తెలుగు

అమ్మ కల సాకార‌మ‌వుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది‌

By admin

August 26, 2020

అమ్మ కల సాకార‌మ‌వుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది

ఆచార్యలో కీ రోల్ పోషిస్తున్నా అని చెప్పారు స్టార్ హీరో రామ్ చరణ్. టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి న‌టిస్తోన్న‌ ప్ర‌తిష్టాత్మ‌క చిత్రం ఆచార్య‌. కొరటాల శివ డైరెక్ష‌న్ లో 152వ చిత్రంగా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. కొణిదెల ప్రొడ‌క్ష‌న్ బ్యాన‌ర్ పై నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టుకు రాంచ‌‌ర‌ణ్ కో ప్రొడ్యూస‌ర్ గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. అంతేకాదు చిరంజీవితో పాటు కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు. ఇటీవ‌లే ఇచ్చిన ఓ ఇంట‌ర్వ్యూలో రాంచ‌ర‌ణ్ మాట్లాడుతూ..ఆచార్య‌లో కీ రోల్ పోషిస్తున్నాను. నాన్న‌ పాపులారిటీ, పేరు వ‌ల్లే నాకింత స్టార్ డ‌మ్ వ‌చ్చింది. నాన్నతో క‌లిసి నటించే అవ‌కాశం వ‌చ్చిన‌పుడు అంత‌క‌న్నా ఏం కావాల‌ని..నేనేం మాట్లాడ‌లేదు. నేను న‌టించిన బ్రూస్ లీ చిత్రంతో నాన్న గెస్ట్ రోల్ లో క‌నిపించారు. అంతేకాదు రీఎంట్రీ చిత్రం ఖైదీ నం 150లో నాన్న‌తో క‌లిసి డ్యాన్స్ చేశాను. నాన్న‌, నేను సిల్వ‌ర్ స్క్రీన్ పై క‌లిసి క‌నిపించాల‌నేది అమ్మ క‌ల‌. ఆచార్య చిత్రంతో అమ్మ క‌ల సాకార‌మ‌వుతున్నందుకు చాలా సంతోషంగా ఉంద‌ని తెలిపారు.