లాంఛ‌నంగా ప్రారంభమైన సందీప్ కిష‌న్ `A1 ఎక్స్‌ప్రెస్‌

లాంఛ‌నంగా ప్రారంభమైన సందీప్ కిష‌న్ `A1 ఎక్స్‌ప్రెస్‌`*నేటి నుండి రెగ్యుల‌ర్ షూటింగ్‌

`నిను వీడ‌ని నీడ‌ను నేనే` చిత్రంతో సూప‌ర్‌హిట్ సాధించిన యువ క‌థానాయకుడు సందీప్ కిష‌న్ హీరోగా న‌టిస్తున్న కొత్త చిత్రం `A1 ఎక్స్‌ప్రెస్‌`. సోమ‌వారం ఈ సినిమా లాంఛ‌నంగా ప్రారంభ‌మైంది. ఈ కార్య‌క్ర‌మంలో ప‌లువురు సినీ ప్ర‌ముఖులు పాల్గొన్నారు. డెన్నిస్ జీవ‌న్ క‌నుకొలను ద‌ర్శ‌క‌త్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ, అభిషేక్ అగ‌ర్వాల్ ఆర్ట్స్‌, వెంక‌టాద్రి టాకీస్ ప‌తాకాల‌పై  టీజీ విశ్వ‌ప్ర‌సాద్‌, అభిషేక్ అగ‌ర్వాల్, సందీప్ కిష‌న్‌, ద‌యా ప‌న్నెం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
నేటి నుండి రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభ‌మైంది. ముర‌ళీశ‌ర్మ‌, ర‌ఘుబాబు, సందీప్ కిష‌న్‌ల‌పై  స‌న్నివేశాల‌ను చిత్రీక‌రిస్తున్నారు. హ‌కీ బ్యాక్‌డ్రాప్‌లో తెర‌కెక్కుతున్న తొలి తెలుగు చిత్ర‌మిది. అలాగే ఈ జోన‌ర్‌లో సందీప్ కిష‌న్ చేస్తున్న తొలి చిత్రం కూడా ఇదే. హిప్ హాప్ త‌మిళ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి కెవిన్ రాజు సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. ఛోటా కె.ప్ర‌సాద్ ఎడిటర్‌గా వ‌ర్క్ చేస్తున్నారు.

న‌టీన‌టులు:
సందీప్ కిష‌న్‌, ముర‌ళీశ‌ర్మ‌, ర‌ఘుబాబు,

సాంకేతిక వ‌ర్గం:
ద‌ర్శ‌క‌త్వం:  డెన్నిస్ జీవ‌న్ క‌నుకొల‌ను
నిర్మాత‌లు:  టీజీ విశ్వ‌ప్ర‌సాద్‌, అభిషేక్ అగ‌ర్వాల్, సందీప్ కిష‌న్‌, ద‌యా ప‌న్నెం
బ్యాన‌ర్స్‌:  పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ, అభిషేక్ అగ‌ర్వాల్ ఆర్ట్స్‌, వెంక‌టాద్రి టాకీస్
కో ప్రొడ్యూస‌ర్:  వివేక్ కూచిభొట్ల 
మ్యూజిక్‌:  హిప్ హాప్ త‌మిళ‌
కెమెరా:  కెవిన్ రాజు
ఎడిట‌ర్‌:  ఛోటా కె.ప్ర‌సాద్‌
ఆర్ట్‌:  అలీ
కాస్ట్యూమ్ డిజైన్‌:  హ‌ర్మ‌న్‌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *