తెలుగు

మిషన్ 2020 ఫస్ట్ లుక్ పోస్టర్  విడుదల

By admin

August 30, 2020

మిషన్ 2020 ఫస్ట్ లుక్ పోస్టర్  విడుదల

శ్రీ మిత్ర & మై విలేజ్ సమర్పణలో బన్నీ క్రియేషన్స్ మరియు మధు మృదు ఎంటర్టైన్మెంట్ స్ పతాకం పై నవీన్ చంద్ర  హీరో గా బీహార్ చీఫ్ మినిస్టర్ నితీష్ కుమార్ గారి  ప్రేరణ తో యదార్ధ సంఘటనల ఆధారంగా సమకాలీన రాజకీయ నేపథ్యంలో రూపుదిద్దుకుంటున్న సినిమా “మిషన్ 2020”. గతం లో శ్రీకాంత్ హీరో గా రాజకీయ నేపథ్యంతో విడుదలైన  మెంటల్ పోలీస్,  ఆపరేషన్ 2019 సినిమాలు ఘన విజయం సాధించాయి. ఆ రెండు సినిమాలకి కరణం బాబ్జి దర్శకుడు. ఇప్పుడు మిషన్ 2020 కూడా అలాంటి సమకాలీన రాజకీయ కథ కథనం తో రూపుదిద్దుకుంటుంది. కరణం బాబ్జి ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా కుంట్లూర్ వెంకటేష్ గౌడ్ మరియు  కె వి ఎస్ ఎస్ ఎల్ రమేష్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం యొక్క  ఫస్ట్ లుక్ పోస్టర్ ను హీరో శ్రీకాంత్ విడుదల చేసారు.

ఈ సందర్భంగా హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ “గతంలో కరణం బాబ్జి గారు మెంటల్ పోలీస్ మరియు ఆపరేషన్ 2019 సినిమాలకు దర్శకత్వం వహించారు. ఆ రెండు సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి నాకు మంచి పేరు వచ్చింది. ఆపరేషన్ 2019 హిందీ లో కూడా మంచి సంచలనం సృష్టించింది.  ఇప్పుడు కరణం బాబ్జి దర్శకత్వం లో నవీన్ చంద్ర హీరో గా  వస్తున్నా మరో పొలిటికల్ సినిమా మిషన్ 2020. కథ చాలా బాగుంది. 2020 సంవత్సరం సినిమా ఇండస్ట్రీ కి పెద్ద సంక్షోభం, మరి మా మిషన్ 2020 ఆ సంక్షోభాన్ని ఛేదిస్తుంది అని భావిస్తున్నాను” అని తెలిపారు.

దర్శకుడు కరణం బాబ్జి మాట్లాడుతూ “శ్రీకాంత్ గారు అంటే నాకు సెంటిమెంట్, నా సినిమా ఓపెనింగ్ కి మీరు ఖచ్చితంగా రావాలి అంటే, వేరే ఊర్లో ఉన్న నా మాట కాదనుకుండా వచ్చారు. సినిమా షూటింగ్ అంత పూర్తీ అయింది, రాత్రే గుమ్మడికాయ కొట్టం. మళ్ళి శ్రీకాంత్ గారికి ఫోన్ చేసి మీరు ఫస్ట్ లుక్ విడుదల చేయాలి అన్నాను, వెంటనే ఒప్పుకున్నారు. మా సినిమా కి కథే హీరో, చాలా మంచి కథ, నవీన్ చంద్ర, నాగ బాబు, జయ ప్రకాష్ గారు ఇరగదీసారు. సినిమా అద్భుతంగా వచ్చింది. ఇప్పటివరకు 45 సినిమాలకు పని చేశాను, ఈ 45 సినిమాలో నాకు నచ్చిన సినిమా “మిషన్ 2020″.  ఈ 2020 సంవత్సరం లో మంచి సినిమా. నా నిర్మాతలకి ధన్యవాదాలు, షూటింగ్ చాలా హ్యాపీ గా జరిగింది. జనవరి లో షూటింగ్ మొదలు చేసాం మార్చి లాక్ డౌన్ కి పూర్తీ చేసాం. నవీన్ చంద్ర గారి అంకిత భావం తో పని చేసారు. నిన్న రాత్రి శ్రీ రాపాక తో ఐటమ్ సాంగ్ పూర్తీ చేసాము. చాలా బాగా వచ్చింది. ఈ 2020 లో ఆ పాట సెన్సేషన్ అవుతుంది” అని తెలిపారు.

