నేనేం చేశానో తెలియదంటోన్న హాట్ యాంకర్ టాలీవుడ్ రంగమ్మ అత్త… బుల్లి తెర హాట్ యాంకర్ అనసూయను `తెలంగాణ చిత్రపురి ఫిలిం ఫెస్టివెల్` సొంత పోస్టల్‌తో సత్కరించింది. ఈ పోస్టల్‌తో దిగిన ఫొటోను ఇన్‌స్ట్రా గ్రాంమ్‌లో పోస్ట్ చేస్తూ భావోద్వేగానిక గురయ్యారు అనసూయ. ఈ సందర్భంగా అనసూయ `జీవితంలో అంతకు మించిన గౌరవం ఏముంటుంది. నా సొంత పోస్టల్ స్టాంపులు. ఇందుకు అర్హురాలయ్యేందుకు నేనేం చేశానో నాకే తెలియదు. చిత్రపురి ఫిలిం ఫెస్టివల్… ఈ విలాసానికి ముందే నేను మీ గురించి గర్వపడుతున్నాను. మీరు చేసే గొప్ప పనులకు నేను చేయగలిగిందంతా… చేస్తానని మాటిస్తున్నాను` అని పోస్టు పెట్టింది. ప్రస్తుతం అనసూయ `థాంక్యూ బ్రదర్` సినిమాలో నటిస్తుంది. మరికొన్ని సినిమాల్లో స్పెషల్ సాంగ్స్‌లో నటిస్తుంది. ఇటు వెండితెరపై… బుల్లి తెరపై పలు కార్యక్రమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉంది.