Rudra Simha Movie Audio Launch

సినీ అథిరదుల సమక్షంలో ఘనంగా జరుపుకున్న  రుద్ర సింహ” ఆడియో వేడుక KM ఫిల్మ్ ప్రొడక్షన్స్ పతాకంపై సంతోష్. స్నేహ, మైత్రి, హీరో, హీరోయిన్లు గా మనోహర్

Read more

Vade Evadu movie first look launch by talasani srinivas yadav

తలసాని శ్రీనివాస్ యాదవ్ చేతుల మీదుగా విడుదలైన ” వాడు ఎవడు ” మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ మరియు టీజర్   రాజేశ్వరి సినీ క్రియేషన్స్

Read more

Heroine Avika Gor Interview

  నా క్యారెక్టర్ చుట్టూ ‘టెన్త్ క్లాస్ డైరీస్’ తిరుగుతుంది, చాందినికి ఏమైందనేది థియేటర్లలో చూడండి – అవికా గోర్ ఇంటర్వ్యూ. అవికా గోర్, శ్రీరామ్ ప్రధాన

Read more

Director Maruthi Interview

  టైటిల్ కు జస్టిఫై చేసే సినిమా “పక్కా కమర్షియల్”…స్టార్ డైరెక్టర్ మారుతి భ‌లేభ‌లే మ‌గాడివోయ్, ప్ర‌తిరోజు పండ‌గే వంటి బ్లాక్ బ‌స్ట‌ర్స్ అందిస్తూ వరస విజయాలతో

Read more

Pakka Commercial Movie Pre-Release Event

  పక్కా కమర్షియల్ పక్కాగా ప్రేక్షకులను అలరిస్తుందని నమ్ముతున్నాను – పక్కా కమర్షియల్ మెగా మ్యాచో ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మెగాస్టార్ చిరంజీవి గారు   

