యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ విడుదల చేసిన ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ టీజర్
యంగ్ హీరో సుశాంత్ ‘అల.. వైకుంఠపురములో’ చిత్రంలో చేసిన పాత్రతో ఇటు విమర్శకుల, అటు ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. ఆ మూవీ తర్వాత ఆయన కథానాయకుడిగా నటిస్తోన్న చిత్రం ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’. ఎస్. దర్శన్ డైరెక్ట్ చేస్తోన్న ఈ ఫిల్మ్‌ను ఏఐ స్టూడియోస్, శాస్త్ర మూవీస్ బ్యానర్లపై రవిశంకర్ శాస్త్రి, ఏక్తా శాస్త్రి, హరీష్ కోయలగుండ్ల నిర్మిస్తున్నారు. ‘నో పార్కింగ్’ అనేది ట్యాగ్ లైన్. మీనాక్షి చౌధరి హీరోయిన్.
శుక్రవారం ఈ మూవీ టీజర్‌ను యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ విడుదల చేశారు. 1 నిమిషం 30 సెకన్ల నిడివి వున్న ఈ టీజర్ చూశాక తప్పకుండా సినిమాని చూడాలనే క్యూరియాసిటీని ఆడియెన్స్‌లో కలిగిస్తోంది. అంత ఉత్కంఠభరితంగా టీజర్ ఉంది. టైటిల్‌లో సజెస్ట్ చేసినట్లు నో పార్కింగ్ ప్లేస్‌లో తన కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌ను హీరో సుశాంత్ పార్క్ చేస్తే, కాలనీవాసులు దాన్ని ధ్వంసం చేసినట్లు టీజర్‌ను బట్టి తెలుస్తోంది. అక్కడ బైక్‌ను హీరో పార్క్ చేయడం వెనుక కూడా ఏదో కథ ఉందని అర్థమవుతోంది. నవ్వులు పండించే బాధ్యతను వెన్నెల కిశోర్ తీసుకున్నారని టీజర్ తెలియజేస్తోంది. అందమైన ప్రేమకథకు మిస్టరీ ఎలిమెంట్‌ను జోడించి డైరెక్టర్ దర్శన్ ఇచ్చట వాహనములు నిలుపరాదు చిత్రాన్ని మలిచారు.
ప్రవీణ్ లక్కరాజు బ్యాగ్రౌండ్ స్కోర్, ఎం. సుకుమార్ సినిమాటోగ్రఫీ సినిమాకి ఎస్సెట్స్ అవుతాయనే నమ్మకం టీజర్ కలిగిస్తోంది. సుశాంత్ కెరీర్‌లోని బెస్ట్ ఫిలిమ్స్‌లో ఒకటిగా ఈ సినిమా నిలుస్తుందని చెప్పవచ్చు.
తారాగణం: సుశాంత్, మీనాక్షి చౌధరి, వెంకట్, వెన్నెల కిశోర్, ప్రియదర్శి, అభినవ్ గోమటం, ఐశ్వర్య, నిఖిల్ కైలాస, కృష్ణచైతన్య, హరీష్
సాంకేతిక బృందం: సంగీతం: ప్రవీణ్ లక్కరాజు సినిమాటోగ్రఫీ: ఎం. సుకుమార్ ఎడిటింగ్: గ్యారీ బీహెచ్ సంభాషణలు: సురేష్ భాస్కర్ ఆర్ట్: వి.వి. పీఆర్వో: వంశీ-శేఖర్ నిర్మాతలు: రవిశంకర్ శాస్త్రి, ఏక్తా శాస్త్రి, హరీష్ కోయలగుండ్ల దర్శకత్వం: ఎస్. దర్శన్ బ్యానర్స్: ఏఐ స్టూడియోస్, శాస్త్ర మూవీస్