సంగీత దర్శకుడు ర్యాప్ రాక్ షకీల్ మాట్లాడుతూ “ఆపరేషన్ 2019 తర్వాత మా డైరెక్టర్ కరణం బాబ్జి తో ఇది నా రెండో సినిమా. ఇది ఒక బాధ్యతగల సినిమా ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా. నాకు పెద్ద పేరు తెచ్చి పెట్టే సినిమా” అని తెలిపారు.

నిర్మాత కుంట్లూర్ వెంకటేష్ గౌడ్ మాట్లాడుతూ “నాకు శ్రీహరి గారు ప్రేరణ ఇప్పుడు అయ్యన లేని లోటు హీరో శ్రీకాంత్ గారు పూర్తిచేస్తున్నారు. మా సినిమా ప్రారంభోత్సవానికి వచ్చారు ఇప్పుడు ఫస్ట్ లుక్ ను విడుదల చేసారు. వారికి ధన్యవాదాలు. సంగీతం చాలా బాగా వచ్చింది. ఐదు పాటలు చాలా బాగా వచ్చాయి. మా డైరెక్టర్ గారు, మంచి క్రియేటివిటీ తో సమకాలీన రాజకీయ కథ కథనం తో సినిమా చేసారు. అందరికి నచ్చే చిత్రం. ఈ సినిమా తర్వాత అక్టోబర్ లో మరో సినిమా ప్రారంభిస్తాం” అని తెలిపారు.

మరి నిర్మాత కె వి ఎస్ ఎస్ ఎల్ రమేష్ రాజు మాట్లాడుతూ “ముఖ్యంగా హీరో శ్రీకాంత్ గారికి ధన్యవాదాలు. సినిమా చాలా బాగా వచ్చింది. మంచి మెసేజ్ తో సమకాలీన రాజకీయ కథ తో వచ్చింది. తప్పకుండా హిట్ అవుతుంది. మంచి మ్యూజిక్ మంచి పాటలు ఉన్నాయి. శ్రీ రాపాక పాట సంచలనం సృష్టిస్తుంది” అని తెలిపారు.

జర్నలిస్ట్ ప్రభు మాట్లాడుతూ “మంచి మనసున్న మనిషి హీరో శ్రీకాంత్, ఈ కరోనా టైం లో అయన ఇంట్లో ఈ మిషన్ 2020 ఫస్ట్ లుక్ ను విడుదల చేసారు. పోస్టర్ కూడా చాలా బాగుంది. మిషన్ 2020 చాలా పవర్ ఫుల్ టైటిల్. సమకాలీన రాజకీయ కథలు మనకి చాలా అవసరం, మరి దర్శకుడు కారణం బాబ్జి అలాంటి మంచి అద్భుతమైన కథ వస్తున్నాడు. మంచి విజయం సాదించాలి” అని కోరుకున్నారు.

సమర్పణ : హనీ బన్నీ క్రియేషన్స్

బ్యానర్ : మధు మృదు ఎంటర్టైన్మెంట్స్

సినిమా పేరు : మిషన్ 2020

నటి నటులు : నవీన్ చంద్ర, నాగ బాబు, జయ ప్రకాష్, సత్య ప్రకాష్, అజయ్ రత్నం, దిల్ రమేష్, కోటేష్ మానవ, స్వాతి, సమీర్, చలాకి చంటి, బుల్లెట్  భాస్కర్, శ్రీ సుధా, సంధ్య జనక్, తదితరులు.

కెమెరా మాన్ : వెంకట్ ప్రసాద్

సంగీతం : ర్యాప్ రాక్ షకీల్

ఎడిటర్ : ఎస్ బి ఉద్ధవ్

ఆర్ట్ డైరెక్టర్ : జె కె మూర్తి

ఫైట్స్ : సింధూరం సతీష్, వై రవి

డాన్స్ మాస్టర్ : గణేష్ మాస్టర్

కథ, కథనం, మాటలు, డైరెక్టర్ : కరణం బాబ్జి

నిర్మాతలు : కుంట్లూర్ వెంకటేష్ గౌడ్ మరియు  కె వి ఎస్ ఎస్ ఎల్ రమేష్ రాజు