`జైసేన` – ప్రీ రిలీజ్ ఈవెంట్
రైతుని అభిమానించే ప్రతి వ్యక్తి గర్వపడే చిత్రం `జైసేన` – ప్రీ రిలీజ్ ఈవెంట్లో దర్శకనిర్మాత వి. సముద్ర.
శ్రీకాంత్, సునీల్, తారకరత్న, శ్రీరామ్ ప్రధాన పాత్రల్లో శ్రీ కార్తికేయ, అభిరామ్, ప్రవీణ్, హరీష్ గౌతమ్‌లను హీరోలుగా పరిచయం చేస్తూ వి.విజయలక్ష్మి, సుష్మారెడ్డి ఫిలిమ్స్ సమర్పణలో శివ మహాతేజ ఫిలిమ్స్ పతాకంపై వి. సముద్ర దర్శకత్వంలో వి. సాయి అరుణ్ కుమార్ నిర్మిస్తున్న చిత్రం ‘జై సేన’. ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదలైన టీజర్, ట్రైలర్, పాటలకి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రం జనవరి 29న విడుదలకాబోతున్న సందర్భంగా `జైసేన` గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ దసపల్లా హోటల్లో గ్రాండ్‌గా జరిగింది. ఈ కార్యక్రమంలో..
ప్రముఖ నిర్మాత కె.కె. రాధామోహన్ మాట్లాడుతూ – “సముద్ర గారితో మా బేనర్లో `అధినేత` సినిమా చేయడం జరిగింది. ఆ సినిమాలో కూడా మంచి సోషల్ మెసేజ్ ఇచ్చాం. అప్పటినుండి సముద్ర గారితో మంచి అనుభందం ఉంది. ఆయన చాలా స్పీడ్‌గా సినిమాలు తీస్తుంటారు. అలాగే ఆర్టిస్టుల నుండి మంచి పెర్ఫామెన్స్లు రాబట్టుకుంటారు. ఇప్పుడు శివమహాతేజ ఫిలింస్ బేనర్లో సముద్రగారి దర్శకత్వంలో రూపొందిన `జైసేన` సినిమాని ప్రేక్షకులు ఆదరించాలని కోరుకుంటూ..టీమ్ అందరికీ నా బెస్ట్ విషెస్ తెలుపుతున్నాను“ అన్నారు.
హీరో తనీష్ మాట్లాడుతూ – “జైసేన ట్రైలర్ విజువల్స్ చూస్తుంటే గతంలో వచ్చిన బ్లాక్‌బస్టర్ మూవీ `యువ` గుర్తుకువస్తుంది. సముద్రగారు ఒక ఫ్యామిలి మెంబర్లా ఉంటారు. సాయి అరుణ్, నేను చాలా మంచి ఫ్రెండ్స్. ఈ సినిమాతో నిర్మాతగా పరిచయమవుతున్నాడు. సముద్ర గారి అన్ని సినిమాల్లో ఏదో ఒక మెసేజ్ ఉంటూ ఉంటుంది. రైతు గురించి యువతని ఇన్స్పైర్ చేసే విధంగా నలుగురు కొత్త వారితో ఈ సినిమా తెరకెక్కించడం జరిగింది. ఈ సినిమా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నారు“ అన్నారు.
ప్రముఖ నిర్మాత శోభారాణి మాట్లాడుతూ – “జైసేన చాలా పవర్ఫుల్ టైటిల్. నేను ఈ సినిమా చూశాను. చాలా బాగుంది. ఈ మూవీలో ప్రతి క్యారెక్టర్ని పర్ఫెక్ట్గా తీర్చిదిద్దారు. ప్రతి ఫ్రేమ్‌లో సముద్రగారు పడ్డ కష్టం కనిపిస్తుంది. ఈ సినిమాకి మెయిన్ అట్రాక్షన్ సునీల్ గారు. ఆయన నటన సినిమాకి మంచి ప్లస్ అవుతుంది. శ్రీకాంత్‌గారు, తారకరత్న, శ్రీరామ్ సహా అందరి క్యారెక్టర్స్ చాలా బాగున్నాయి. మంచి టీమ్ కుదిరింది. ఈ చిత్రం కచ్చితంగా చాలా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను“ అన్నారు.
నిర్మాత తుమ్మలపల్లి రాంసత్యనారాయణ మాట్లాడుతూ – “సముద్ర ప్రతి సినిమాని ఒక యజ్ఞంలాగా ఎంతో కష్టపడి సినిమా తీస్తాడు. ఇంత మంది ప్రముఖ నటీనటులతో తీసిన జైసేన సినిమా తప్పకుండా సూపర్‌హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను“ అన్నారు.
నిర్మాత ప్రతాని రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ – “సముద్ర నాకు మంచి మిత్రుడు. ఎంతో కష్టపడి ఈ సినిమాని బ్రహ్మండంగా తీశారు. ఇలాంటి గట్స్ ఉన్న డైరెక్టర్స్ ఇండస్ట్రీలో ఉంటేనే ఇంకా మంచి మంచి సినిమాలు తీయడానికి అవకాశం ఉంటుంది. రైతు సబ్జెక్ట్‌తో చేసిన ఈ సినిమా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను“ అన్నారు.
కో ప్రొడ్యూసర్ శిరీష్ రెడ్డి మాట్లాడుతూ – “సముద్ర గారు వన్ ఆఫ్ ది గ్రేట్ టెక్నీషియన్. శ్రీకాంత్‌గారు, సునీల్‌గారు, తారకరత్నగారు, శ్రీరామ్‌గారు ఈ సినిమాకి నాలుగు పిల్లర్స్. మా టీమ్ అందరూ ఎంతో కష్టపడి తీసిన జైసేన సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నా“ అన్నారు. .
దర్శక నిర్మాత వి. సముద్ర మాట్లాడుతూ – “నేను ఆహ్వానించగానే ఈ ఫంక్షన్‌కి వచ్చిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. జైసేన సినిమా చూసి రైతుని అభిమానించే ప్రతి వ్యక్తి గర్వపడతాడు. అలాగే పవన్ కళ్యాణ్ గారి ప్రతి అభిమాని గర్వపడే సినిమా ఇది. ఒక జవాన్ని గౌరవించినట్టు రైతుని కూడా గౌరవించాలి అని చెప్పే చిత్రమిది. నేను అడగగానే నా మీద అభిమానంతో ఈ సినిమాలో నటించిన శ్రీకాంత్‌గారికి, సునీల్గారికి అలాగే తారకరత్న, శ్రీరామ్ గారికి ధన్యవాదాలు. కొత్త వారైనా మా హీరోలు కార్తికేయ, అభిరామ్, ప్రవీణ్, హరీష్ గౌతమ్ చక్కగా నటించారు. జనవరి 29న థియేటర్లలో చాలా గ్రాండ్‌గా విడుదలవుతున్న జైసేన చిత్రాన్ని బిగ్గెస్ట్ హిట్ చేయాలని కోరుకుంటున్నాను“ అన్నారు.
హీరో సునీల్ మాట్లాడుతూ – “సముద్ర గారు నా క్యారెక్టర్ గురించి చెప్పగానే నాకు బాగా నచ్చి ఈ సినిమా చేయడం జరిగింది. నా పాత్రకి చందు చాలా పవర్ఫుల్ డైలాగ్స్ రాశారు. అలాగే ఈ సినిమాలో చాలా మంది కొత్త వారు నటించడం జరిగింది. వారందరూ పెద్ద స్టార్స్ అవ్వాలని కోరుకుంటున్నాను. రైతుల గురించి ఒక మంచి ఉద్దేశ్యంతో తీసిన ఈ సినిమా తప్పకుండా పెద్ద సక్సెస్ అవుతుంది. జనవరి 29 విడుదలవుతున్న జైసేన సినిమా చూసి సముద్ర గారి థాట్‌ని ఎంకరేజ్ చేస్తే.. ఆ రైతుకి మీరు తిరిగి ప్రాణం పోసినట్టే“ అన్నారు.
ఈ కార్యక్రమంలో దర్శక నిర్మాతలు ఆర్.ఎస్ శ్రీనివాస్, ఆచంట గోపీనాథ్, దొరైరాజు, సుబ్బారెడ్డి, రాజ్పుత్ర్, బాపిరాజు, సురేష్ కొండేటి, హీరోలు శ్రీ కార్తికేయ, అభిరామ్, ప్రవీణ్, హరీష్ గౌతమ్, హీరోయిన్స్ ఆరాధ్య, రచయిత చందు మరియు చిత్ర యూనిట్ పాల్గొని ప్రసంగించారు.
శ్రీకాంత్, సునీల్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం ద్వారా శ్రీకార్తికేయ, అభిరామ్, ప్రవీణ్, హరీష్‌గౌతమ్ పరిచయం అవుతున్నారు. శ్రీరామ్, అజయ్ ఘోష్, మధు, ఆజాద్, ధనరాజ్, వేణు, చమ్మక్ చంద్ర తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫి: వాసు, సంగీతం: ఎస్. రవిశంకర్, ఎడిటింగ్: నందమూరి హరి, మాటలు: తిరుమల శెట్టి సుమన్, పారవతిచంద్, పాటలు: అభినయ్ శ్రీను, సిరాశ్రీ, డ్యాన్స్: అమ్మారాజశేఖర్, అజయ్, ఫైట్స్: కనల్ కన్నన్, నందు, రవివర్మ, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: పి.ఆర్. చంద్రయాదవ్, లైన్ ప్రొడ్యూసర్: వి.గోపాలకృష్ణ. కో ప్రొడ్యూసర్స్: పి. శిరీష్ రెడ్డి, దేసినేని శ్రీనివాస్, సమర్పణ: విజయలక్ష్మి, నిర్మాత: వి.సాయి అరుణ్ కుమార్, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వి.సముద్ర.