తెలుగు

పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్న మెగా హీరో

By admin

August 28, 2020

పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్న మెగా హీరో

పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడట మెగా హీరో వరుణ్ తేజ్.    ఇలాంటి పాత్ర చేయాలనే కోరిక  వరుణ్ తేజ్ కు కూడా వుంది. అది త్వరలో సాకారం కాబోతోంది. వరుణ్ కోసం దర్శకుడు సాగరచంద్ర ఓ పవర ఫుల్ పోలీసాఫీసర్ పాత్రతో కూడిన కథను సిద్ధం చేశాడట. అది వరుణ్ కి బాగా నచ్చడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని అంటున్నారు. వాస్తవానికి ఈ చిత్రం ఇంతకుముందే సెట్స్ కి వెళ్లాలి. వేరే కారణాల వల్ల ఆలస్యమైందంటున్నారు. ప్రస్తుతం వరుణ్ స్పోర్ట్స్ డ్రామా ‘బాక్సింగ్’ చేస్తున్నాడు. దీని తర్వాత అనిల్ రావిపూడితో ‘ఎఫ్ 3′ చేయాల్సివుంది. దాని తర్వాత వచ్చే ఏడాది ఈ పోలీస్ స్టోరీ సెట్స్ కి వెళుతుందట. దీనిని ’14 రీల్స్ ప్లస్’ బ్యానర్ పై భారీ చిత్రంగా నిర్మించడానికి ప్లాన్ చేస్తున్నారు.