తెలుగు

‘అమరం అఖిలం ప్రేమ’ ట్రైల‌ర్ విడుద‌ల చేసిన కింగ్ నాగార్జున‌… సెప్టెంబ‌ర్ 18న ఆహాలో సినిమా విడుద‌ల‌

By admin

September 04, 2020

‘అమరం అఖిలం ప్రేమ’ ట్రైల‌ర్ విడుద‌ల చేసిన కింగ్ నాగార్జున‌… సెప్టెంబ‌ర్ 18న ఆహాలో సినిమా విడుద‌ల‌

 

విజ‌య్ రామ్‌, శివ్‌శ‌క్తి స‌చ్‌దేవ్ జంట‌గా న‌టించిన చిత్రం ‘అమ‌రం అఖిలం ప్రేమ‌’. చ‌ల‌న చిత్రాలు బ్యాన‌ర్‌పై వి.ఇ.వి.కె.డి.ఎస్‌.ప్ర‌సాద్, విజ‌య్ రామ్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు. జోనాధ‌న్ ఎడ్వ‌ర్డ్ ద‌ర్శ‌కుడు. సెప్టెంబ‌ర్ 18న ఈ సినిమాను తెలుగు ఓటీటీ యాప్ ఆహాలో విడుద‌ల చేస్తున్నారు. శుక్ర‌వారం(సెప్టెంబ‌ర్ 3) రోజున ఈ సినిమా ట్రైల‌ర్‌ను కింగ్ నాగార్జున విడుద‌ల చేశారు. ఈ సంద‌ర్భంగా…

కింగ్ నాగార్జున మాట్లాడుతూ ‘‘‘అమ‌రం అఖిలం ప్రేమ‌’ ట్రైల‌ర్ చూశాను. చాలా బావుంది. మ‌రో చ‌రిత్ర‌, ఏక్ తూజే కేలియె స్టైల్లో అనిపించింది. నాకు ‘బొమ్మ‌రిల్లు’ సినిమా గుర్తుకొచ్చింది. తండ్రీ, కూతురు మ‌ధ్య అనుబంధాన్ని తెలియ‌జేసే చిత్ర‌మిది. విజ‌య్ రామ్‌, శివ్‌శ‌క్తి స‌చ్‌దేవ్ చాలా బాగా యాక్ట్ చేశారు. సెప్టెంబ‌ర్ 18న ఆహాలో విడుద‌ల‌వుతున్న ఈ చిత్రం ప్రేక్ష‌కుల‌కు త‌ప్ప‌కుండా న‌చ్చుతుంద‌నే న‌మ్మ‌కం ఉంది.  ఎంటైర్ యూనిట్‌కు అభినంద‌న‌లు’’ అన్నారు.

ద‌ర్శ‌కుడు జోనాధ‌న్ ఎడ్వ‌ర్డ్ మాట్లాడుతూ ‘‘నేను డైరెక్టర్‌ని కావ‌డానికి నాగార్జునగారే కార‌ణం. ఆయ‌నిచ్చిన ఓ స‌ల‌హాతో నేను ‘అమరం అఖిలం ప్రేమ’ సినిమాను తెరకెక్కించాను. తండ్రీ, కూతురు మ‌ధ్య సాగే ఎమోష‌న‌ల్ డ్రామా, దీంతో పాటు హార్ట్ ట‌చింగ్ ల‌వ్‌స్టోరి అంద‌రినీ మెప్పిస్తుంది’’ అన్నారు.

హీరో, హీరోయిన్ మాట్లాడుతూ ‘‘మా ‘అమ‌రం అఖిలం ప్రేమ‌’ మూవీ తండ్రీ కూతురు మధ్య ఉన్న అనుబంధాన్ని, ప్రేమను తెలియజేస్తుంది. ఒక ప‌క్క తండ్రీ ఎమోష‌న్‌, ల‌వ్‌స్టోరీ రెండు ప్యార్‌ల‌ల్‌గా హార్ట్ ట‌చింగ్‌సాగుతాయి. త‌ప్ప‌కుండా సినిమాను ఎంజాయ్ చేస్తారు. మా సినిమాను ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొస్తున్న ఆహా ఓటీటీ బృందానికి మా ధ‌న్య‌వాదాలు’’ అన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో శ్రీకాంత్ అయ్యంగార్ కూడా పాల్గొన్నారు.

విజ‌య్ రామ్‌, శివ్‌శ‌క్తి స‌చ్‌దేవ్, న‌రేశ్ వి.కె, శ్రీకాంత్ అయ్యంగార్, అన్న‌పూర్ణ‌మ్మ‌ త‌దిత‌రులు న‌టిస్తోన్న ఈ చిత్రానికి సంగీతం:  ర‌ధ‌న్‌, సినిమాటోగ్ర‌ఫీ:  ర‌సూల్ ఎల్లోర్‌, ఎడిటింగ్‌: అమ‌ర్ రెడ్డి, ఆర్ట్‌:  రామ‌కృష్ణ మోనిక‌, నిర్మాత‌:  వి.ఇ.వి.కె.డి.ఎస్‌.ప్ర‌సాద్, విజ‌య్ రామ్‌, ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం:  జోనాత‌న్ ఎడ్వ‌ర్డ్.