లాక్ డౌన్ లో పోలీసులు చేస్తున్న సేవలు ప్రతి ఒక్కరు కీర్తించతగినవే..

తెలుగు

లాక్ డౌన్ లో పోలీసులు చేస్తున్న సేవలు ప్రతి ఒక్కరు కీర్తించతగినవే..

By admin

April 29, 2020

లాక్ డౌన్ లో పోలీసులు చేస్తున్న సేవలు ప్రతి ఒక్కరు కీర్తించతగినవే..

క‌రోనా వైర‌స్‌(కోవిడ్ 19) నిర్మూల‌న‌కు ప్రభుత్వాలు శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నాయి. దీని నివారించ‌డం మ‌న బాధ్య‌త‌. అందుకు తీసుకుంటున్న నివార‌ణా చ‌ర్య‌ల‌కు మ‌న వంతు స‌హ‌కారాన్ని అందించాలి. అందులో భాగంగా మా చిత్ర నిర్మాణ సంస్థలైన ‘హారిక అండ్ హాసిని క్రియేషన్స్ మరియు సితార ఎంటర్ టైన్మెంట్స్  లు సహాయ గ్రూప్ తో కలసి ఈరోజు సైబరాబాద్ పోలీస్ కమీషనర్ శ్రీ వి.సి. సజ్జనార్ గారికి హాండ్ శానిటైజర్స్, ఫేస్ మాస్క్ లను ఇవ్వటం జరిగింది.  ఈ సందర్భంగా క‌రోనా వైర‌స్ నివార‌ణ కోసం కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు తీసుకుంటున్న చర్యలు ప్రశంసనీయమైనవి అన్నారు. ప్రజలందరూ ఇళ్లలోనే ఉండండి, క్షేమంగా ఉండండని ఆకాంక్షించారు నిర్మాత సూర్యదేవర నాగవంశీ.