మువ్వా విజ‌య్ చౌద‌రి నిర్మాత‌గా ఎం స్క్రీన్స్ బ్యాన‌ర్‌పై మూడు చిత్రాల నిర్మాణం

మువ్వా విజ‌య్ చౌద‌రి నిర్మాత‌గా ఎం స్క్రీన్స్ బ్యాన‌ర్‌పై మూడు చిత్రాల నిర్మాణం

`క‌థ‌నం` సినిమా నిర్మాత‌ల్లో ఒక‌రైన మువ్వా విజ‌య్ చౌద‌రి నిర్మాత‌గా ఎం స్క్రీన్స్ బ్యాన‌ర్‌ను స్టార్ట్ చేశారు. ఈ బ్యాన‌ర్‌లో మూడు సినిమాలు నిర్మితం కానున్నాయి. ఈ సంద‌ర్భంగా ..
నిర్మాత మువ్వా విజ‌య్ చౌద‌రి మాట్లాడుతూ – “ఎం స్క్రీన్స్ బ్యాన‌ర్‌ను స్టార్ట్ చేశాం. యంగ్ టాలెంట్‌కు ఎంక‌రేజ్ చేస్తూ మా బ్యాన‌ర్‌లో వైవిధ్య‌మైన చిత్రాలు, ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకునేలా రూపొందిస్తాం. ముందు మా బ్యాన‌ర్‌లో మూడు సినిమాలను నిర్మిస్తున్నాం. ముందుగా డిసెంబ‌ర్ మొద‌టివారంలో తొలి చిత్రం ప్రారంభం కానుంది. ఇందులో `నాట‌కం` ఫేమ్ ఆశిష్ గాంధీ హీరోగా న‌టిస్తున్నారు. రాజ‌శేఖ‌ర్ రావు ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయ‌నున్నారు. అలాగే ద‌ర్శ‌కురాలు నందిని రెడ్డి వ‌ద్ద ద‌ర్శ‌క‌త్వ శాఖ‌లో ప‌నిచేసిన స్మ‌ర‌ణ్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో మ‌రో చిత్రం రూపొంద‌నుంది. అలాగే ప‌రుశురాం వ‌ద్ద ద‌ర్శ‌క‌త్వ శాఖ‌లో ప‌నిచేసిన ఆర్‌.శిరీష్ ద‌ర్శ‌క‌త్వంలో మూడో చిత్రాన్ని రూపొంద‌నుంది. పై మూడు చిత్రాల‌కు పూర్తి స్థాయి న‌టీన‌టులు, సాంకేతిక నిపుణులు ఎంపిక చేసి వివ‌రాల‌ను తెలియ‌జేస్తాం“ అన్నారు. 

బ్యాన‌ర్‌:  ఎం స్క్రీన్స్‌
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్స్‌:  ర‌విశంక‌ర్‌, కొండ బ‌త్తుల నాగ‌శేఖ‌ర్‌
నిర్మాత‌:  మువ్వా విజ‌య్ చౌద‌రి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *