*హీరో సుప్రీమ్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు*
*హీరో సుప్రీమ్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు* తెలుగు తమిళ భాషల్లో దర్శకుడిగా అత్యుత్తమ స్థానాన్ని సంపాదించిన ప్రముఖ దర్శకుడు నర్రా శివనాగు, ఆయన తనయుడు సుప్రీమ్. సుప్రీమ్ బాలనటుడిగా అనేక చిత్రాలలో నటించాడు. బాలనటుడిగా ఆయన ప్రధాన పాత్రలు పోషించిన చిత్రాలలో మెగా బ్రదర్ నాగబాబుతో సుప్రీమ్ నటించిన చిత్రం “మాస్టర్ మైండ్స్” చిత్రానికి జాతీయ ఉత్తమ బాలనటుడిగా అవార్డ్ అందుకున్నారు. సుప్రీమ్ టైటిల్ రోల్ చేసిన “లిటిల్ బుద్ధ” చిత్రానికి ఉత్తమ బాలనటుడిగా రాష్ట్ర ప్రభుత్వ నంది అవార్డు అందుకుని మంచి నటుడిగా నిరూపించుకున్నాడు. తరువాత టీనేజ్ లో ఆర్తి అగర్వాల్ తో కలిసి నటించిన “వనకన్య వండర్ వీరుడు” లో టీనేజ్ హీరోగా మెప్పించి, “బాయ్ ఫ్రెండ్” మూవీతో లవర్ హీరోగా యూత్ ని అలరించిన సుప్రీమ్ ప్రస్తుతం సినిమాలకు స్వస్తి చెప్పి ఫారిన్ లో MBBS చదువుతున్నాడు. ప్రముఖుల నుండి సుప్రీమ్ అందుకున్న ప్రశంసలు:సుప్రీమ్ బాలనటుడిగా చేస్తున్న సమయంలో మెగాస్టార్ చిరంజీవి సుప్రీమ్ ని “నువ్వు మీ నాన్న లాగా డైరెక్టర్ అవుతావా? హీరో అవుతావా?” అని అడిగారట.”మీలాగ హీరో అవుతాను అంకుల్” అని సుప్రీమ్ జవాబు ఇచ్చాడట.అప్పుడు మెగాస్టార్ ” నువ్వు పెద్ద హీరో అవుతావు” అని దీవించారట. సూపర్ స్టార్ కృష్ణ గారు కూడా “సుప్రీమ్ నువ్వు రాబోయే కాలానికి కాబోయే హీరో అవుతావు” అని దీవించారట. అలాగే “లిటిల్ బుద్ధ” చూసి బౌద్ధ గురువు దలైలామా బుద్ధుడిగా ఈ బాలుని నటన అద్భుతం అని కొనియాడారట.ఇంతమంది పెద్దల ఆశీర్వాదాలు పొందిన నువ్వు నిజంగా గ్రేట్ సుప్రీమ్. అయితే విశేషం ఏమిటంటే జూన్ 21 హీరో సుప్రీమ్ పుట్టిన రోజు కావడం. హీరో సుప్రీమ్ కి తెలుగు సినీ పరిశ్రమ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తోంది. Happy birthday to you *SUPREME*Many more happy returns of the day.. |