Home / Featured / VG Entertainment First Scheduled Completed

VG Entertainment First Scheduled Completed

వీజీ ఎంటర్‌టైన్‌మెంట్ తొలిషెడ్యూల్ పూర్తి 
VG Entertainment First Scheduled Completed
విహారి, షెర్రీ అగర్వాల్ జంటగా వీర గనమాల స్వీయ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న చిత్రం తొలిషెడ్యూల్‌ని శరవేగంగా పూర్తిచేసుకుంది. ఈ సందర్భంగా దర్శకుడు చిత్ర విశేషాలను తెలియజేస్తూ  ఓ వినూత్నమైన కథతో, ఎవరూ అంచనా వేయలేని ట్విస్ట్‌లతో క్షణం క్షణం ఉత్కంఠగా సాగే సస్పెన్స్ థ్రిల్లర్ ఇది. స్క్రీన్‌ప్లే ప్రధానంగా కొనసాగే ఈ చిత్రంలో ప్రతి మలుపు ఎంతో థ్రిల్లింగ్‌గా వుంటుంది. కొత్తదనం కోరుకునే ప్రేక్షకులకు తప్పకుండా నచ్చే చిత్రమిది. అన్ని వర్గాలను అలరించే అంశాలు ఇందులో వున్నాయి. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరిగిన షూటింగ్ తొఇప్పటి వరకు యాభై శాతం చిత్రీకరణ జరుపుకున్న ఈ చిత్రం రెండో షెడ్యూల్ ఈ నెల 15 నుండి ప్రారంభం కానుంది. ఈ షెడ్యూల్‌తో రెండు పాటలు మినహా చిత్రీకరణ పూర్తవుతుంది అని తెలిపారు. అజయ్, రాజీవ్‌కనకాల, తనికెళ్లభరణి, చమ్మక్‌చంద్ర, తోటపల్లి మధు తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: సందీప్, కెమెరా: సునీల్‌కుమార్ ఎన్, స్క్రీన్‌ప్లే: హరిప్రసాద్ జక్కా, మాటలు, పాటలు: రామాంజనేయులు.