‘‘లవ్ స్టోరీ’’ మూవీ నుండి సాయిపల్లవి బర్త్ డే పోస్టర్ రిలీజ్

తెలుగు

‘‘లవ్ స్టోరీ’’ మూవీ నుండి సాయిపల్లవి బర్త్ డే పోస్టర్ రిలీజ్

By admin

May 10, 2020

‘‘లవ్ స్టోరీ’’ మూవీ నుండి సాయిపల్లవి బర్త్ డే పోస్టర్ రిలీజ్

హీరోయిన్స్ లో ప్ర‌త్యేక‌మైన ఇమేజ్ ని సొంతం చేసుకున్న హీరోయిన్సాయిప‌ల్ల‌వి. త‌న అంద‌మైన న‌ట‌న‌కు ఆక‌ర్షించ‌బ‌డ‌నిప్రేక్ష‌కులుండ‌రు.భానుమ‌తిగా ఫిదాతో ప‌రిచ‌యం అయిన సాయి ప‌ల్ల‌వి త‌నసినిమాల‌లో త‌న ప్ర‌త్యేక‌త‌ను చాటుకుంటూ కెరియ‌ర్ ని లీడ్ చేస్తుంది.శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వంలో మ‌రోసారి మ్యాజిక్ చేసేందుకు  ల‌వ్ స్టోరీతో సిద్దం అవుతుంది. నాగ‌చైత‌న్య‌, సాయిప‌ల్ల‌వి కాంబినేష‌న్ క్రేజ్ ల‌వ్స్టోరీ పై అంచ‌నాల‌ను మ‌రింత పెంచింది. ఇప్పటికే విడుద‌లైన ఫస్ట్ లుక్,‘‘ఏయ్ పిల్లా’’ సాంగ్ కు విశేష‌మైన స్పంద‌న ల‌భించింది. ల‌వ్ స్టోరీ కిఇంకా 15 రోజుల షూటింగ్ మిగిలి  ఉంది. లాక్  డౌన్ త‌ర్వాత అప్ప‌టిపరిస్థితుల్ని బేరీజు వేసుకొని షూటింగ్ ప్లాన్ చేస్తుంది యూనిట్.  శేఖ‌ర్క‌మ్ముల సినిమాల‌లో క‌థానాయిక‌లు ఎంత హుందాగా ఉంటారో అంద‌రికీతెలిసిందే.. భావోద్వేగాల‌తో నిండుకున్న ప్రేమ‌క‌థ‌ల‌తో సెల్యులాయిడ్ పైశేఖ‌ర్ చేసే మ్యాజిక్ ని మ‌రోసారి రిపీట్ అయ్యేటట్టుకనిపిస్తోంది.హీరోయిన్ సాయిపల్లవి బ‌ర్త్ డే సంద‌ర్భంగా టీం విడుద‌లచేసిన పోస్ట‌ర్ లో సాయి ప‌ల్ల‌వి మ‌రింత అందంగా క‌నిపించింది. వర్షంలోఆడుతున్న సాయి పల్లవి స్టిల్ కు సోష‌ల్ మీడియాలో అద్భుత‌మైన స్పంద‌నల‌భిస్తుంది.‘‘లవ్ స్టోరీ’’ సినిమాను ఏమిగోస్  క్రియేషన్స్, సోనాలి నారంగ్  సమర్పణలోశ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి బ్యానర్ పై నారాయణ్ దాస్ కె నారంగ్,పి రామ్మోహన్ రావు నిర్మిస్తున్నారు.

హీరో నాగ చైతన్య, సాయి పల్లవి జంట గా నటిస్తున్న ఈ మూవీలో రాజీవ్కనకాల,ఈశ్వరీ రావు,దేవయాని ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.సహా నిర్మాత :భాస్కర్ కటకంశెట్టిసినిమాటోగ్రఫీ: విజయ్ సి.కుమార్ఆర్ట్: రాజీవన్పి.ఆర్.వో -జి.ఎస్.కె మీడియామ్యూజిక్ : పవన్ సి.హెచ్నిర్మాతలు : నారాయణ్ దాస్ కె నారంగ్, పి.రామ్మోహన్ రావురచన- దర్శకత్వం : శేఖర్ కమ్ముల.