శ‌ర్వానంద్‌, సిద్ధార్థ్‌, అజ‌య్ భూప‌తి 'మ‌హాస‌ముద్రం' ఆగ‌స్ట్ 19న విడుద‌ల‌

తెలుగు

శ‌ర్వానంద్‌, సిద్ధార్థ్‌, అజ‌య్ భూప‌తి ‘మ‌హాస‌ముద్రం’ ఆగ‌స్ట్ 19న విడుద‌ల‌

By admin

January 30, 2021

శ‌ర్వానంద్‌, సిద్ధార్థ్‌, అజ‌య్ భూప‌తి ‘మ‌హాస‌ముద్రం’ ఆగ‌స్ట్ 19న విడుద‌ల‌

శ‌ర్వానంద్‌, సిద్ధార్థ్ హీరోలుగా అజ‌య్ భూప‌తి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ‘మ‌హాస‌ముద్రం’ ఆగ‌స్ట్ 19న విడుద‌ల కానున్న‌ది. అదితి రావ్ హైద‌రి, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్లుగా న‌టిస్తోన్న ఈ మూవీని ఎ.కె. ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై రామ‌బ్ర‌హ్మం సుంక‌ర నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసిన‌ప్ప‌ట్నుంచీ ఇండ‌స్ట్రీ స‌ర్కిల్స్‌లోనూ, ప్రేక్ష‌కుల్లోనూ అమితాస‌క్తి వ్య‌క్త‌మ‌వుతూ వ‌స్తున్న విష‌యం తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించిన ప్ర‌తి అప్‌డేట్ అంద‌రిలోనూ కుతూహ‌లాన్ని క‌లిగిస్తోంది.

శ‌నివారం మ‌హాస‌ముద్రం రిలీజ్ డేట్ పోస్ట‌ర్‌ను డైరెక్ట‌ర్ అజ‌య్ భూప‌తి త‌న ట్విట్ట‌ర్ హ్యాండిల్ ద్వారా షేర్ చేశారు. ఆ పోస్ట‌ర్‌లో స‌ముద్రం ఒడ్డున ఉన్న ఓ బోట్‌పై ఒక‌రికొక‌రు వీపులు చూపిస్తూ కూర్చొని సిగ‌రెట్ తాగుతున్న ఇద్ద‌రు హీరోలు క‌నిపిస్తున్నారు. ఆ పోస్ట‌ర్‌తో పాటు, “Our Sail in Theatres Begins this August 19th #MahaSamudram. Join this Voyage to witness an Epic tale of #ImmeasurableLove” అంటూ రాసుకొచ్చారు.

తొలిసారిగా ఓ అపురూప‌మైన ప్రేమ‌క‌థ‌ను త‌మ బ్యాన‌ర్‌పైన అందిస్తున్నామ‌ని నిర్మాత అనిల్ సుంక‌ర చెప్పారు. “ఇన్నేళ్లుగా మీరెందుకు ఓ ల‌వ్ స్టోరీని నిర్మించ‌డం లేద‌ని ప్ర‌తి ఒక్క‌రూ న‌న్ను అడుగుతూ వ‌స్తున్నారు. ఇప్పుడు మేం ఎప్ప‌టికీ గ‌ర్వ‌ప‌డే ఓ అపురూప‌మైన, అపార‌మైన ల‌వ్ యాక్ష‌న‌ర్‌ను అందిస్తున్నాం. 19 ఆగ‌స్ట్ 2021న తీరాల‌ను ఢీకొట్ట‌డానికి ‘మ‌హాస‌ముద్రం’ వ‌స్తోంది.” అని ఆయ‌న ట్వీట్ చేశారు.

ఈ చిత్రానికి రాజ్ తోట సినిమాటోగ్రాఫ‌ర్‌గా, చైత‌న్ భ‌రద్వాజ్ మ్యూజిక్ డైరెక్ట‌ర్‌గా, ప్ర‌వీణ్ కె.ఎల్‌. ఎడిట‌ర్‌గా, కొల్లా అవినాష్ ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్‌గా ప‌ని చేస్తున్నారు.

తారాగ‌ణం: శ‌ర్వానంద్‌, సిద్ధార్థ్‌, అదితి రావ్ హైద‌రి, అను ఇమ్మాన్యుయేల్‌

సాంకేతిక బృందం: ర‌చ‌న‌-ద‌ర్శ‌క‌త్వం: అజ‌య్ భూప‌తి నిర్మాత‌: సుంక‌ర రామ‌బ్ర‌హ్మం ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌: కిషోర్ గ‌రిక‌పాటి స‌హ నిర్మాత‌: అజ‌య్ సుంక‌ర‌ సంగీతం: చైత‌న్ భ‌ర‌ద్వాజ్‌ సినిమాటోగ్ర‌ఫీ: రాజ్ తోట‌ ప్రొడ‌క్ష‌న్ డిజైన్‌: కొల్లా అవినాష్‌ ఎడిటింగ్‌: ప్ర‌వీణ్ కె.ఎల్‌.