తెలుగు

“నరుడి బ్రతుకు నటన” మోషన్ టీజర్ విడుదల

By admin

June 21, 2020

“నరుడి బ్రతుకు నటన” మోషన్ టీజర్ విడుదల :

యోగా డే రోజు కాకుండా ప్రతి డే మన లైఫ్ లో యోగా ఉంటేనే ఆరోగ్యం మన చేతిలో ఉంటుంది  :- హీరో తల్లాడ సాయికృష్ణ

శ్రీ అన్నపూర్ణ క్రియేషన్స్ బ్యానర్ పై తల్లాడ శ్రీనివాస్ నిర్మాతగా జానీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న హర్రర్ సినిమా ” నరుడి బ్రతుకు నటన”. తల్లాడ సాయికృష్ణ, మాధురి హీరో హీరోయిన్లు గా తనికెళ్ల భరణి ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ సినిమా మోషన్ టీజర్ ని యోగా డే సందర్భంగా  విడుదల చేసింది చిత్ర బృందం.

“”యోగా అంటే మనిషి యోక్క అనంతమైన మేధా శక్తి,  మనో బలంతో  సాధన చేస్తే ఎన్నో అద్భుతాలు సృష్టించోచ్చు ఎందుకంటే  “నరుడి బ్రతుకు నటన”.”” అనే  డైలాగ్ తో ఉన్న ఈ మోషన్ టీజర్  నెటిజన్ల ని ఆకర్షిస్తున్నట్లు, ప్రముఖ గ్రాఫిక్స్ డిజైనర్ రాహుల్ అందించిన గ్రాఫిక్స్  వలన మోషన్ టీజర్ కి ప్రత్యేకత కలిగిందని దర్శకుడు జానీ తెలిపారు.