ఆస్కార్‌ చరిత్రలో ఇది నాలుగోసారి!

తెలుగు

ఆస్కార్‌ చరిత్రలో ఇది నాలుగోసారి!

By admin

June 18, 2020

ఆస్కార్‌ చరిత్రలో ఇది నాలుగోసారి!

అంతర్జాతీయ స్థాయిలో ప్రతిష్ఠాత్మకంగా జరిగే ఆస్కార్‌ అవార్డుల ప్రదానోత్సవం వాయిదా పడింది. 2021 ఫిబ్రవరి 28న జరగాల్సిన 93వ ఆస్కార్‌ వేడుకను కరోనా కారణంగా మరో రెండు నెలలు వాయిదా వేసినట్లు అకాడమీ ప్రెసిడెండ్‌ డేవిడ్‌ రూబన్‌ తెలిపారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. ఆస్కార్‌ వేడుకలంటే సినీ తారలకు, అభిమానులకు పండగే! ఎర్ర తివాచీపై అందాల తారలు తళుక్కున మెరుస్తుంటారు. ప్రస్తుతం కరోనా మహమ్మారి కల్లోలం సృష్టిస్తున్న సంగతి తెలిసింది. ప్రపంచవ్యాప్తంగా సినిమారంగం మొత్తం నిలిచిపోయింది. థియేటర్లు మూతపడ్డాయి. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 28న వైభవంగా జరగాల్సిన ఆస్కార్‌ వేడుకను రెండు నెలలు వాయిదా వేసి ఏప్రిల్‌ 25న నిర్వహించనున్నారు. మార్చి 15న ఆస్కార్‌ నామినేషన్‌ వివరాలు వెల్లడిస్తారు. 

ఆస్కార్‌ చరిత్రలో వేడుక వాయిదా పడడం ఇది నాలుగోసారి. 1938లో లాస్‌ ఏంజెల్స్‌లో వరదలు కారణంగా ఓ సారి, 1968లో మార్టిన్‌ లూఽథర్‌ కింగ్‌ హత్య జరిగినప్పుడు రెండు రోజులు, 1981లో అప్పటి అమెరికా అధ్యక్షుడు రొనాల్డ్‌ రీగన్‌పై హత్యాయత్నం జరగడంతో ఈ వేడుకలను వాయిదా వేశారు. గడచిన 40 ఏళ్లలో ఆస్కార్‌ వేడుకలు వాయిదా పడటం ఇదే తొలిసారి.