మెగాస్టార్ చిరంజీవికి కటింగ్ చేస్తున్న తనయ సుస్మిత
మెగాస్టార్ చిరంజీవికి కటింగ్ చేస్తున్న తనయ సుస్మిత
కరోనా మహమ్మారి ప్రభావం ఇంకా కొనసాగుతూనే ఉంది. సుమారు 3 నెలల నుంచి ప్రజలందరూ కరోనాని కలవరిస్తూనే ఉన్నారు. మనస్ఫూర్తిగా ఏ పనీ చేయడానికి లేదు. ఏ పని చేయాలన్నా.. దానికి కరోనా హిస్టరీ ఏంటా అని ఆలోచించాల్సిన రోజులివి. అందుకే సామాన్యుడి నుంచి సెలబ్రిటీ వరకు అందరూ భయాందోళనలోనే ఉన్నారు. ఇక వృత్తి పనులు చేసుకునే వారి బాధ వర్ణనాతీతం. అందులోనూ బార్బర్ వృత్తివారు చాలా కఠినమైన రోజులను అనుభవిస్తున్నారు. ఎక్కడో బార్బర్ షాపు ద్వారా కరోనా వచ్చిందనే వార్తలు రావడం, దేశమంతా బార్బర్ షాపులు లాక్ చేయడం వంటివి వింటూనే ఉన్నాం. అందుకే ఎవ్వరూ బార్బర్ షాపుకి వెళ్లే ప్రయత్నాలు చేయడం లేదు. ఇక సెలబ్రిటీలు కూడా తమ ఇంటిలోనే కటింగ్ వంటి కార్యక్రమాలు కానిచ్చేస్తున్నారు. సెలూన్ వంటి వాటికి దూరంగా ఉండి, వారి ఇంటిలోని వారితోనే కటింగ్ చేయించుకుంటున్న దృశ్యాలు ఈ మధ్య సోషల్ మీడియాలో బాగానే కనిపిస్తున్నాయి. తాజాగా మెగా తనయ సుస్మిత, తన తండ్రి మెగాస్టార్ చిరంజీవికి కటింగ్ చేస్తున్న వీడియోని షేర్ చేశారు. ఫాదర్స్ డే సందర్భంగా సుస్మిత ఈ వీడియోను షేర్ చేశారు. ఇది చూసిన మెగా ఫ్యాన్స్ కొంచెం సేపట్లోనే దీనిని వైరల్ చేశారు. ఈ వీడియోని షేర్ చేసిన సుస్మిత.. తన తండ్రికి ఫాదర్స్ డే శుభాకాంక్షలు తెలుపుతూ ధన్యవాదాలు తెలిపారు. సింపుల్ హెయిట్ కట్ నుంచి ప్రతి విషయంలోనూ మమ్మల్ని ఎంతగానో నమ్మినందుకు, మాపై మీ ప్రేమకు ధన్యవాదాలు అంటూ సుస్మిత తన ఇన్స్టాగ్రమ్లో పేర్కొంది.