100 మంది తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ సభ్యులకు డా.ప్రతాని రామకృష్ణ గౌడ్ నిత్యావసర వస్తువుల పంపిణీకరోనా వైరస్ కారణంగా ప్రస్తుతం నిరవధికంగా లాక్ డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో తెలంగాణా ఫిల్మ్ ఛాంబర్ లోని 100 మంది కళాకారులకు, సాంకేతిక నిపుణులకు ఈ రోజు డా.ప్రతాని రామకృష్ణ గౌడ్ తెలంగాణా ఫిల్మ్ ఛాంబర్ లో నిత్యావసర వస్తువులు భువనగిరి మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టీ ఎఫ్ సీ సీ సెక్రటరీ కాచం సత్యనారాయణ, టీ.మా ఆర్గనైజింగ్ సెక్రటరీ బి.శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా భువనగిరి మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ మాట్లాడుతూ….‘ కరోనా మహమ్మారి ప్రభలుతున్న నేపథ్యంలో లాక్ డౌన్ వల్ల ఎంతోమంది సినీ కార్మికులు పని కోల్పోయి నిత్యావసర వస్తువుల కు ఇబ్బంది పడుతున్నారు. ఈ క్రమంలో గతం లో కొంత మందికి నిత్య వసర వస్తువులు పంపిణీ చేశారు. మళ్లీ మరో వందమందికి ఈ రోజు నిత్యావసర వస్తువులు పంపిణీ చేయడం అభినందనీయం. ఈ కార్యక్రమంలో నే నూ పాలు పంచుకోవడం ఆనందంగా ఉంది. తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ వారు మరెన్నో ఇలాంటి మంచి చేపట్టాలన్నారు.గతంలో మా ఛాంబర్ సభ్యులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశాం. లాక్ డౌన్ ఇంకా పొడిగించిన నేపథ్యం లో మరో వంద మంది కళాకారులకు ,సాంకేతిక నిపుణులకు ప ది కేజీల బియ్యం తో పాటు నిత్యావసర వస్తువులు అందించాం. త్వరలో మరికొంత మందికి అందిస్తాం” అన్నారు.అలాగే కాచం సత్యనారాయణ, బి.శ్రీనివాస్ మాట్లాడుతూ….” ఈ రోజు మా ఛాంబర్ తరఫున 100 మందికి బియ్యం, నిత్యావసర సరుకుల తో పాటు వారికి అన్నదానం చేయడం, ఇలాంటి మంచి కార్యక్రమంలో మే మూ పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు.