మరోసారి “సూపర్ స్టార్” తో అనిల్ రావిపూడి
డైరెక్టర్ పరశురాం తెరకెక్కిస్తున్న సర్కారు వారి పాట చిత్రంలో నటిస్తున్నాడు సూపర్ స్టార్ మహేశ్ బాబు. కాగా తన తదుపరి చిత్రాన్ని దర్శకుడు అనిల్ రావిపూడితో చేయనున్నాడని టాక్. ఇటీవలే మహేశ్ నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’ హిట్ చిత్రానికి అనిల్ దర్శకత్వం వహించాడు. తాజాగా మరో కొత్త పాయింటుతో కూడిన కథతో ఆయన మహేశ్ ని సంప్రదించినట్టు చెబుతున్నారు. ఈ విషయంలో త్వరలోనే స్పష్టత వస్తుంది.