శర్వానంద్ ‘శ్రీకారం’ చిత్రంలో ‘సంక్రాంతి సందళ్లే..’ పాట విడుదల
ఇదివరకు విడుదల చేసిన తొలి పాట ‘బలేగుంది బాలా’కు సంగీత ప్రియుల నుంచి అపూర్వమైన స్పందన లభించింది. పెంచల్ దాస్ రాచించి, పాడిన ఆ పాటకు 22 మిలియన్ వ్యూస్ పైగా రావడం విశేషం.
లేటెస్ట్గా సంక్రాంతి సంబరాలను, ఆ సందడిని అందంగా వివరించే “సందళ్లె సందళ్లే సంక్రాంతి సందళ్లే..” అంటూ సాగే పాటను చిత్ర బృందం విడుదల చేసింది. మిక్కీ జె. మేయర్ సుమధుర స్వరాలు కూర్చిన ఈ పాటను సానపాటి భరద్వాజ్ పాత్రుడు అందంగా రాయగా, అనురాగ్ కులకర్ణి, మోహన భోగరాజు ఆహ్లాదకరంగా ఆలపించారు. చిత్రంలోని ప్రధాన తారాగణంపై ఈ పాటను చిత్రీకరించారు. శోబి కొరియోగ్రఫీ అందించారు.
ఈ పాట వింటున్నా, చూస్తున్నా సంక్రాంతి పండుగ సందడి వారం రోజులు ముందుగానే వచ్చినట్లనిపిస్తోందనేది నిజం. సంక్రాంతి వైభోగమంతా ఆ పాటలో కనిపిస్తోంది. మెలోడీ ట్యూన్స్ కట్టడంలో మేటి అని పేరుపొందిన మ్యూజిక్ డైరెక్టర్ మిక్కీ మరోసారి చక్కటి స్వరాలతో ఆకట్టుకున్నారు. యువరాజ్ సూపర్బ్ సినిమాటోగ్రఫీతో చిత్రీకరణ పరంగానూ ఈ పాట అమితంగా ఆకట్టుకుంటోంది.
ఇప్పటివరకూ ఈ చిత్రానికి సంబంధించి విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్లకు, స్పెషల్ టీజర్‌కు అనూహ్యమైన స్పందన లభించింది.
‘గద్దలకొండ గణేష్’ వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత 14 రీల్స్ ప్లస్ బ్యానర్ నుంచి వస్తోన్న రెండో చిత్రం ‘శ్రీకారం’.
‘గద్దలకొండ గణేష్’కు వండర్ఫుల్ మ్యూజిక్ ఇచ్చిన మిక్కీ జె. మేయర్ ‘శ్రీకారం’ చిత్రానికీ చక్కని బాణీలు అందిస్తున్నారు. బుర్రా సాయిమాధవ్ డైలాగ్స్ రాస్తుండగా, జె. యువరాజ్ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు.
తారాగణం:
శర్వానంద్, ప్రియాంకా అరుళ్ మోహన్, రావు రమేష్, ఆమని, నరేష్, సాయికుమార్, మురళీ శర్మ, సత్య, సప్తగిరి.
సాంకేతిక బృందం:
డైలాగ్స్: సాయిమాధవ్ బుర్రా
మ్యూజిక్: మిక్కీ జె. మేయర్
సినిమాటోగ్రఫీ: జె. యువరాజ్
ఎడిటింగ్: మార్తాండ్ కె. వెంకటేష్
ఆర్ట్: అవినాష్ కొల్లా
పీఆర్వో: వంశీ-శేఖర్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: హరీష్ కట్టా
నిర్మాతలు: రామ్ ఆచంట, గోపీ ఆచంట
దర్శకుడు: కిశోర్ బి.
బ్యానర్: 14 రీల్స్ ప్లస్.