“అన్నపూర్ణమ్మగారి మనవడు” పాస్ మార్కులతో పాసయ్యాడు.
జనవరి 29న ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిన్న చిత్రాల ఒరవడిలో “30 రోజుల్లో ప్రేమించడం ఎలా” చిత్రం ఓపెనింగ్స్ ని దుమ్ము రేపింది అన్నారు. ఆ తర్వాత రోజు మాత్రం చల్లారిపోయింది. ఇక ఎప్పటి నుంచో ఊరిస్తున్న “అన్నపూర్ణమ్మగారి మనవడు” కి థియేటర్లు తక్కువ పడినప్పటికీ ఫ్యామిలీ ఆడియన్స్ ని మాత్రమే ఆకట్టుకోగలిగింది.
అన్నపూర్ణమ్మ, జమున, సుధ లాంటి పాత తరం నటీనటులు నటించడమే కాకుండా అర్చన బాలాదిత్య లు ఆడియన్స్ లో కొద్దిగా ఊపు తెచ్చారు. కెమెరా పనితనం బాగుంది. పాటలు యావరేజ్ గా ఉన్నాయి. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ దరిద్రంగా ఉంది. కథ కథనంలో మంచి పట్టు ఉంది. మనవడి పాత్రలో బాలనటుడు బాగున్నాడు.
ఓవరాల్ గా చెప్పాలంటే దర్శకుడు నర్రా శివనాగేశ్వరరావు ప్రతిభ ఈ సినిమాను నిలబెట్టింది. టోటల్ గా 29న విడుదలైన సినిమాలలో “30 రోజుల్లో ప్రేమించడం ఎలా” తర్వాత చెప్పుకోదగ్గ సినిమా “అన్నపూర్ణమ్మగారి మనవడే” అని చెప్పుకోవాలి.
ఇండియన్ బులెటిన్ డెస్క్ కమ్ సర్వే ప్రకారం బయ్యర్స్ టాక్ యావరేజ్ గా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ మూడు రోజుల్లో వసూలైన కలెక్షన్స్ 3 Crores 50 Lakhs అని అంచనా.
ఏది ఏమైనప్పటికీ “అన్నపూర్ణమ్మగారి మనవడు” ఫ్యామిలీ ఆడియన్స్ ని మాత్రమే ఆకట్టుకోగలిగిందనే చెప్పాలి. రేటింగ్ : 3/5
- ఇండియన్ బులెటిన్ డెస్క్