్మించ‌డ‌మే కాకుండా ఒక స‌క్సెస్ ఫుల్ సినిమాను నిర్మించారు అన‌డంలో సందేహం లేదు.  సినిమా స్టార్టింగ్ లో ఏదో అనిపించినా రాజ్ మ‌హ‌ల్ కి వెళ్లాక సినిమా ఇంట్ర‌స్ట్ ని క్రియేట్ చేస్తుంది. రెండు బ్యాచ్ లు ఒకరికొక‌రు దెయ్యం గ్యాంగ్ అంటూ భ‌య‌ప‌డ‌టం , వారిని త‌ప్పించుకుని ఆ బంగ్లా నుంచి బ‌య‌ట‌ప‌డాలన్న క్ర‌మంలో ఆ క్యారక్ట‌ర్స్ ప‌డే భ‌యం అంద‌ర్నీ క‌డుపుబ్బ న‌వ్విస్తుంది.  ద‌ర్శ‌కుడు టైమ్ ట్రావెల్ అనే ఒక పాయింట్ తీసుకుని దాని చుట్టు ఆస‌క్తిక‌ర‌మైన క‌థ ని అల్లుకున్నాడు.సినిమాటో గ్ర‌ఫీ, సంగీతం బాగా కుదిరాయి.  కాకుంటే క్లైమాక్స్ అర్థాంత‌రంగా ముగిస్తూ పార్ట్ టూ అని వేయ‌డంతో ప్రేక్ష‌కులు కొంత ఏదో ఉంది తెలుసుకోవాల‌న్న వారి ఎగ్జైటింగ్ కి ఫుల్ స్టాప్ ప‌డ‌టంతో కాస్త  నిరుత్సాహ‌ప‌డ్డ‌ప్ప‌టికీ . ..కానీ రెండో పార్ట్ చూడాల‌న్న క్యూరియాసిటీ మాత్రం పార్ట్ పెంచింది.  
 
 ఒక్క‌మాటలో చెప్పాలంటేః
 ఇటీవల కాలంలో హ‌ర్ర‌ర్ సినిమాలు ఎ న్నో వ‌చ్చిన‌ప్ప‌టికీ ఒక వెరైటీ కాన్సెప్ట్ తో వ‌చ్చిన చిత్రం మాత్రం రంగుప‌డుద్ది అని చెప్పాలి.  టైమ్ ట్రావెల్ అంటూ ఒక వినూత్న‌మైన కాన్సెప్ట్ తో ప్రారంభించి ఒక బంగ్లాలో ఇరుక్కుపోవ‌డం , అక్క‌డి నుంచి బ‌య‌ట‌ప‌డే క్ర‌మంలో జరిగే కామెడీ పిల్లలు, పెద్ద‌లు , మాస్, క్లాస్ అన్ని వ‌ర్గాల‌కు న‌చ్చే సినిమా అన‌డంలో డౌట్ లేదు. సో గో అండ్ వాచ్
 
  బాట‌మ్ లైన్ః   కామెడీ పండింది!!!