ప్రపంచ రికార్డు సాధించిన నటసింహ బాలకృష్ణ 60వ జన్మదిన వేడుకలు
ప్రపంచ రికార్డు సాధించిన నటసింహ బాలకృష్ణ 60వ జన్మదిన వేడుకలు
జూన్10 నటసింహ నందమూరి బాలకృష్ణ 60వ జన్మదినాన్ని పురస్కరించుకుని గ్లోబల్ నందమూరి అభిమానులు మంచి ఆలోచనతో ఓ కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టారు. ప్రతి సంవత్సరం వేలాది మంది అభిమానుల మధ్య జరిగే వేడుకలా కాకుండా ప్రస్తుత Covid19 పరిస్థితులని దృష్టిలో పెట్టుకొని, ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్‌ని పాటిస్తూ, ఇలాంటి విపత్కర పరిస్థితులలో విశిష్ట సేవలందిస్తున్న #Covid Herosకి సెల్యూట్ చేస్తూ బాలయ్య అభిమానులు, మిత్రులు, ఆత్మీయులు వారి వారి ఇళ్లలో, కుటుంబ సభ్యులతో కలిసి జూన్10ఉదయం10:10నిమిషాలకు ప్రపంచవ్యాప్తంగా ఒకేసమయంలో21000 లకు పైగా NBK60 కేక్స్ కట్ చేసి సామాజిక బాధ్యతతో జన్మదిన వేడుకలు జరిపారు. ఇలా జరపడం ఇదే మొదటిసారి కావడంతో వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ మరియు జీనియస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ వారు పర్యవేక్షించి ప్రపంచ రికార్డుగా ప్రకటించారు. ప్రస్తుత పరిస్థితులు చక్కబడ్డాక బాలకృష్ణ గారికి ప్రశంసాపత్రాన్నిఅందజేస్తామని తెలిపారు.NBK HELPING HANDS అధినేత అనంతపురం జగన్ మాట్లాడుతూ – “ ప్రపంచ వ్యాప్తంగా 21000వేలమందికి పైగా నటసింహ బాలకృష్ణ అభిమానులు వారి ఇళ్లలో ఉంటూనే ఒకేసమయంలో కేక్ కట్ చేసి రికార్డుని సాధించాం. ఆరోజు దాదాపు ప్రత్యేకంగా పరోక్షంగా ప్రపంచవ్యాప్తంగా 80వేలమందికి పైగా అభిమానులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. మా కుటుంబ సభ్యుడుగా భావించే మా బాలయ్య గారి 60వ పుట్టినరోజు వేడుకలు వారి కుటుంబ సభ్యుల మధ్య ఇంట్లో జరుపుకోవడం ప్రతి అభిమానికి ఎన్నటికీ మర్చిపోలేని తియ్యటి జ్ఞాపకం. బాలయ్య గారి మంచి మనస్సుకు, సేవాగుణానికి గుర్తుగా ప్రతి ఒక్కరూ ఒక పండుగలా ఆయన పుట్టినరోజు వేడుకలు జరిపాము. కరోనా అందరిని ఇంట్లో నుండి బయటకు రాకుండా చేసింది కానీ మా గుండెల్లో ఉండే అభిమానాన్ని అపలేకపోయింది“అన్నారు.మీ ప్రేమాభిమానాల్ని ప్రపంచరికార్డ్ రూపంలో అందించిన అభిమానులందరికీ దన్యవాదాలు
ఈ సందర్భంగా నటసింహ బాలకృష్ణ మాట్లాడుతూ – నా 60వ పుట్టినరోజుని ఇప్పటి పరిస్థితులకు అనుగుణంగా నా అభిమానులతో పాటు, మిత్రులు,శ్రేయోభిలాషులు క్రమశిక్షణతో మీ కుటుంబ సభ్యుల సమక్షంలో వేడుకలు జరిపి మీ సామాజిక బాధ్యతను నాకు అపూర్వకానుకగా ఇచ్చారు. మీ ప్రేమాభిమానాన్ని ప్రపంచ రికార్డు రూపంలో అందించిన మీ అందరికి పేరుపేరునా ధన్యవాదాలు. సామాజిక దూరం పాటించి సేవాకార్యక్రమాలు చేసిన వారందరికీ అలాగే ఈ ఈవెంట్ ను ఆర్గనైజ్ చేసిన అనంతపురం జగన్ కి నా అభినందనలు` అన్నారు.