కొత్త రాష్ట్రంలో ఫస్ట్ సినిమా “ఆపరేషన్
మాజీ ఎమ్ పి హర్ష కుమార్ గారి అబ్బాయి జీ వి శ్రీరాజ్ సినిమాటోగ్రాఫర్ తెరకెక్కుతున్న సినిమా “ఆపరేషన్ 533295”. సమైక్యాంధ్ర రాష్ట్రం రెండు భాగాలుగా విడిపోయిన తరువాత సినిమా ఇండస్ట్రీ కి సంబంధించి 24 శాఖలను పూర్తిగా ఆంధ్రప్రదేశ్ లోనే అభివృద్ధి చేసి తెరకెక్కిస్తున్న మొట్ట మొదటి సినిమా ఇది. రాజమండ్రి సమీపంలో గల మారేడుమల్లి ఫారెస్ట్ బ్యాక్డ్రాప్ లో పోలీస్ లకు మరియు నక్సల్స్ కు మధ్య జరిగే ఒక పోలీస్ ఆపరేషన్ గా ఈ సినిమాను తెరకెక్కించినట్టు చిత్ర యూనిట్ తెలిపారు. అంతేకాకుండా ఈ సినిమాలో నటించి ప్రతి ఆర్టిస్ట్ రాజమండ్రికి సంబందించిన వ్యక్తే అవ్వడం, వాళ్ళెవరికీ సినిమా ఇండస్ట్రీ తో సంబంధాలు కూడా లేని మాములు జనాలను నటీనటులుగా తీసుకోని చాలా నేచురల్ గా సినిమాను తెరకెక్కించినట్టు వివరించారు చిత్ర యూనిట్. అయితే లేవలం గంట మాత్రమే నిడివిగల ఈ సినిమాను ఓటిటి ప్లాట్ ఫామ్ లో రిలీజ్ చేయనున్నట్టు వివరించారు శ్రీరాజ్.
ఈ సినిమాలో నటీనటుల అందరూ కొత్తవారే అయినప్పటికీ చాలా స్పెషల్ టీమ్తో సినిమా నిర్మాణం జరిగిందని వివరించారు.
సినిమాని గంట తీయడానికి ముఖ్య కారణం కూడా ఓటీటీ అల్గారిథం రికమండేషన్ లో భాగంగా ఒక సీనియర్ సైకాలజిస్ట్ ని ఈ సినిమా నిర్మాణంలో భాగంగా ఎంపిక చేసుకుని, సినిమాని వీక్షించే టప్పుడు OTT లో కంట్రోలర్ ప్రేక్షకుడు చేతిలో ఉంటాది కనుక, డాన్సులు కి పాటలు కి ప్రాధాన్యత తక్కువ ఇచ్చే ఉన్న సాంగ్స్ కూడా సిచువేషన్ కి అనుసంధానంగా రూపొందించి. 60 నిమిషాల సినిమాలు ప్రేక్షకుడు కచ్చితంగా 55 నిమిషాలు సినిమా చూసినట్టు రూపొందించినట్లు ఆయన వివరించారు. ఎప్పుడైతే 90% రిటెన్షన్ రేటు ఉంటాదో ఆటోమేటిక్ గా ఓ టి టి అల్గారిథం రికమండేషన్ స్లో సినిమాని మొదటి స్థానంలో ఉంచుదాం అని ఆయన తెలిపారు.
బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సిచువేషన్ కి తగ్గట్టు హై టెన్షన్ మ్యూజిక్ తో పాటు హై క్వాలిటీ plug-ins వాడి సౌండ్ ఎఫెక్ట్స్ రూపొందించినట్లు తెలిపారు.
ప్రస్తుతానికి సినిమా 95% పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి చేసుకుందని జనవరి మొదటి వారంలో ఈ సినిమా విడుదల కాబోతుంది అని తెలిపారు.
ఈ ప్రెస్ మీట్ లో భాగంగా సినిమా ట్రైలర్ తో పాటు చౌరస్తా సింగర్ రామ్ మిరియాల పాడిన టువంటి మన్యపు కొండల్లో అనే పాట విడుదల చేశారు..
Song link
•No copyright issue
Final trailer
•No copyright issue
• All Media