Gallery

Grand Launch of Mugdha Art Studio at Patny Centre, Secunderabad Launching By Beautiful Actresses Raasi Khanna & Anupama Parameswaran, Singer Sunitha

By admin

December 19, 2020

ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. 15వేల చదరపు అడుగులలో వస్తున్న భారీ స్టోర్ అన్నారు. చేనేతకు ప్రధాన్యతనిస్తూ.., అందులో తనదైన డిజైనర్ ముద్ర వేసి అందించడం డిజైనర్ శశి వంగపల్లికే చెందుతుందన్నారు. చీరకట్టు తమకు ఎంతో ఇష్టమని అన్నారు. మన అందాన్ని చీరకట్టు రెట్టింపు చేస్తుందన్నారు. అతివల అందాన్ని రెట్టింపు చేయడమే కాకుండా మన సంప్రదాయాన్ని చాటి చెపుతుందని అన్నారు. తమ షాపింగ్ లో చేనేత, డిజైనర్ దుస్తువులకు ప్రత్యేక స్థానం ఉందన్నారు.  నిర్వహకురాలు శశి వంగపల్లి మాట్లాడుతూ.. డిజైనర్ దుస్తువుల ఎంపికకు,  ఒక ప్రత్యేకమైన అనుభవాన్ని అందించేందుకు ఈ స్టోర్ కొనుగోలుదారుల ముందుకు వచ్చింది. ఒక విభిన్నమైన అనుభూతిని అందించేందుకు మా స్టోర్ తరుపున  ఎల్లప్పుడూ కృషి చేస్తున్నాము.  చెట్టినాడ్ ఇంటీరియర్స్ ఉన్న అందమైన ఆలయాన్ని మా స్టోర్లో ప్రత్యేక ఆకర్షణ గా నిలుపుతుంది. ఈ స్టోర్ 15000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. ఇందులో భాగంగా మన సాంస్కృతి సంప్రదాయం ప్రతిబింబించే విదంగా వస్త్రాలను అందుబాటులోకి తీసుకొస్తున్నాం. చేనేత వస్త్రాలకు ప్రాధాన్యం ఇవ్వడంతో పాటు చేనేత కార్మికులకు బాసటగా నిలిచేందుకు ప్రయత్నిస్తున్నాం. దేశంలోని అత్యుత్తమమైన  కంజీవరం నుండి బెనరసి చీరల వరకు, ఇకత్తాస్ నుండి గద్వాల్ వరకు, పైథానిస్ నుండి ఉపడ్డాస్ వరకు సికింద్రాబాద్ స్టోర్ లో అందుబాటులోకి తీసుకొస్తున్నాం.  ఇక్కడ ఫాన్సీ, డిజైనర్ చీరల  ప్రత్యేకమైన సేకరణను కూడా చూడవచ్చన్నారు. దీనికి తోడు ఈసారి మేము రెడీమేడ్స్ మరియు బ్రైడల్ వేర్ లెహెంగాస్‌తో వస్తున్నాము. ఆధునిక మహిళల అభిరుచిని, ధరలను, ఆలోచనలను   దృష్టిలో ఉంచుకుని ప్రత్యేకంగా రూపొందించిన పెళ్లి దుస్తులు అందుబాటులో ఉంచుతున్నామన్నారు.  అన్నింటికీ వన్ స్టాప్ వెడ్డింగ్ షాపింగ్ గా తీర్చిదిద్దాం.

“ముగ్ధ” గురించి…

ముగ్ధ ఆర్ట్ స్టూడియో 2012 లో ఒకే గదిలో ప్రారంభం అయ్యింది. ఈ బ్రాండ్ వ్యవస్థాపకురాలు, చీఫ్ డిజైనర్ శశి వంగపల్లి దీనిని భారతదేశపు గొప్ప సాంస్కృతిక వారసత్వం మరియు సంప్రదాయాల స్టోర్ గా భావించి అందుకు అనుగుణంగా తీర్చిదిద్దారు. ప్రపంచం నలుమూలల నుండి వచ్చిన కస్టమర్లతో, ముగ్ధా దాని ప్రత్యేకత మరియు అద్భుతమైన కస్టమర్ సేవతో నిలుస్తుంది.

హైదరాబాద్ కస్టమర్లకు అతిపెద్ద ఆనందం ఏమిటంటే, డిజైనర్ శశి వంగపల్కి స్వయంగా అందుబాటులో ఉండటమే కాకుండా  వధువులతో వ్యక్తిగతంగా మాట్లాడి వారి అభిరుచికి అనుగుణంగా అందిస్తారు.

డిజైనర్ గురించి.. శశి వంగపల్లి ఐటి ఇంజనీర్ అయినప్పటికీ, తన అభిరుచిని అనుసరించి, 2012 లో “ముగ్ధ ఆర్ట్ స్టూడియో” లేబుల్‌తో ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు. అందుకు అనుగుణంగానే ఆమె అతి తక్కువ కాలంలో తన ప్రతిభ ద్వారా “స్టార్ డిజైనర్”గా మారారు.

సుష్మితా సేన్, రష్మిక, రకుల్ ప్రీత్ సింగ్, తాప్సీ పన్నూ, కాజల్ అగర్వాల్, నేహా ధూపియా తదితర  తారలకు ఆమె డిజైనింగ్ చేశారు.

“ముగ్ధ” బట్టల గురించి కాదు.., మహిళలను బాగా అర్థం చేసుకోవడానికి, వారి నిజమైన అందాన్ని వెలికి తీయడానికి సహాయపడే ప్రయత్నం అని ఆమె నమ్ముతారు.

చేనేత మరియు సిల్క్ చీరలతో పాటు, శశి వంగపల్లి  భారతదేశ చేనేతలను కాపాడటానికి ప్రయత్నిస్తున్నారు. ఆమె చేనేత వస్త్రాలను విస్తృతంగా ప్రోత్సహింస్తున్నారు.  తన కొత్త సేకరణతో భారతీయ అందమైన కళాకృతులు మరియు సంస్కృతి – “చేనేత వస్త్రాలు” సరైన ప్రేక్షకులను చేరుకునేలా చూడటానికి ప్రయత్నిస్తున్నారు. “ముగ్ధ” బట్టల గురించి కాదు.., మహిళలను బాగా అర్థం చేసుకోవడానికి, వారి నిజమైన అందాన్ని వెలికి తీయడానికి సహాయపడే ప్రయత్నం అని ఆమె నమ్ముతారు.

చేనేత మరియు సిల్క్ చీరలతో పాటు, శశి వంగపల్లి  భారతదేశ చేనేతలను కాపాడటానికి ప్రయత్నిస్తున్నారు. ఆమె చేనేత వస్త్రాలను విస్తృతంగా ప్రోత్సహింస్తున్నారు.  తన కొత్త సేకరణతో భారతీయ అందమైన కళాకృతులు మరియు సంస్కృతి – “చేనేత వస్త్రాలు” సరైన ప్రేక్షకులను చేరుకునేలా చూడటానికి ప్రయత్నిస్తున్నారు.