అశోక్ గ‌ల్లా బ‌ర్త్‌డే సంద‌ర్భంగా సినిమాలో లుక్ విడుద‌ల‌

తెలుగు

అశోక్ గ‌ల్లా బ‌ర్త్‌డే సంద‌ర్భంగా సినిమాలో లుక్ విడుద‌ల‌

By admin

April 06, 2020

అశోక్ గ‌ల్లా బ‌ర్త్‌డే సంద‌ర్భంగా సినిమాలో లుక్ విడుద‌ల‌

గుంటూరు ఎంపీ జ‌య‌దేవ్ గ‌ల్లా కుమారుడు అశోక్ గ‌ల్లా హీరోగా ప‌రిచ‌య‌మ‌వుతున్న విష‌యం విదిత‌మే. నిధి అగ‌ర్వాల్ హీరోయిన్‌గా న‌టిస్తోన్న ఈ భిన్న త‌ర‌హా ఎంట‌ర్‌టైన‌ర్‌కు శ్రీ‌రామ్ ఆదిత్య ద‌ర్శ‌కుడు. అమ‌ర‌రాజా మీడియా అండ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై ప‌ద్మావ‌తి గ‌ల్లా నిర్మిస్తోన్న ఈ చిత్రంలో జ‌గ‌ప‌తిబాబు, న‌రేష్‌, స‌త్యా, అర్చ‌నా సౌంద‌ర్య కీల‌క పాత్ర‌ధారులు. ఈ సినిమాకు సంబంధించి 50 శాతం చిత్రీక‌ర‌ణ పూర్త‌యింది. క‌రోనా వైర‌స్ వ్యాప్తి నిరోధం, లాక్‌డౌన్ చ‌ర్య‌ల్లో భాగంగా ఈ సినిమా షూటింగ్ నిలిచిపోయింది.

అశోక్ గ‌ల్లా పుట్టిన‌రోజును పుర‌స్క‌రించుకొని ఆదివారం ఈ చిత్రంలో ఆయ‌న లుక్‌ను నిర్మాత‌లు విడుద‌ల చేశారు. టేబుల్‌పై కూర్చొని టేబుల్‌  ల్యాంప్ వెలుగులో దీక్ష‌గా పుస్త‌కం చ‌దువుతున్న అశోక్ లుక్ ఆక‌ట్టుకుంటోంది. నిర్మాత ప‌ద్మావ‌తి గ‌ల్లా మాట్లాడుతూ, లాక్‌డౌన్ నేప‌థ్యంలో అంద‌రూ ఇళ్ల‌ల్లో సుర‌క్షితంగా ఉండాల‌ని కోరారు. ప్ర‌భుత్వాలు, డాక్ట‌ర్లు, పోలీసులు చెబుతున్న స‌ల‌హాలు, సూచ‌న‌లు త‌ప్ప‌నిస‌రిగా పాటిస్తూ క‌రోనా వైర‌స్ వ్యాప్తి నిరోధంలో భాగ‌స్వాములు కావాల‌న్నారు.

సూప‌ర్‌స్టార్ కృష్ణ‌, గ‌ల్లా అరుణ‌కుమారి సంయుక్తంగా స‌మ‌ర్పిస్తోన్న ఈ చిత్రానికి చంద్ర‌శేఖ‌ర్ రావిపాటి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తుండ‌గా, జిబ్రాన్ సంగీతం స‌మ‌కూరుస్తున్నారు.

తారాగ‌ణం:అశోక్ గ‌ల్లా, నిధి అగ‌ర్వాల్‌, జ‌గ‌ప‌తిబాబు, న‌రేష్‌, స‌త్యా, అర్చ‌నా సౌంద‌ర్య‌

సాంకేతిక బృందం:క‌థ‌, స్క్రీన్‌ప్లే, ద‌ర్శ‌కత్వం: శ్రీ‌రామ్ ఆదిత్య టి.నిర్మాత‌: ప‌ద్మావ‌తి గ‌ల్లాఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌: చ‌ంద్ర‌శేఖ‌ర్ రావిపాటిసంగీతం:  జిబ్రాన్‌బ్యాన‌ర్‌: అమ‌ర‌రాజా మీడియా అండ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