Read more

sammathame movie success meet

  సమ్మతమే” చిత్రాన్ని పీపుల్స్ బ్లాక్ బస్టర్ గా చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు : సమ్మతమే ‘పీపుల్స్ బ్లాక్ బస్టర్’ సక్సెస్ మీట్ లో టీమ్   యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో కిరణ్ అబ్బవరం కథానాయకుడిగా గోపీనాథ్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన మ్యూజికల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌ “సమ్మతమే”. చాందిని చౌదరి కథానాయిక. యూజీ ప్రొడక్షన్స్ బ్యానర్ పై కంకణాల ప్రవీణ నిర్మించిన ఈ చిత్రం గీతా ఆర్ట్స్ ద్వారా జూన్ 24న ప్రపంచ వ్యాప్తంగా విడుదలై పీపుల్స్ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించి హౌస్ ఫుల్ గా రన్ అవుతున్న నేపధ్యంలో చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ నిర్వహించింది. ఈ సక్సెస్ మీట్ లో కిరణ్ అబ్బవరం, గోపీనాథ్ రెడ్డి, చాందిని చౌదరి, ప్రవీణ రెడ్డి డీవోపీ సతీష్ రెడ్డి పాల్గొన్నారు. హీరో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ.. సమ్మతమే చూసిన ప్రేక్షకులు మా కథే తీశారని, మా లైఫ్ లో కూడా ఇలా జరిగిందని అభినందించడం ఆనందంగా వుంది. దర్శకుడు గోపీనాథ్ రెడ్డి ఈ కథని ఎంత బలంగా నమ్మారో అంతే బలంగా తీశారు. ఈ రోజు సినిమా అందరికీ నచ్చడం ఆనందంగా వుంది. ఎస్ఆర్ కళ్యాణ మండపం కూడా మొదట్లో మిశ్రమ రివ్యూలు వచ్చాయి. అయితే ఈవింగ్ షో తర్వాత సినిమా బ్లాక్ బస్టర్ అని తేలింది. సమ్మతమేకి కూడా అదే జరిగింది. మార్నింగ్ షో తర్వాత మిశ్రమ రివ్యూలు కొన్ని వినిపించాయి. ఈవినింగ్ సంధ్య థియేటర్ కి వెళ్లి చూస్తే మొత్తం హౌస్ ఫుల్. ప్రేక్షకులంతా విజల్స్ వేస్తూ ఒక మాస్ సినిమాని చూస్తున్నట్లు ఎంజాయ్ చేస్తున్నారు. ప్రతి డైలాగ్ ని ఎంజాయ్ చేస్తున్నారు. యూత్ తో పాటు ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ కుటుంబమంతా కలసి ఎంజాయ్ చేశామని చెప్పడం మరింత ఆనందంగా వుంది. థియేటర్ కి వచ్చి సమ్మతమే చిత్రం చూసిన ప్రతి ఒక్క ప్రేక్షకుడికి కృతజ్ఞతలు. ప్రేక్షకుల వలనే సమ్మతమే పీపుల్స్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇది ప్రేక్షకుల విజయం. గీతా ఆర్ట్స్ అల్లు అరవింద్ గారికి, బన్నీ వాస్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు. సినిమాని గొప్పగా విడుదల చేశారు. మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇచ్చారు. థియేటర్ల సంఖ్య పెరుగుతున్నాయి. యు ఎస్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. రిపీట్ ఆడియన్స్ వెళ్తున్నారు. రెస్పాన్స్, కలెక్షన్స్ అద్భుతంగా వున్నాయి. యు ఎస్ ఆడియన్స్ కి థాంక్స్. దర్శకుడు గోపీనాథ్, ప్రవీణ అమ్మ, చాందిని, మిగతా టీం అందరికి థాంక్స్. ముఖ్యంగా యుజీ టీం కి స్పెషల్ థాంక్స్. ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారు. సమ్మతమే చిత్రాన్ని అందరూ మన సినిమాగా ఆదరించారు. ఇంకా చూడని వాళ్ళు థియేటర్ కి వెళ్లి చూడండి. థియేటర్ ఎక్సపిరియన్స్ మిస్ కావద్దు” అని కోరారు. దర్శకుడు గోపీనాథ్ రెడ్డి మాట్లాడుతూ.. ‘సమ్మతమే’ అద్భుతమైన రెస్పాన్స్ తో  పీపుల్స్ బ్లాక్ బస్టర్ గా నిలవడం ఆనందంగా వుంది. సినిమాకి మంచి రెస్పాన్స్ వస్తుందని ముందే అనుకున్నాను. నేను ఏదైతే నమ్మానో అది నిజమైయింది. కంటెంట్ ని బలంగా నమ్మాను. ఇది ప్రేక్షకుల విజయం. కేవలం మౌత్ టాక్ వలనే సమ్మతమే  పీపుల్స్ బ్లాక్ బస్టర్ అయ్యింది. సినిమా