హీరో మోహన్ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా గ్యాంగ్ లీడర్ పోస్టర్ విడుదల!శ్రీ పద్మాలయా ఎంటర్టైన్మెంట్స్ సమర్పించు, మాణిక్యం మూవీస్ బ్యానర్ పై మెగా అభిమాని మోహన్ కృష్ణ, హరిని రెడ్డి హీరో హీరోయిన్ గా నటిస్తోన్న చిత్రం గ్యాంగ్ లీడర్. త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోన్న ఈ మూవీ షూటింగ్ పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. గ్యాంగ్ లీడర్ చిత్ర హీరో మోహన్ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్ర పోస్టర్ ను జూన్ 8న విడుదల చేయడం విశేషం. ఈ సందర్భంగా హీరో మోహన్ కృష్ణ మాట్లాడుతూ…కరోన మహమ్మారి కారణంగా అన్ని రంగులతో పాటు సినిమా కార్మికులకు చాలా నష్టం కలిగింది. త్వరలో ఈ కరోన బారీ నుండి బయటపడి ఎవరి రంగాల్లో వారు తమ పనులు చేసుకోవాలని నా పుట్టినరోజు సందర్భంగా కోరుకుంటున్నానని తెలిపారు.నటీనటులు: మోహన్ కృష్ణ, హరిని రెడ్డి, సుమన్ ప్రసన్న కుమార్, సుధ, మహర్షి గురుస్వామి, జగదీశ్వరి, జబర్దస్త్ బాబి.సాంకేతిక నిపుణులు:సమర్పణ: శ్రీ పద్మాలయా ఎంటర్టైన్మెంట్స్బ్యానర్: మాణిక్యం మూవీస్నిర్మాత: ఎన్.వి.వి.సుబ్బారెడ్డిసంగీతం: ఘన శ్యామ్కథ మాటలు స్క్రీన్ ప్లే దర్శకత్వం: ఎస్.ఎమ్.ఆర్ఫైట్స్: రామ్ సుంకరఎడిటర్: నందమూరి హరిడాన్స్ మాస్టర్: మహేష్ల్యాబ్: సిటుసి