ఉప్పెన రివ్యూ

సినిమాః ఉప్పెన‌
రేటింగ్ః 2.75

మెగా మేన‌ల్లుడు వైష్ణ‌వ్ తేజ్  హీరోగా ప‌రిచయం అవుతూ రూపొందిన ప్రేమ క‌థా చిత్రం `ఉప్పెన‌`. ద‌ర్శ‌కుడుగా బుచ్చిబాబుని ప‌రిచ‌యం చేస్తూ మైత్రి మూవీ మేక‌ర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించింది. నీ క‌న్ను నీలి స‌ముద్రం పాట‌తో ఈ సినిమా హైప్ క్రియేట్ చేసింది. ఆ త‌ర్వాత విడుద‌లైన పాట‌లు, ట్రైల‌ర్, విజ‌య్ సేతుప‌తి విల‌నిజం  సినిమాపై మంచి అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. ఇక ఇన్ని అంచ‌నాల మ‌ధ్య విడుద‌లైన ఉప్పెన ఈ రోజు విడుదలైంది. ఎలా ఉందో రివ్యూ చూద్దాం…

స్టోరిః
ఆశీ (వైష్ణ‌వ్ తేజ్ ) ఒక సాదా సీడా మ‌త్స్య‌కారుడు, స‌ముద్రం ప‌క్కనే జీవితం. ఇత‌డు చిన్న‌ప్ప‌టి నుంచే పేరున్న ఆసామి శేషా రాయ‌ణం కూతురు (కృతిశెట్టి) బేబ‌మ్మ‌ను ప్రేమిస్తుంటాడు. ఆశీతో పాటు త‌న‌పై ప్రేమ కూడా పెరిగి పెద్ద‌ద‌వుతుంది. ఒక‌నొక సంద‌ర్బంలో చూపులు క‌లిసి ఇద్ద‌రూ ప్రేమించుకుంటారు. వీరి ప్రేమ రాయ‌ణం కి తెలుస్తుంది. పరువే ప్రాణంగా బ‌తికే రాయ‌ణం వీరిద్ద‌రినీ విడ‌దీయ‌డానికి ఏం చేశాడు. చివ‌రికి వీరిద్ద‌ర‌రూ క‌లిశారా?  లేదా? అన్నది మిగ‌తా క‌థాంశం.

సినిమా హైలెట్స్ః
సాదా సీదా మ‌త్స్య కారుడుగా వైష్ణ‌వ్ తేజ్ చాలా నేచ‌ర‌ల్‌గా న‌టించాడు. అలాగే పెద్దింటి అమ్మాయిగా కృతి శెట్టి కూడా ఆక‌ట్టుకుంటుంది. హీరో హీరోయిన్స్ ఇద్ద‌రికీ ఇది తొలి సినిమా అన్న భావ‌న ఎక్క‌డా లేకుండా న‌టించారు. మెగా మేన‌ల్లుడుగా వైష్ణ‌వ్ క‌ళ్ల‌తో మేజిక్ చేశాడు.  హీరో హీరోయిన్స్ కి మ‌ధ్య వ‌చ్చే ల‌వ్ సీన్స్ ఆక‌ట్టుకునే విధంగా ఉంటాయి. ఇక సినిమాకే హైలెట్ గా విజ‌య్ సేతుప‌తి న‌ట‌న ఉంద‌న‌డంలో సందేహం లేదు.  ద‌ర్శ‌కుడు తీసిన విధానం కొత్త‌గా లేకున్నా క‌థ‌కు త‌గ్గ‌ట్టుగా ఉంది. దేవిశ్రీ ప్ర‌సాద్ పాట‌లు, నేప‌థ్య సంగీతం సినిమాకు ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ.

సినిమాకు మైన‌స్ః
ఫ‌స్టాప్ కొంచెం నెమ్మ‌దించిన‌ట్లుగా అనిపిస్తుంది.  బ్యాక్ డ్రాప్ త‌ప్ప క‌‌థ విష‌యానికొస్తే రొటీన్ గానే ఉంటుంది. క‌థ‌ను మ‌లుపు తిప్పే సన్నివేశాలు ఊహించ‌గ‌లిగేవేగా ఉంటాయి. నెక్ట్స్ సీన్ ఏంట‌నేది ఇట్టే చెప్పేయ‌వ‌చ్చు.  హీరో పురుషాంగం క‌ట్ చేసే అంశం అనేది ఇందులో కొత్త పాయింట్ దాన్ని ప్రేక్ష‌కులు ఎంత వ‌ర‌కు రిసీవ్ చేసుకుంటార‌న్న‌ది చూడాలి. సాంగ్స్ విన‌డానికి బాగున్నా, పిక్చ‌రైజేష‌న్ ప‌రంగా ఏదో మిస్సైన ఫీలింగ్, అలాగే విల‌న్ విజ‌య్  సేతుప‌తి క్యారక్ట‌ర్ కూడా  ఇంకా ఏదో కావాల‌న్న ఫీలింగ్ ఉంటుంది.

ఫైన‌ల్ గా చెప్పాలంటేః
మ‌గ‌త‌నం అంటే మ‌గాడి కాళ్ల సందులో ఉండేది కాదు న‌ర‌న‌రంలో ఉండేది. ప్రేమించ‌డం అంటే ప‌డ‌క సుఖం మాత్ర‌మే కాదు ప్రేమించిన‌వాడు ప‌క్క‌లో ఉంటే చాలు అనేది ఈ సినిమా ద్వారా చెప్పే ప్ర‌య‌త్నం చేశారు ద‌ర్శ‌కుడు. ద‌ర్శ‌కుడు తీసుకున్న క‌థ పాత‌దే దాన్ని ఆస‌క్తిక‌రంగా చెప్పే ప్ర‌య‌త్నం జ‌రిగింది. పాట‌లు, న‌టీన‌టుల హావ‌భావాలు కుదిరాయి. ఫ‌స్టాప్ లో లాగిన ఫీలింగ్, సెకండాఫ్ లో ఏదో మిస్సైన ఫీలింగ్ త‌ప్ప సినిమా ఆక‌ట్టుకుంటుంద‌నే చెప్పాలి.  క్లైమాక్స్ సినిమాకు ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌గా నిలుస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *