జూబ్లీహిల్స్‌లో “మాటిస్” సంస్థని ప్రారంభించిన మినిస్టర్ హరీష్ రావు మరియు ప్రముఖ హీరో జయంత్ రెడ్డి “ఇంటి”రియర్ అందాన్ని రెట్టింపు చేసే సరికొత్త గృహలంకరణ విధానాన్ని జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 68లో “మాటిస్” సంస్థ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఒక కొత్త ఇంటీరియర్ కాన్సెప్ట్ తో ఈ స్టోర్‌ను నగర వాసుల కోసం అందుబాటులోకి తెచ్చారు. రిలయన్స్ ఇండస్ట్రీకి చెందిన రెలవుడ్, డుపాంట్స్ కొరియన్ ఉత్పత్తులను మాటిస్‌లో ఉపయోగిస్తున్నట్లు నిర్వాహకులు తరుణ్ పటేల్, కిషన్, దీపక్, నందీప్, జయంత్ రెడ్డి తెలిపారు. ఈ స్టోర్ ను మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్యే దానం నాగేందర్, మాగంటి గోపీనాథ్, సంగారెడ్డి zpp మంజుశ్రీ జైపాల్ రెడ్డి, ప్రారంభించారు. ఇప్పుడు ఇల్లు కొనే చాలా మంది ఇంటీరియర్ విషయంలో ఎంతో ఆసక్తి చూపుతున్నారని అన్నారు. ఇంటి అందాన్ని ఇది రెట్టింపు చేస్తుందని అన్నారు. ఇంటి కొనుగోలుదారులకు ఒక కొత్త అనుభూతిని ఇవ్వడంతోపాటు నలుగురిలో తమను ప్రత్యేకంగా నిలపడంలో మాటిస్ తన వంతు పాత్ర పోషిస్తుందని భావిస్తున్నట్లు తెలిపారు