Movie Poster

రాక్‌స్టార్ య‌శ్‌, ప్ర‌శాంత్ నీల్ కాంబినేష‌న్‌లో హోంబ‌లే ఫిలింస్ నిర్మిస్తోన్న భారీ ప్యాన్ ఇండియా మూవీ ‘కేజీయ‌ఫ్ చాప్ట‌ర్ 2’ షూటింగ్ పూర్తి.. జ‌న‌వ‌రి 8న టీజ‌ర్ విడుద‌ల

By admin

December 21, 2020

ఎంటైర్ ఇండియ‌న్ సినీ ఇండ‌స్ట్రీ ఆస‌క్తిగా ఎదురుచూస్తోన్న ప్యాన్ ఇండియా మూవీస్‌లో ‘కేజీయ‌ఫ్ చాప్ట‌ర్ 2’ ఒక‌టి. క‌న్న‌డ రాక్‌స్టార్ యశ్ హీరోగా సెన్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో ఈ సినిమా రూపొందుతోంది. భారీ చిత్రాల‌కు కేరాఫ్‌గా నిలుస్తూ మ‌న సౌత్ సినిమాను ప్యాన్ ఇండియా రేంజ్‌కు తీసుకెళ్ల‌డ‌మే ధ్యేయంగా భారీ బ‌డ్జెట్‌, హై టెక్నిక‌ల్ వేల్యూస్‌తో సినిమాల‌ను నిర్మిస్తోన్న హోంబ‌లే ఫిలింస్ బ్యాన‌ర్‌పై విజ‌య్ కిర‌గందూర్  ఈ చిత్రాన్ని అన్‌కాంప్ర‌మైజ్డ్‌గా నిర్మిస్తున్నారు. హీరో యష్‌ పుట్టినరోజు సందర్భంగా ‘కేజీయ‌ఫ్ చాప్ట‌ర్ 2’ టీజ‌ర్‌ను 2021, జ‌న‌వ‌రి 8 ఉదయం 10 గంటల 18 నిమిషాలకు విడుద‌ల చేస్తున్న‌ట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్ర‌క‌టించింది. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ వారాహి చ‌ల‌న చిత్రం తెలుగులో ఈ చిత్రాన్ని విడుద‌ల చేస్తుంది.