జె మీడియా 361 డిగ్రీస్”లోగో లాంఛ్ చేసిన టీఆర్ఎస్ లీడర్ తలసాని సాయికిరణ్
అత్యాధునిక హాంగులతో పాటు.. డిస్ ఇన్ఫెక్టెడ్ స్టూడియో నిర్మాణం మొదలుపెట్టింది జె మీడియా . సినిమా ప్రమోషనల్ ఈవెంట్స్ ని కొత్త పుంతలుతొక్కించి ఎల్ ఈ డి స్ర్కీన్స్ ని ప్రజెంట్ చేయడంలో నెంబర్ వన్అనిపించుకున్న జె మీడియా అధినేత నరేంద్ర మరో అత్యాధునిక స్టూడియోనిర్మాణానికి ముందండుగు వేసాడు. జె మీడియా 361 డిగ్రీస్ పేరుతోనిర్మించబోయే ఈ స్టూడియో ప్రపంచలోనే మొదటి డిస్ ఇన్ఫెక్టెడ్ స్టూడియోగాచరిత్ర లో నిలవబోతుంది. హైదరాబాద్ సమీపంలోని గోపన్నపల్లి లో ఈవెంట్స్కి, సినిమా షూటింగ్స్ అనువుగా ఉండే స్టూడియో నిర్మాణం త్వరలోనే ప్రారంభంకాబోతుంది. కంప్లీట్ సెటెప్ తో ప్రతీ ఎక్విప్మెంట్ ని స్టూడియోలోనేఅందుబాటులో ఉంచుతూ.. సౌండ్, లైటింగ్ వంటి డిపార్ట్ మెంట్ లలో అత్యాధునికటెక్నాలిజీతో స్టూడియో నిర్మాణం కాబోతుంది. వీటితో పాటు టాప్ క్లాస్ సూట్రూమ్స్, లాంజ్ లు, పూల్ ఏరియా నిర్మాణం కూడా వీటిలో భాగం అవుతుంది.గోపన్న పల్లి లో లక్షా ముప్పై ఐదు వేల చదరపు అడుగలలో నిర్మాణం అయ్యే ఈస్టూడియో హైఎండ్ టెక్నాలిజీ తో సినిమా రంగంలో కొత్త ఒరవడిసృష్టించబోతుంది. ఈ స్టూడియో లోగోని సినిమాటోగ్రఫీ మంత్రి తలసానిశ్రీనివాస్ యాదవ్ తనయుడు,టీఆర్ఎస్ లీడర్ తలసాని సాయికిరణ్ లాంచ్ చేసారు.ఈలోగో మరియు ఈ ప్రాజెక్ట్ ఐడియా చాలా బాగా నచ్చాయనీ,నరేందర్ కుశుభాకాంక్షలు తెలియజేశారు.త్వరలోనే ఈ స్టూడియో నిర్మాణం ప్రారంభంకాబోతుంది.