ప్రతి ఒక్కరూ బావుందని చెప్పడం వలనే ఇది సాధ్యమైయింది. కిరణ్ తో ఎప్పుడూ పని చేసినట్లు వుండదు. మేము ఎప్పుడూ సినిమా గురించే మాట్లాడుకుంటాం. మొదటి సినిమాకి మనల్ని అర్ధం చేసుకునే హీరో దొరకడం ఆనందం. నా టీమ్ అంతా నన్ను ఎప్పుడూ నాలుగైదు హిట్లు కొట్టిన దర్శకుడిలానే చూశారు. ఎప్పుడూ కొత్త దర్శకుడనే భావన కల్పించలేదు. అంత కాన్ఫిడెన్స్ ఇచ్చిన టీమ్ కి థాంక్స్. సినిమా చూసిన ప్రేక్షకులు అనుభవం గల దర్శకుడు తీసినట్లుగా వుందని చెబుతున్నారంటే దానికి కారణం నా టీమ్. డబ్బులుంటే ఎవడైనా సినిమా తీస్తాడు. కానీ హిట్ కొట్టడం ముఖ్యం. సొంత డబ్బులతో సినిమా తీసి, సూపర్ హిట్ కొట్టడం ఆనందంగా వుంది. మాకు ఎంతో సహకరించిన మీడియాకి ధన్యవాదాలు. పీఆర్వో వంశీ-శేఖర్ గారు, తేజస్వీ, సుధాకర్ గారికి, మా డిజిటల్ టీంకి థాంక్స్. సమ్మతమే చిత్రాన్ని ప్రేక్షకులు పీపుల్స్ బ్లాక్ బస్టర్ చేశారు. మాకు ఇంతపెద్ద విజయాన్ని ఇచ్చిన ప్రేక్షక దేవుళ్ళకి కృతజ్ఞతలు. ప్రేక్షకుల విలువైన సమయం వారు చెల్లించే ప్రతి రూపాయి చాలా విలువైనది. వారి పట్ల గౌరవం భాద్యత వుంది. ప్రేక్షకులు పది రూపాయిలు పెడితే వందరూపాయిల వినోదం పంచడానికే ప్రయత్నిస్తా” అన్నారు. చాందిని చౌదరి మాట్లాడుతూ.. ‘సమ్మతమే’ చిత్రాన్ని  పీపుల్స్ బ్లాక్ బస్టర్ అంటున్నారు. ప్రేక్షకులే దేవుళ్ళు. మా సినిమాని మనస్పూర్తిగా సమ్మతించి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందించిన ప్రేక్షకులందరికీ కృతజ్ఞతలు. ఈ కథ విన్నప్పుడు శాన్వి పాత్ర చాలా నచ్చింది. ఈ రోజు ప్రేక్షకులకు కూడా నచ్చడం ఆనందంగా వుంది. చాలా మంది అమ్మాయిలు కాల్స్ చేసి నన్ను నేను చుసుకున్నట్లు వుందని కాంప్లిమెంట్స్ ఇచ్చారు. ఇంత మంచి పాత్ర ఇచ్చిన దర్శకుడు గోపీనాథ్ గారికి థాంక్స్. హీరో కిరణ్ గారు, దర్శకుడు గోపీనాథ్, నిర్మాత ప్రవీణ గారు మిగతా టీం ఈ సినిమా కోసం ఎక్కడా రాజీపడకుండా పని చేశారు. ఈ రోజుల్లో థియేటర్ లో హిట్ కొట్టడం అంత సులువు కాదు. సమ్మతమే ఇంత పెద్ద థియేటర్ సక్సెస్ కావడం కలా నిజమా అన్నట్లుగా వుంది. చాలా రోజుల తర్వాత కంటినిండా నిద్రపోతున్నాను. ఈ ఆనందాన్ని మాటల్లో చెప్పలేను. ఇంత పెద్ద హిట్ ఇచ్చిన ప్రేక్షకులకు మరోసారి మనస్పూర్తిగా కృతజ్ఞతలు. ప్రేక్షకుల విలువైన సమయాన్ని ” తెలిపారు. నిర్మాత ప్రవీణ రెడ్డి మాట్లాడుతూ.. ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ ఇచ్చిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు. మేము ఊహించిన దాని కంటే పెద్ద విజయాన్ని అందించారు. మన సినిమా అనుకోని అందరూ అద్భుతంగా ఆదరిస్తున్నారు. అన్ని వర్గాల ప్రేక్షకుల నుండి అద్భుతమైన స్పందన వస్తుంది. మీ అబ్బాయి సినిమాని అద్భుతంగా తీశారని అందరూ చెబుతుంటే చాలా ఆనందంగా వుంది. సినిమాలో పని చేసిన కిరణ్ గారు, చాందిని గారు, కెమరామెన్ సతీస్, సంగీత దర్శకుడు శేఖర్ చంద్ర, ఎడిటర్ విప్లవ్ మిగతా టీం అందరికీ ధన్యవాదాలు. మాకు చాలా సపోర్ట్ గా నిలిచారు. మా సినిమాని ఇంతలా ఆదరించిన ప్రేక్షక దేవుళ్ళకి మరోసారి కృతజ్ఞతలు” తెలిపారు తెలుపుతున్నాను. డీవోపీ సతీష్ రెడ్డి మాసం మాట్లాడుతూ: నా మొదటి సినిమా ఇంత పెద్ద విజయం సాధించడం ఆనందంగా వుంది. సినిమాకి అన్ని చోట్ల నుండి అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది. నిర్మాతలు, దర్శకుడు, హీరో కిరణ్ అబ్బవరం, చాందిని, మా యూనిట్ అందరికీ థాంక్స్. ఇంత పెద్ద సక్సెస్ ఇచ్చింది ప్రేక్షకులకు కృతజ్ఞతలు” తెలిపారు.

