ఆగస్ట్ 22 దర్శకుడు శివనాగుకి పుట్టినరోజు శుభాకాంక్షలు
ఆగస్ట్ 22 దర్శకుడు శివనాగుకి పుట్టినరోజు శుభాకాంక్షలు
టాలీవుడ్ సీనియర్ దర్శకుడు శివనాగు పుట్టిన రోజు ఆగస్ట్ 22.. ఈ సందర్భంగా టాలీవుడ్ న్యూస్ చానల్ ఆయన్ని ప్రసాద్ ఫిల్మ్ లాబ్ లో కలవటం జరిగింది.
మెగా స్టార్ పుట్టినరోజు మీ పుట్టినరోజు ఒకే రోజు కావడం మీకు ఏమనిపిస్తుంది.?
అన్నయ్య మెగాస్టార్ పుట్టినరోజునే నా పుట్టినరోజు కావడం నా అదృష్టం.
ఇండస్ట్రీలో కొంతమంది మిమ్మల్ని రాకింగ్ డైరెక్టర్ అంటుంటారు కదా! మరి మీ పేరు ముందు అది ఎప్పుడూ తగిలించుకోరా? అసలు ఆ రాకింగ్ అనే పేరు మీకు ఎవరు పెట్టారు?
మున్నా అని ఒక కుర్రాడున్నాడు.. అతను క్యాబ్ డ్రైవర్. అతను నెట్ లో నా సినిమా అప్ డేట్స్ అన్నీ చూసి ఒక రోజు నాకు మెసేజ్ చేశాడు “మీరు రాకింగ్ డైరెక్టర్ సార్” అని. నా ఫోటో మీద డిజైన్ కూడా చేసి పంపించాడు. రాకింగ్ అంటే నాకు అర్ధం కాలేదు. ఎందుకంటే నేను ఇంగ్లీష్ లో వీక్. రాకింగ్ అంటే ఏమిటి అని మా అబ్బాయిని అడిగాను. ఏదైనా పనిని పట్టుదలతో సాధించే వారిని రాకింగ్ అంటారు అని చెప్పాడు.
ఇండస్ట్రీలో మరి ఒక అభిమాని మీకు ఇచ్చిన ఇలాంటి బిరుదుని మీరు ఎందుకు మీ పేరు ముందు పెట్టుకోవటం లేదు?
రాకింగ్, డైనమిక్, డేరింగ్.. ఇలాంటి బిరుదుల మీద నాకు నమ్మకం లేదు. సినిమా ఇండస్ట్రీలో పది కాలాలపాటు మంచి సినిమాలు చేసుకుంటూ సంతోషంగా ఉండటమే నాకు ఆనందం.
ఆ మధ్య “అన్నపూర్ణమ్మగారి మనవడు” సినిమా చేశారు కదా. విడుదల ఎప్పుడు?
లాక్ డౌన్ వల్ల “అన్నపూర్ణమ్మగారి మనవడు” విడుదల కాలేదు . థియేటర్స్ కోసం వెయిట్ చేస్తున్నాం.
నందమూరి తారక్ తో చేస్తున్న “దేవినేని” ఎంతవరకు వచ్చింది ?
ప్రసాద్ ల్యాబ్స్ లో డి టి ఎస్ వర్క్ జరుగుతోంది . సెప్టెంబర్ లో ఫస్ట్ కాపీ రెడీ అవుతుంది.
ఆల్ ది బెస్ట్ శివనాగు గారూ! మా టాలీవుడ్ న్యూస్ చానల్ మీకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటోంది.