నిహారికకు సంబంధాలు చూస్తున్నాం

2020లో టాలీవుడ్లో పెళ్లి వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే నితిన్, నిఖిల్లకు నిశ్చితార్థం అయింది. రానా దగ్గుబాటి తన ప్రేయసి గురించి తెలియజేశారు. తాజాగా మెగా బ్రదర్ నాగబాబు తన పిల్లల పెళ్లి విషయంలో స్పందించారు. కుమార్తె నిహారికకు సంబంధాలు చూస్తున్నామని, వచ్చే ఏడాదిలో పెళ్లి జరుగుతుందని అన్నారు. నిహారిక నటిగా పలు చిత్రాల్లో నటించిన విషయం తెలిసిందే. నిహారిక పెళ్లి తర్వాత హీరో వరుణ్ తేజ్ పెళ్లి చేస్తామని చెప్పారు. వరుణ్ పెళ్లి కూడా వచ్చే ఏడాది చివర్లో అవుతుందని అంచనా వేశారు.