Read more

Shikari Movie Press Meet

  సాయిధ‌న్సిక ప్ర‌ధాన పాత్ర‌లో పూర్తి ఎంట‌ర్‌టైన్‌మెంట్ చిత్రంగా అంద‌రినీ అల‌రించ‌డానికి జులై 1న రాబోతున్న `షికారు` చిత్రం సాయిధ‌న్సిక‌, తేజ్ కూర‌పాటి, అభిన‌వ్ మేడిశెట్టి, కె.వి.

Read more

Kaduva Movie Teaser Launch

  పృథ్వీరాజ్ సుకుమారన్, సంయుక్త మీనన్, వివేక్ ఒబెరాయ్‌, షాజీ కైలాస్ ‘కడువా’ టీజర్ విడుదల   మలయాళ సూపర్‌స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్, మాస్ డైరెక్టర్ షాజీ కైలాస్ కాంబినేషన్ లో తెరకెక్కిన హై ఆక్టేన్ యాక్షన్ మాస్ ఎంటర్‌ టైనర్ కడువా. మ్యాజిక్ ఫ్రేమ్స్, పృథ్వీరాజ్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై లిస్టిన్ స్టీఫెన్, సుప్రియా మీనన్ నిర్మించారు. ఈ భారీ యాక్షన్ థ్రిల్ డ్రామాలో బాలీవుడ్ స్టార్ వివేక్ ఒబెరాయ్‌ మరో ప్రధాన పాత్ర పోషిస్తుండగా, ‘భీమ్లా నాయక్’ ఫేమ్ సంయుక్త మీనన్ కథానాయికగా కనిపించనున్నారు. పాన్ ఇండియా ఎంటర్‌ టైనర్‌ గా మలయాళం, తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో వస్తున్న ‘ కడువా’ జూన్ 30న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ చిత్రం టీజర్ ఈవెంట్ హైదరాబాద్ లో గ్రాండ్ గా జరిగింది. పృథ్వీరాజ్, వివేక్ ఒబెరాయ్‌, సంయుక్త మీనన్ ఈ ఈవెంట్ లో పాల్గొన్నారు. హైఆక్టేన్ యాక్షన్ ఎలిమెంట్స్ తో ఫుల్ పవర్ ప్యాక్డ్ గా అలరించింది ‘కడువా’టీజర్.’ ఆయనొక  చిరుత .. వేట కోసం కాచుకున్న చిరుత’ అనే పవర్ ఫుల్ డైలాగ్ తో వీర లెవల్ లో పృథ్వీరాజ్ ఇచ్చిన మాస్ ఎంట్రీ  సాలిడ్ గా వుంది. పృథ్వీరాజ్ యాక్షన్, మాస్ స్వాగ్ నెక్స్ట్ లెవెల్ లో వున్నాయి. మరో పవర్ ఫుల్ పోలీసు పాత్రలో  వివేక్ ఒబెరాయ్‌ కనిపించారు. యాక్షన్ సీక్వెన్స్ అన్నీ అవుట్ స్టాండింగ్ అనిపించాయి. టీజర్ చివర పృథ్వీరాజ్ పులిలా గర్జించడం మాస్ ని మెస్మరైజ్ చేసింది. డైరెక్టర్ షాజీ కైలాస్ కడువాతో మరోసారి తన మాస్ మార్క్ ని చూపించబోతున్నారని టీజర్ చూస్తే అర్ధమౌతుంది. నిర్మాణ విలువలు ఉన్నంతగా వున్నాయి. అభినందన్ రామానుజం అందించిన విజువల్స్ రిచ్ అండ్ లావిష్ గా వున్నాయి.  జేక్స్ బిజోయ్ అందించిన నేపధ్య సంగీతం మాస్ ని మరింత ఎలివేట్ చేసింది. పృథ్వీరాజ్ హైవోల్టేజ్ యాక్షన్, భారీ నిర్మాణ విలువలు, మాస్ ఎలిమెంట్స్ ఈ సినిమాపై అంచనాలు మరింత పెంచాయి. పృథ్వీరాజ్ సుకుమారన్ మాట్లాడుతూ.. నా గత చిత్రం ‘జనగణమన’ని ఆదరించిన తెలుగు ప్రేక్షకులకు ధన్యవాదాలు. ముఖ్యంగా హైదరాబాద్ లో ఈ చిత్రం మంచి వసూళ్లు రాబట్టింది. తెలుగు ప్రేక్షకులు సినిమాని గొప్ప గా ప్రేమిస్తారు. హైదరాబాద్ లో షూటింగ్ అంటే నాకూ ఎప్పుడూ ప్రత్యేకంగా వుంటుంది. నా ‘బ్రోడాడీ’ సినిమా అంతా హైదరాబాద్ లోనే షూట్ చేశా. ఇప్పుడు కడువా టీం కు మీరంతా గొప్ప స్వాగతం పలికారు. కడువా నాకు చాలా ప్రత్యెకమైన సినిమా. మలయాళం నుండి మంచి సినిమాలు వస్తున్నాయి. వాస్తవానికి దగ్గరగా ఉండేవి, మెదడుకు పదునుపెట్టేవి, ఆలోచన రేకెత్తించే చిత్రాలుగా ఇలా చాలా జోనర్ చిత్రాలు వస్తున్నాయి. ఐతే మాస్ కమర్షియల్ సినిమాని మలయాళం పరిశ్రమ మర్చిపోయిందనే భావన కలిగింది.  