కార్తీక్ రెడ్డి, నేనే శేఖర్, స్వాతి, శ్వేత, ఆయేషా హీరో హీరోయిన్లుగా నవులూరి భాస్కర్ రెడ్డి సమర్పణలో గీతాశ్రీ ఆర్ట్స్ బ్యానర్ పై రూపొందిన చిత్రం ‘అమ్మాయంటే అలుసా?’. నేనే శేఖర్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని వై. బ్రహ్మ శేఖర్, వై. లిఖితా చౌదరి నిర్మించారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర ఆడియోకి మంచి స్పందన వచ్చిందని తెలుపుతూ.. ఈ చిత్రాన్ని ఈ నెల 18న థియేటర్లలో విడుదల చేయబోతున్నట్లుగా దర్శకుడు నేనే శేఖర్ తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘నేను చాలా సినిమాలకు ప్రొడక్షన్ మేనేజర్‌గా వర్క్ చేశాను. ఆ అనుభవంతో నా పరిధిలో సినిమాను చాలా కష్టపడి తెరకెక్కించాం. నాకు నా టీమ్ అంతా ఎంతో సపోర్ట్ చేసింది. వారందరికీ ధన్యవాదాలు. సినిమా విషయానికి వస్తే.. ఆడవాళ్లను అలుసుగా చూడకూడదు. వారికి గౌరవం ఇవ్వాలనే కాన్సెప్ట్‌తో ఈ చిత్రాన్ని రూపొందించాం. ‘క్షేమంగా వెళ్లి లాభంగా రండి’ సినిమాను ఎలాగైతే ఎంజాయ్ చేశారో ఈ సినిమాలో సెకండాఫ్‌ను అలా ఎంజాయ్ చేస్తారు. ఇప్పటికే విడుదలైన పాటలకు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. చిత్రాన్ని డిసెంబర్ 18న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేయబోతున్నాము. కరోనా జాగ్రత్తలు పాటిస్తూ.. అందరూ ఈ సినిమా చూసి ఆశీర్వదిస్తారని కోరుతున్నాను..’’ అని తెలిపారు.
కార్తీక్ రెడ్డి, నేనే శేఖర్, స్వాతి, శ్వేత, ఆయేషా తదితరులు నటించిన ఈ చిత్రానికి బ్యానర్: గీతాశ్రీ ఆర్ట్స్, సంగీతం: వినీష్ గౌడ్, సమర్పణ: ఎన్. భాస్కర్ రెడ్డి, కో ప్రొడ్యూసర్: ఎన్. మాధవరెడ్డి, నిర్మాతలు: వై. బ్రహ్మ శేఖర్, వై. లిఖితా చౌదరి, కథ, స్ర్కీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: నేనే శేఖర్.