'Kapatadhaari' Theme Trailer unveiled

News

`క‌ప‌ట‌ధారి` థీమ్ ట్రైల‌ర్ విడుద‌ల

By admin

February 16, 2021

క‌ప‌ట‌ధారి` థీమ్ ట్రైల‌ర్ విడుద‌ల‌

ఆర్కియాల‌జీలో ఎప్పుడో జ‌రిగిన హ‌త్య‌… హంత‌కుడు ఎవ‌రో తెలియ‌దు. పోలీస్ డిపార్ట్‌మెంట్ కూడా అంతు ప‌ట్ట‌ని ఆ హంత‌కుడు ర‌హ‌స్యాన్ని ఓ ట్రాఫిక్ ఇన్స్‌పెక్ట‌ర్ ఎలా చేధించాడ‌నే అంశంతో రూపొందిన స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ `క‌ప‌ట‌ధారి`.

వైవిధ్య‌మైన పాత్ర‌లు, క‌థా చిత్రాల్లో న‌టించ‌డానికి ఆస‌క్తి చూపించే హీరో సుమంత్ మ‌రో విభిన్న‌మైన పాత్ర‌లో ఆక‌ట్టుకోవ‌డానికి సిద్ధ‌మ‌య్యారు. క‌ప‌ట‌ధారి చిత్రంలో సుమంత్ ట్రాఫిక్ ఇన్‌స్పెక్ట‌ర్ పాత్ర‌లో న‌టించారు. క‌న్న‌డంలో సూప‌ర్ హిట్ చిత్ర‌మైన `కావ‌లుధారి` సినిమాకు ఇది రీమేక్‌. `క‌ప‌ట‌ధారి` చిత్రం ఫిబ్ర‌వ‌రి 19న విడుద‌ల కానుంది. ఈ సినిమా థీమ్ ట్రైల‌ర్‌ను సోమ‌వారం చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. ఓ మ‌నిషి నిజాన్ని బ‌తికించ‌డానికి స‌మరం చేయాల‌ని చెప్పే మాంటేజ్ సాంగ్ ఈ థీమ్ ట్రైల‌ర్‌లో ఆక‌ట్టుకుంటోంది. అస‌లు హంత‌కుడు ఎవ‌రు? అనే విష‌యాన్ని గోప్యంగా ఉంచుతూ ఇప్ప‌టి వ‌ర‌కు చేసిన `క‌ప‌ట‌ధారి` ప్ర‌మోష‌న్స్ సినిమాపై ఆస‌క్తిని పెంచాయి. మంగ‌ళ‌వారం(ఫిబ్ర‌వ‌రి 16)రోజున `క‌ప‌ట‌ధారి` ప్రీ రిలీజ్ వేడుక జరగనుంది. ఈ వేడుకకి కింగ్ నాగార్జున ముఖ్య అతిథిగా హాజరు అవుతున్నారు.

ప్ర‌దీప్ కృష్ణ‌మూర్తి ద‌ర్శ‌క‌త్వంలో  క్రియేటివ్ ఎంట‌ర్‌టైనర్స్ అండ్ డిస్ట్రిబ్యూట‌ర్స్ బ్యాన‌ర్‌పై కపటధారి చిత్రాన్ని డా.ధ‌నంజ‌యన్ నిర్మిస్తున్నారు.నాజర్‌, సంపత్‌, జయప్రకాశ్‌ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. రీసెంట్‌గా సమంత అక్కినేని విడుదల చేసిన ఈ సినిమా ట్రైలర్‌కు సూపర్బ్‌ రెస్పాన్స్ వచ్చింది.

న‌టీన‌టులు: సుమంత్‌, నందిత‌, నాజ‌ర్‌, జ‌య‌ప్ర‌కాశ్‌, సంప‌త్ త‌దిత‌రులు

సాంకేతిక వ‌ర్గం:

ద‌ర్శ‌క‌త్వం:  ప్ర‌దీప్ కృష్ణ‌మూర్తి నిర్మాత‌:  డా.జి.ధ‌నంజ‌య‌న్‌ యాక్ష‌న్‌: స‌్టంట్ సిల్వ‌ మ్యూజిక్‌:  సైమ‌న్ కె.కింగ్‌ ఆర్ట్‌:  విదేశ్‌ ఎడిటింగ్‌:  ప్ర‌వీణ్ కె.ఎల్‌ మాట‌లు:  బాషా శ్రీ స్క్రీన్ ప్లే అడాప్ష‌న్‌:  డా.జి.ధ‌నంజ‌య‌న్‌ క‌థ‌:  హేమంత్ ఎం.రావు పి.ఆర్‌.ఒ:  వంశీ కాకా