ప్రేక్షకులు అమితంగా ఎంజాయ్ చేసే మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ సినిమాలు రావడం తగ్గింది. ఇలాంటి నేపధ్యంలో ఈ మాస్ యాక్షన్ కమర్షియల్ ఎంటర్ టైనర్ ని ప్రేక్షకుల ముందుకు తీసురావాలని భావించా. ఈ చిత్రాన్ని ప్రేక్షకులు తప్పకుండా ఎంజాయ్ చేస్తారు. ఈసారి డబ్బింగ్ వెర్షన్ ని పక్కాగా ప్లాన్ చేశాం. టీం అంతా వచ్చి ప్రమోషన్స్ లో ఇక్కడ ప్రేక్షకులని కలవడం ఆనందంగా వుంది. భవిష్యత్ లో నా చిత్రాలన్నీ తెలుగులో విడుదల చేయడానికి ప్రయత్నిస్తా. నేను చేసిన సినిమాలు ఇక్కడ రిమేక్ కావడం ఆనందంగా వుంది. భీమ్లా నాయక్ ప్రేక్షకులు ముందుకు వచ్చింది. అలాగే చిరంజీవి గారి గాడ్ ఫాదర్ కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. త్వరలోనే తెలుగు, మలయాళం చిత్ర పరిశ్రమల కలయికలో పెద్ద  ప్రాజెక్ట్స్ వస్తాయనే నమ్మకం వుంది” అన్నారు. వివేక్ ఒబెరాయ్‌ మాట్లాడుతూ.,., హైదరాబాద్ లోనే పుట్టాను. మా కుటుంబంలో చాలామంది ఇక్కడే వున్నారు. ఇక్కడికి వస్తే స్కూటర్ లో కాలేజీలు చుట్టూ తిరగడాలు, గండిపేట్ పిక్నిక్, ట్యాంక్ బండ్ అన్నీ గుర్తుకు వస్తాయి. నా చిత్రాల్ని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ కృతజ్ఞతలు. ‘కడువా’  రాకింగ్ మూవీ. ఇద్దరు బలమైన వ్యక్తుల మధ్య ఒక బుల్ ఫైట్ లా ఈ సినిమా వుంటుంది. నా కెరీర్ లో ఫోన్ లోనే ఓకే చేసిన మూవీ లూసిఫర్.  కడువా కథ కూడా పృథ్వీరాజ్ ఫోన్ లోనే చెప్పారు. కథ చెప్పినపుడు ఇదో బుల్ ఫైట్ లా ఉంటుందని చెప్పారు. ఈ సినిమా షూటింగ్ లో నిజంగానే రెండు పెద్ద బుల్స్ తీసుకొచ్చి ఫైట్ చేయించారు. ఈ సినిమా కచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుంది” అన్నారు. సంయుక్త మీనన్ మాట్లాడుతూ.. కడువా ప్రమోషన్స్ తెలుగులో చేయడం ఆనందంగా వుంది. తెలుగు ప్రేక్షకులకు సినిమా అంటే ప్యాషన్. భీమ్లా నాయక్ విడుదల అప్పుడు థియేటర్ లో ఒక పండగ లాంటి వాతావరణం చూశాను. కడువా చూస్తున్నపుడు కూడా అదే సెలబ్రేషన్స్ వుంటాయని భావిస్తున్నా” అన్నారు. తారాగణం: పృథ్వీరాజ్ సుకుమారన్, సంయుక్త మీనన్, వివేక్ ఒబెరాయ్, అర్జున్ అశోక్, సిద్ధిక్, అజు వర్గీస్, దిలీష్ పోతన్ తదితరులు. సాంకేతిక విభాగం : దర్శకత్వం: షాజీ కైలాస్ నిర్మాతలు: సుప్రియా మీనన్ & లిస్టిన్ స్టీఫెన్ రచన: జిను వి అబ్రహం డీవోపీ: అభినందన్ రామానుజం

Read more

vikrant rona movie trailer Launch

  జూలై 28 కోసం చాలా ఎగ్జయిట్‌మెంట్‌తో ఎదురు చూస్తున్నా… ‘విక్రాంత్ రోణ’ తో ఆడియెన్స్‌ గ్రేట్ ఎక్స్‌పీరియెన్స్ క‌లుగుతుంది – కిచ్చా సుదీప్‌ శాండిల్ వుడ్

Read more

దుల్కర్ సల్మాన్ ‘సీతా రామం’ టీజర్ విడుదల

  దుల్కర్ సల్మాన్, హను రాఘవపూడి, స్వప్న సినిమా ‘సీతా రామం’ టీజర్ విడుదల    స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ కథానాయకుడి గా వైజయంతీ మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా పతాకంపై స్టార్ ప్రొడ్యూసర్ అశ్వినీదత్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న చిత్రం ‘సీతా రామం’. హను రాఘవపూడి దర్శకత్వంలో యుద్ధ నేపధ్యంలో  అందమైన ప్రేమకథగా ఈ చిత్రం తెరకెక్కుతుంది. ఈ చిత్రంలో మృణాళిని ఠాకూర్ హీరోయిన్ పాత్రలో కనిపించగా రష్మిక మందన్న కీలకమైన పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రం టీజర్ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో గ్రాండ్ గా జరిగింది. ఈ ఈవెంట్ లో దుల్కర్ సల్మాన్, హను రాఘవపూడి, స్వప్న దత్, సంగీత దర్శకుడు విశాల్ చంద్రశేఖర్ పాల్గొన్నారు. భారీ సంఖ్యలో అభిమానులు, ప్రేక్షకులు హాజరైన ఈ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. నిమిషం 14 సెకన్ల నిడివిగల ‘సీతా రామం’  టీజర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. టీజర్ తొలి సన్నివేశం 1965 కశ్మీర్ మంచు కొండలని చూపిస్తూ .. ఆకాశవాణి ప్రత్యేక కార్యక్రమం వాయిస్ తో మొదలైన టీజర్ విజువల్ వండర్ గా నిలిచింది. ”లెఫ్టినెంట్‌ రామ్‌. నిన్ననే నాకు పరిచయమైన పేరు. కశ్మీర్‌ కొండల్లో పహారా కాస్తున్న ఒక ఒంటరి సైనికుడు. తనకు మాట్లాడటానికి ఒక కుటుంబం. కనీసం ఉత్తరం రాయడానికి పరిచయం కూడా లేదన్న విషయం నిన్నే నాకు తెలిసింది’ ఈ వాయిస్ ని ఫాలో అవుతూ చూపించిన విజువల్స్, ఎమోషన్స్ మ్యాజికల్ గా వున్నాయి లెఫ్టినెంట్‌ రామ్‌ గా దుల్కర్ సల్మాన్ మెస్మరైజ్ చేశారు. తన గత సినిమాల కంటే ఇందులో మరింత హ్యాండసమ్ గా కనిపిస్తున్నారు దుల్కర్ సల్మాన్. తనకు వచ్చిన ఉత్తరాలను చూసి ‘సీతా.. ఎవరు నువ్వు?’ అని దుల్కర్ అన్నవెంటనే నిండు సంప్రాదాయంగా సీత పాత్ర రివిల్ కావడం హను రాఘవపూడి లవ్లీ మార్క్ గా నిలిచింది. దుల్కర్ సల్మాన్, మృణాళిని ఠాకూర్ ల కెమిస్ట్రీ మ్యాజికల్ గా వుంది. టీజర్ లో ప్రతి ఫ్రేమ్  లావిష్ గా వుంది. సినిమా విజువల్ వండర్ గా వుండబోతుందని టీజర్ చూస్తే అర్ధమౌతుంది.  పీఎస్ వినోద్ కశ్మీర్ ని మరింత ఆహ్లాదంగా తన కెమరాతో బంధించారు. విశాల్ చంద్రశేఖర్ సంగీతం హార్ట్ టచింగ్ గా వుంది. ప్రొడక్షన్ విలువలు అత్యున్నతంగా వున్నాయి. వండర్ ఫుల్ ఫెర్ఫార్మెన్స్, ఆకట్టుకునే కథనం, అందమైన విజువల్స్, మ్యాజికల్ మ్యూజిక్ తో’ సీతా రామం’ ఒక ఎపిక్ లవ్ స్టోరీగా ఉండబోతోందని టీజర్ భరోసా ఇస్తుంది. ”సీతా రామం” తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో ఏకకాలంలో రూపొందుతుంది. ఆగస్ట్ 5న ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. టీజర్ రిలీజ్ ఈవెంట్ లో దుల్కర్ సల్మాన్ మాట్లాడుతూ.. ‘సీతా రామం’ టీజర్ కి వండర్ ఫుల్ రెస్పాన్స్ వచ్చింది. ఇంతకంటే వండర్ ఫుల్ గా సినిమా వుండబోతుంది.  ‘సీతా రామం’ మెమరబుల్ మూవీ. అద్భుతమైన లోకేషన్స్ లో షూట్ చేశాం. దేశంలో చాలా ప్రదేశాలు చూసే అవకాశం దక్కింది, దర్శకుడు హను రాఘవపూడి, స్వప్న గారి సపోర్ట్ కి కృతజ్ఞతలు. విశాల్ అద్భుతమైన సంగీతం ఇచ్చారు.  సీతా రామం’ కథ గొప్పగా వుంటుంది. సినిమా విజువల్ వండర్ గా వుండబోతుంది” అన్నారు దర్శకుడు హను రాఘవపూడి మాట్లాడుతూ.. టీజర్ కి అద్భుతమైన రెస్పాన్స్ రావడం ఆనందంగా వుంది.  ప్రేక్షకుల కి వండర్ ఫుల్ ఎక్సపిరియన్స్ ఇవ్వడానికే వందల మంది రెండేళ్ళుగా కష్టపడ్డాం. దుల్కర్ సల్మాన్  ని లెఫ్ట్నెంట్ రామ్ పాత్రలో ఇంకా ఇష్టపడతారు. సినిమా చాలా అద్భుతంగా వచ్చింది. ఈ ప్రయాణం లో సపోర్ట్ గా నిలిచిన దుల్కర్ , నిర్మాత స్వప్న గారికి థాంక్స్. చాలా వైవిధ్యమైన ప్రదేశాలలో ఈ చిత్రాన్ని చిత్రీకరీంచాం. మైనస్ 24 డిగ్రీల వద్ద కూడా షూట్ చేశాం, ఇది దుల్కర్, స్వప్న  గారి సపోర్ట్ వలెనే సాధ్యపడింది” అన్నారు సంగీత దర్శకుడు విశాల్ చంద్రశేఖర్ మాట్లాడుతూ.. ఈ చిత్రం కోసం చాలా అద్భుతమైన టీమ్ పని చేసింది. ఆల్బమ్ అద్భుతంగా వచ్చింది. దుల్కర్, స్వప్న, హను గారితో పని చేయడం ఆనందంగా వుంది” అన్నారు. ఈ సందర్భంగా మీడియా, అభిమానులు అడిగిన ప్రశ్నల కి సీతారామం యూనిట్ సమాధానాలు ఇచ్చారు. మహానటితో ఒక మార్క్ సెట్ చేశారు. సీతారామంతో ఒక నటుడిగా ఎలాంటి మార్కులు పడతాయని భావిస్తున్నారు ?

Read more